missing youth
-
Hyderabad: బాలాపూర్‌లో అదృశ్యమైన యువకుడు దారుణ హత్య..
సాక్షి, హైదరాబాద్: బాలాపూర్‌లో అదృశ్యమైన యువకుడు దారుణ హత్యకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. ఉస్మాన్ నగర్‌కు చెందిన మామా జఫర్ కుమారుడు ఫైజల్ ఈనెల 12న రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి ఉస్మానియా హోటల్ వెళుతున్నానని చెప్పి వెళ్లాడు. అర్ధరాత్రి దాటినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు అతడికి ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చి అతడి కోసం వెతికారు. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఇక లాభం లేదని ఫైజల్ తండ్రి జాఫర్ బాలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం ఫిబ్రవరి 25న(శనివారం) రాత్రి ఒంటి గంట సమయంలో హత్య జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. హంతకుడ్ని జబ్బార్(17)గా గుర్తించారు. మినర్ కాలనీకి చెందిన ఇతడు వృత్తిరీత్యా కాస్మెటిక్ సేల్స్ చేస్తుంటాడు. అయితే ఫైజల్‌ను జబ్బార్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. తల, మొండెం వేరు చేసి తలను తీసుకెళ్లిపోయాడు. హత్య జరిగిన రెండు వారాల తార్వత దుర్గందం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. షాహిన్ నగర్లో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు ఫైజల్ మొండెం కన్పించింది. దుస్తుల ఆధారంగా అతడ్ని గుర్తుపట్టారు. తల ఇంకా లభించాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఫైజల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే జబ్బార్ ఫైసల్‌ను ఇంత కిరాతకంగా ఎందుకు హత్య చేశాడనే కారణం తెలియాల్సి ఉంది. పోలీసులు దీనిపై విచారిస్తున్నారు. ఫైజల్‌ను ఫిబ్రవరి 12నే కిడ్నాప్ చేసి, అదే రోజు హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. చదవండి: దోస్తు పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు.. 19 ఏళ్లకే గుండెపోటుతో.. -
తనకెవ్వరూ సాటిరారని నిరూపించాడు.. దానిని తట్టుకోలేకే చంపేశారా?
నగరి: తక్కువ ధరకే వివాహాలు, శుభకార్యాలకు ఆర్డర్లు పట్టేశాడు. వ్యాపారంలో తనకు సాటిరారని నిరూపించాడు. ఇదే ఇతని ప్రాణాలమీదికి తెచ్చినట్టు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈనెల 9వ తేదీన అదృశ్యమైన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం.. నగరి మునిసిపల్ పరిధి, కొత్తపేటకు చెందిన విజయ్ (22) స్థానికంగా లక్ష్మీ డెకరేటర్స్, ఈవెంట్స్ పేరిట పూల దుకాణం నడుపుతున్నాడు. వివాహాలు, ఇతర శుభకార్యాలకు పుష్పాలంకరణ చేస్తుంటాడు. ఈ నెల 9వ తేదీన పలు వివాహ వేడుకలకు పుష్పాలంకరణ చేశాడు. అనంతరం అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన తమిళనాడు వేలూరులోని ఒక లాడ్జీ నుంచి బయటకు పరుగులు తీస్తూ వచ్చిన విజయ్ విషం తాగేశానని, కాపాడాలంటూ కేకలు వేశాడు. అక్కడున్న వారు అతన్ని ఆస్పత్రికి చేర్చగా నాలుగురోజుల పాటు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం మృతి చెందాడు. ఇతని మృతిపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేలూరు పోలీసులు విచారణ చేపట్టారు. కిడ్నాప్ చేసి విషం తాగించారా? విజయ్ తక్కువ ధరకే పూలడెకరేషన్స్ చేస్తుంటాడు. ఈ విషయమై తమిళనాడుకు చెందిన కొందరు వ్యాపారులతో వివాదాలు కూడా జరిగినట్టు సమాచారం. ఇదే ఇతని మృతికి పరోక్షంగా కారణమైనట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మృతుడు అవివాహితుడు, కాగా ఈ నెల 20వ తేదీన అతనికి పుట్టిన రోజు అని, అంతలో మృతిచెందాడని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. చదవండి: (Hyderabad: గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్మెంట్లో వ్యభిచారం) -
గల్లంతైన యువకుడి మృతి
పెనుకొండ రూరల్ : గోరంట్ల రాజీవ్‌కాలనీకి చెందిన గౌస్‌మొహిద్దీన్ కుమారుడు దాదాపీర్(21) మృతదేహాన్ని మంగళవారం గుర్తించారు. తన స్నేహితులతో కలసి పెనుకొండ మండలం గొల్లపల్లి రిజర్వాయర్‌ను చూసేందుకు ఆదివారం వెళ్లిన అతను ఈత కోసం రిజర్వాయర్‌లోకి దిగాడు. అయితే ఈత రాకపోవడంతో అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి మూడ్రోజులుగా గాలిస్తుండగా, చివరకు మంగళవారం మృతదేహమై తేలియాడుతుండగా కనుగొన్నామని పోలీసులు తెలిపారు. గౌస్‌కు ముగ్గురు కుమారులు కాగా, దాదాపీర్ పెద్ద కొడుకు. మెకానిక్‌గా పని చేస్తూ ఇంటికి ఆధారంగా ఉన్న అతని మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.