గల్లంతైన యువకుడి మృతి
Published Wed, Apr 26 2017 12:25 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
పెనుకొండ రూరల్ : గోరంట్ల రాజీవ్‌కాలనీకి చెందిన గౌస్‌మొహిద్దీన్ కుమారుడు దాదాపీర్(21) మృతదేహాన్ని మంగళవారం గుర్తించారు. తన స్నేహితులతో కలసి పెనుకొండ మండలం గొల్లపల్లి రిజర్వాయర్‌ను చూసేందుకు ఆదివారం వెళ్లిన అతను ఈత కోసం రిజర్వాయర్‌లోకి దిగాడు. అయితే ఈత రాకపోవడంతో అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి మూడ్రోజులుగా గాలిస్తుండగా, చివరకు మంగళవారం మృతదేహమై తేలియాడుతుండగా కనుగొన్నామని పోలీసులు తెలిపారు. గౌస్‌కు ముగ్గురు కుమారులు కాగా, దాదాపీర్ పెద్ద కొడుకు. మెకానిక్‌గా పని చేస్తూ ఇంటికి ఆధారంగా ఉన్న అతని మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
Advertisement
Advertisement