missied
-
ఫైళ్లు మాయంపై దర్యాప్తు జరగాల్సిందే...
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో ఫైళ్లు మాయం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయించాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బాధ్యులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి ఆఫీసుతో పాటు ఇతర విభాగాల్లో కూడా ఫైళ్లు, ఇతర వస్తువులను తరలించే ప్రయత్నాన్ని ప్రజలందరూ చూశారని, స్థానికులు, పోలీసులు అప్రమత్తమవడంతో వదిలేసి వెళ్లిపోయారని వివరించారు. ఇలాంటి ఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ధీరజ్‌పై రాహుల్‌కు ఎందుకంత ప్రేమ? మూడు రోజులుగా కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంటిపై ఐటీ అధికారుల దాడులు నిర్వహిస్తున్న తీరు దేశం మొత్తం విస్తుపోయేలా చేసిందని, నగదు దొరకడం చరిత్రలోనే మొదటిసారి అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ధీరజ్ సాహు ఆపార్టీ నేత రాహుల్ గాందీకి అత్యంత సన్నిహితుడని, చిన్న చిన్న విషయాలకు స్పందిస్తూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టే రాహుల్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో మూడు సార్లు ఓడిపోయినా కూడా ధీరజ్ సాహును మూడు సార్లు రాజ్యసభ ఎన్నుకున్నారని, ధీరజ్‌పై ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారో రాహుల్ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసే ముఖ్యమంత్రులను, ఎంపీలను ఏటీఎంలుగా మార్చుకుందని, ఆ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతి మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుందని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం నుంచి రూ. వందల కోట్లను తెలంగాణ ఎన్నికలకు తరలిస్తూ పట్టుబడటం చూశామన్నారు. ధీరజ్ సాహులాగే కర్ణాటకలో మరో నాయకుడు నుండి ఈ డబ్బు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కర్ణాటకలో ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్రంలో బీజేపీ శాసనసభాపక్షనేత ఎంపికపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అదంతా దుష్ప్రచారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి తాను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి అసత్యాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నవారిపై సోమ వారం పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. -
ఎంబీఏ విద్యార్థిని శ్రావణి అదృశ్యం...
హైదరాబాద్: బాలాజీనగర్ మోహన్‌రావు కాలనీలో దేవారాయ కుమార్ కుమార్తె దుర్గాలక్ష్మీ అలియాస్ శ్రావణి (22) ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ చదువుతుంది. ఈ నెల 3న ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసుల అదుపులోని వ్యక్తి అదృశ్యం
అర్ధరాత్రి వరకూ గ్రామస్తులు ఆందోళన కానిస్టేబుల్‌పై చర్యలకు డీఎస్పీ హామీ ఆందోళన విరమణ అదృశ్యంపై కేసు నమోదు కొత్తపేట : ఒక కేసు విషయంలో పోలీసులు తీసుకువెళ్లిన వ్యక్తి అదృశ్యంపై అతని వర్గీయులు, గ్రామస్తులు మంగళవారం రాత్రి పోలీస్ స్టేషన్ ముట్టడించి, రాస్తారోకో చేసి ఆందోళన చేశారు. అమలాపురం డీఎస్పీ ఎల్.అంకయ్య హామీతో ఎట్టకేలకు అర్ధరాత్రి ఒంటిగంటకు ఆందోళన విరమించారు. ఈ ఘటనకు సంబంధించి వాడపాలెం గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొత్తపేట మండలం వాడపాలెంలో ఈ నెల 8 న ఇరువర్గాలు ఘర్షణ పడగా కొండేపూడి ఏడుకొండలు ఫిర్యాదు మేరకు 9న సలాది సత్యం (పెద్దకాపు), చోడపునీడి నాగరాజు (బుజ్జి) లను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. 10 న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 11వ తేదీ రాత్రి పెద్దకాపు కుటుంబ సభ్యులు పెదకాపు కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లగా అతనిని ఇంటికి పంపేశామని పోలీసులు తెలిపారు. మూడు రోజులుగా ఇంటికి రాని పెద్దకాపు గురించి ఆందోళన చెందుతూ ఇదే విషయాన్ని వారి కుటుంబీకులకు తెలిపారు. దీంతో ప్రముఖ వ్యాపారవేత్త బండారు శ్రీనివాసరావు తదితరుల ఆధ్వర్యంలో ఎస్సై డి.విజయకుమార్‌ను నిలదీయగా పెద్దకాపు బంధువులు వచ్చి ఆ గొడవతో తమ వ్యక్తికి సంబంధం లేదని వదిలేయాలని కోరగా తమ కానిస్టేబుల్ అర్జున్ను ఇచ్చి పంపేశానని, అయితే మార్గం మధ్యలో అతను వాహనం దిగి పరారయ్యాడని వివరించారు. దీంతో అక్కడికి వచ్చిన వారు ఆందోళ వ్యక్తం చేస్తూ పెద్దకాపును మీరే అదృశ్యం చేశారని ఆందోళన వ్యక్తం చేస్తూ స్టేషన్‌ను ముట్టడించారు. అంతటితో ఆగకుండా అమలాపురం–రావులపాలెం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేసారు. పోలీసులపై డీఎస్పీ ఆగ్రహం ఈ సమాచారంతో డీఎస్పీ ఎల్.అంకయ్య అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో కొత్తపేట చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. ఏదైనా కేసులో పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన వ్యక్తిని తిరిగి పంపించాలంటే బందువులో లేక పెద్దల పూచికత్తు తీసుకుని పంపిస్థారు కదా?అదేమీ లేకుండా కానిస్టేబుల్‌ను ఇచ్చి పంపడమేమిటి?అని ప్రశ్నించగా స్థానిక పోలీసు అధికారుల వద్ద సమాదానం లేకపోవడంతో స్థానిక పోలీసు అధికారులపై డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత వ్యక్తి కోసం గాలిస్తామని, కానిస్టేబుల్ అర్జున్‌పై తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పెద్దకాపు భార్య సరస్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సై తెలిపారు.