సొగసిరి
అచ్చ తెలుగు చీర కట్టులో సంప్రదాయ సిరులు కురిపించారు ముద్దుగుమ్మలు. మెరిపించే పట్టు వస్త్రాలు ధరించి కొత్త పెళ్లికూతుళ్లలా మురిపించారు.
సోమాజిగూడ సీఎంఆర్ ఎక్స్‌క్లూజివ్‌లో శుక్రవారం జరిగిన డిజైనర్ బ్రైడల్ కలెక్షన్ లాంచింగ్‌లో మిస్ ఇండియా యూనివర్స్ (2014) నియోనితా లోధ్ స్పెషల్ అప్పీరెన్స్‌తో అదరగొట్టింది. ఆమెతో పాటు మోడల్సూ స్రైకింగ్ కలర్ శారీస్‌లో వయ్యారాలు ఒలికించారు. షోరూమ్ డెరైక్టర్ సత్తిబాబు పాల్గొన్నారు.