నాకు మత్తు ఇచ్చి పోర్న్‌ వీడియో తీశారు: మాజీ మిస్‌ ఇండియా యూనివర్స్‌ | Former Miss India Universe Pari Paswan Alleges Production House Filming Her Porn Video After Spiking Drink | Sakshi
Sakshi News home page

పోర్నోగ్రఫీ: ప్రొడక్షన్‌ హౌజ్‌పై మాజీ మిస్‌ యూనివర్స్‌ సంచలన వ్యాఖ్యలు

Published Tue, Aug 31 2021 8:50 PM | Last Updated on Tue, Aug 31 2021 9:31 PM

Former Miss India Universe Pari Paswan Alleges Production House Filming Her Porn Video After Spiking Drink - Sakshi

శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్ర పోర్నోగ్రఫీ కేసు బాలీవుడ్‌నలో సంచలం రేపిన సంగతి తెలిసిందే. ఇటీవల బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా తమతో బలవంతంగా అశ్లీల చిత్రాలను చిత్రీకరంచి యాప్‌లో అప్‌లోడ్‌ చేశాడంటూ పలువురు అమ్మాయిలు అతడిపై ఆరోపణలు చేశారు. దీంతో ఈ కేసులో అతడిపై ఆరోపణలు రుజువు కావడంతో రాజ్‌కుంద్రా జైలుగా కూడా వెళ్లాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉండగానే తాజాగా మరో పోర్నోగ్రఫీ వ్యవహరం బాలీవుడ్‌లో వెలుగు చూసింది. ఇందులో బాధితురాలుగా మాజీ మిస్‌ ఇండియా యూనివర్స్‌ పరీ పాసవాన్‌ ఉండటం మరింత సంచలనం సృష్టిస్తోంది.

చదవండి: భర్త రాజ్‌కుంద్రాకు శిల్పా విడాకులు ఇవ్వబోతోందా?!

ఓ ప్రొడక్షన్‌ హౌజ్‌ తనకు మత్తు పదార్థాలు కలిపిన కూల్‌ డ్రింగ్‌ ఇచ్చి తనపై పోర్న్‌ వీడియో షూట్‌ చేశారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. ‘నేను ముంబై వచ్చిన కొత్తలో ఓ ప్రొడక్షన్‌ హౌజ్‌కు వెళ్లాను. అక్కడ వాళ్లు నాకు కూల్‌డ్రింగ్‌ ఇచ్చారు. అయితే అందులో మత్తు కలిపి నేను స్పృహా కొల్పోయేలా చేసి ఆ తర్వాత నాపై అడల్ట్‌ కంటెంట్‌ వీడియో తీశారు. ఈ విషయం తెలిసిన వెంటనే నేను పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాను’ అని వెల్లడించింది. అయితే ఆమె ఆ ప్రొడక్షన్‌ హౌజ్‌ పేరు మాత్రం ఆమె బయట పెట్టలేదు.

చదవండి: అందుకే అబ్‌రాంకు కాజోల్‌ అంటే నచ్చదు: షారుక్‌

కాగా గతంలో పరీ పాసవాన్‌ తన భర్త వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఆమె భర్త నీరజ్‌ పాసవాన్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు కూడా తరలించారు. అయితే ఈ కేసులో భర్త నీరజ్‌ తరపు బంధువులు పరీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పరీ పాసవాన్ ముంబయికి చెందిన ఓ ప్రొడక్షన్ హౌస్ లో పోర్న్ ఫిలింలో నటించిందని.. అమాయకులను బుట్టలో వేసుకోవడమే తన పని అని ఆరోపించారు. అంతేకాకుండా ఆమెకు 12 ఏళ్ల కూతురు ఉందని.. ఇంతకుముందే ఇద్దరితో పెళ్లి కూడా అయిందని నీరజ్ సోదరుడు చందన్ పేర్కొన్నారు. కాగా పారి పాసవాన్‌ 2019లో జరిగిన మిస్‌ ఇండియా యూనివర్స్‌ కంటెస్టెంట్‌ పాల్గొని టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఆమెకు నీరజ్‌తో పరిచయం, ఆ తర్వాత పెళ్లి జరిగింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement