Mission of Kakatiya
-
మిషన్ కాకతీయ నుంచి మోడల్ విలేజ్
సందర్భం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయలో చెరువుల పునరుద్ధరణ అనేది మొదటి దశ మాత్రమే. తర్వాత చెరువును కేంద్ర బిందువుగా చేసి, గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి వాటిని మోడల్ గ్రామాలుగా మార్చాలి. ఈ మధ్యకాలంలో దేశం మొత్తంమీద ఆయా ప్రభుత్వా లు చేపట్టిన పథకాలలో తెలం గాణ ప్రభుత్వం ప్రకటించిన ‘మిషన్ కాకతీయ’ ప్రథమ స్థా నంలో నిలుస్తుంది. సేద్యమే జీవనాధారమైన తెలంగాణలో పూర్వకాలం నుంచి వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనడానికి నీటి నిల్వలపై ఎంతో శ్రద్ధ కనపరిచారు. గ్రామ గ్రామాన చిన్న కుంటల నుంచి పెద్ద చెరువుల వరకు అలాగే భౌగోళిక పరిస్థితులను బట్టి ఒక దాని కింది భాగాన ఇంకొకటి చొప్పున గొలు సుకట్టు చెరువుల నిర్మాణం జరిపారు. గత 50, 60 సంవత్సరాలలో ఈ చెరువులు నిరాద రణకు గురయ్యాయి. చెరువులోకి నీరు పారే కాలువలు పూడిపోవడం, చెరువులలో పూడిక నిండటం, కబ్జాలు వంటి పలు కారణాలతో వందల ఎకరాలకు నీరు అం దించే చెరువులు పదుల ఎకరాలకే పరిమితమయ్యాయి. చెరువులలో నీటి నిల్వ తగ్గడంతో భూగర్భ జలాలు అడుగంటి దిగుబడులు తగ్గిపోయాయి. ఇక బోరు బావులలో కూడా వందల అడుగుల మేరకు తవ్వినా నీరు లేని పరిస్థితి ఏర్పడింది. చిన్న నీటిపారుదలపై శ్రద్ధ లేకపోవడంతో చెరువులు మరమ్మతులకు నోచుకోక పూడికతో, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. చెరువు నీటిపై ఆధారపడ్డ వ్యవసాయ రంగం కుదేలైంది. ఈ నేపథ్యంలో మిషన్ కాకతీయ ప్రణాళికను స్వాగతించాలి. చెరువుల పునరుద్ధరణతో గ్రామాల్లో వ్య వసాయం, మంచినీటి లభ్యత మెరుగుపరచవచ్చు. పైగా చెరువును కేంద్రబిందువుగా చేసి గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా కార్యక్రమం చేపట్టాలి. దానితో ఒక మోడల్ గ్రామం రూపొందాలంటే మిషన్ కాకతీయను, స్వచ్ఛభారత్ లాంటి కార్యక్రమాలతో అనుసంధానం చేయాలి. స్వచ్ఛభారత్ కార్యక్రమం కింద గ్రామంలో చేయవలసిన పనులలో ముఖ్యమైనవి. 1) మిషన్ కాకతీయ కింద ఎంపికైన గ్రామంలో 100% మరుగుదొడ్ల నిర్మాణం జరగాలి. 2) ఇప్పటికీ గ్రామాలలో 50% జనాభా కట్టెలతోనే వంట చేస్తారు. దానితో ఇల్లంతా పొగచూరడం, పిల్లలకు శ్వాసకోశ జ బ్బులు రావడం జరుగుతుంది. దీనిని నివారించడానికి పొగరాని పొయ్యిల నిర్మాణం జరగాలి. 3) ఇంటిలో వీలును బట్టి పొట్టి రకాలైన బొప్పాయి, జామ, మునగ, కరివేపాకు వంటి చెట్లు నాటాలి. వీటిలో పోషక విలు వలు అధికంగా ఉండి పిల్లలకు పోషకాహార లభ్యత మెరుగుపడుతుంది. 4) చెరువులో పూడిక తీసిన తరు వాత పెద్ద ఎత్తున తుమ్మచెట్లు నాటాలి. ఇవి నీటి పైభా గంలో ఒక గొడుగు మాదిరిగా విస్తరించి నీరు ఆవిరి కాకుండా ఆపుతాయి. 5) ప్రస్తుతం 5 హెచ్.పి. సౌరశక్తి మోటారు మొత్తం ఖర్చు సుమారు 5 లక్షలపైబడి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ పోను రైతుకు సుమారు రూ.2 లక్షల వరకు వస్తుంది. దీనిపై మోడల్ గ్రామాల రైతులకు లక్ష కు ఒక సౌరశక్తి మోటారు అందజేస్తే4, 5 ఏళ్లలో సౌరశక్తితో నడిచే బోరుబావులు వాడకంలోనికి వస్తాయి. 6) మిషన్ కాకతీయ కింద ఎంపికైన గ్రామంలోని అన్ని వ్యవసాయ భూములలో భూసార పరీక్ష జరిపి, ప్రతి సర్వే నంబర్‌కు భూసార పరీక్ష కార్డు అందజేయాలి. 7) చెరువులో పూడిక తీసిన మట్టిని పొలాలలోనికి తరలిం చిన రైతులను ఆదర్శ రైతులుగా గుర్తించాలి. 8) రసాయ న ఎరువులు వాడని వారికి తాలూకా/ జిల్లా స్థాయిలో ప్రశంసాపత్రాలు ఇవ్వాలి. 9) గ్రామంలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వంటి కార్యక్రమాలు వీలును బట్టి చేప ట్టాలి. 10) ప్రతి బడిలో మరుగుదొడ్లు నిర్మించి, వాటిని ప్రతిదినం శుభ్రపరిచే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. 11) శాసనసభ్యుల, పార్లమెంట్ సభ్యుల ఫండ్ నుంచి మిషన్ కాకతీయ గ్రామాలలో మాత్రమే ఖర్చు చేయాలి. 12) గ్రామాల్లో మహిళా మండళ్లు, యూత్ క్లబ్‌లు, డ్వాక్రా గ్రూపులు, అంగన్వాడీ కేంద్రాలు వంటివి బాగా పని చేయడానికి సంబంధిత శాఖల సిబ్బంది మిషన్ కాకతీయ గ్రామాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 13) వ్యవసాయరంగంలో నీటి పొదుపు కొరకు బిందు, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. 14) చెరువు బాగు కాగానే రెండు పంటలు వరి వేయ కుండా, రెండవ పంట ఆరుతడి పంటలు వేసే విధంగా చర్యలు చేప ట్టాలి. 15) చెరువులో నీళ్లుంటే చేపల పెంపకం ఒక లాభ సాటి వృత్తి. దీనికి జిల్లా మత్స్యశాఖ మిషన్ కాకతీయ గ్రామాలలో దృష్టి కేంద్రీకరించాలి. 16) చెరువుగట్టుపై వెదురు మొక్కలు నాటాలి. గ్రామ స్థాయిలో వెదురు కుటీర పరిశ్రమకు ముడిసరుకు. 17) విద్యాశాఖ, గ్రామ పంచాయతీ మిషన్ కాకతీయ గ్రామంలో 100% పిల్లలు బడిలోనికి వెళ్లేలా చూడాలి. ఇలా జిల్లాస్థాయిలో, గ్రామాభివృద్ధికి సంబంధిం చిన అన్ని ప్రభుత్వ శాఖలు మిషన్ కాకతీయ గ్రామంలో పనిచేసి అట్టి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా అభి వృద్ధి చేయడానికి ప్రణాళిక ఏర్పాటు కావాలి. జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాలు కొత్త కాదు కాని ఒక సరైన ప్రణాళికతో మిషన్ కాకతీయలో ఎంపికైన గ్రామాలలో కేంద్రీకరించిన ఫలితాలు వస్తాయి. గ్రామాల్లో వ్యవసా యం చాలామటుకు యాంత్రీకరణకు గురైంది. ఈ నేప థ్యంలో గ్రామం మొత్తం ఒక ఆదర్శ గ్రామంగా అభి వృద్ధి చెందాలంటే స్వచ్ఛభారత్ కార్యక్రమంతో అను సంధానం చేస్తూ, ఒకటి లేక రెండేళ్ల గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. (వ్యాసకర్త కార్యదర్శి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్) -
మా ఖర్చులెట్లెల్లాలే సారూ!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అరమరికలు, దాపరికం లేకుండా మనసులో మాట బయటపెట్టింది మాచారెడ్డి జడ్పీటీసీ సభ్యురాలు గ్యార పెద్ద లక్ష్మి. అమాయకంగా మంత్రి హరీష్‌తో ‘చెరువుల పనులన్నీ గిట్ల టెండర్లతోని ఇస్తే మరి మా ఖర్చులెట్లెల్లాలే, పెట్టుబడులు ఎట్ల సారూ’ అంటూ ఉన్నదున్నట్లుగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది.‘మిషన్ కాకతీయ’ లో భాగంగా శుక్రవారం జిల్లా పరిషత్‌లో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ పునరుద్ధరణ పనులలో అక్రమాలకు తావులేకుం డా అధికారులు వ్యవహరించాలని, ఈ-టెండర్ల ద్వారానే పనులు అప్పగించాలని సూచించారు. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గందన్నారు. ఈ విషయమై పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు తమ పరిధిలోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువస్తున్నారు. ఇంతలో మాచారెడ్డి జడ్పీటీసీ లక్ష్మి ‘దళిత మహిళా జడ్పీటీసీ హక్కు లను కాపాడండి’ అని రాసిన ఫ్లకార్డును చేతితో పట్టుకుని లేచి నిలబడింది. ఆమెను చూసి సదస్సులో ఉన్న వారందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఏదో సమస్య గు రించి చెబుతుంది కావచ్చని అనుకున్నారు. కానీ, ఆమె సమస్య అందరికన్న భిన్నంగా ఉంది. అదేంటంటే ‘‘ప్రస్తుతం మండలాలలో, గ్రామాలలో పనులు లేవు, గీ చెరు వుల పనులేమో టెండర్లంటున్నరు.. గిట్లయితే పెట్టుబడెట్లెల్లాలే సారు’’ అంటూ ప్రశ్నించింది. స్పందించిన మంత్రి హరీష్ ‘‘ ఏం పెట్టుబడి పెట్టావమ్మా.. ఖర్చులు దేనికైనయ్’’ అంటూ అడగగా, ఆమె అమాయకంగా ‘‘జడ్పీటీసీగా పోటీ చేసి చాలా ఖర్చు చేశాం. ఖర్చులు తీయడానికి ఏదైనా మార్గం చూపించండి సారూ’’ అనడంతో మంత్రితో సహా అందరూ ఒక్కసారిగా నవ్వారు. -
కలసికట్టుగా కదులుదాం
⇒చెరువుల పునరుద్ధరణపై సుదీర్ఘ చర్చ ⇒సభ్యుల నుంచి సూచనల స్వీకరణ ⇒ఆక్రమణలు, కబ్జాలను ఉపేక్షించవద్దు ⇒రెవెన్యూశాఖ అధికారులు స్పందించాలి ⇒బంగారు తెలంగాణ లక్ష్యంగా ముందుకు ⇒నీటిపారుదల మంత్రి హరీష్‌రావు ఆదేశం ⇒‘మిషన్ కాకతీయ’పై ప్రజాప్రతినిధులతో సమీక్ష సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రధానంగా చిన్ననీటి వనరుల అభివృద్ధి, వాటర్‌గ్రిడ్, రహదారుల నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు తదితర నాలుగు అంశాలపై దృష్టి సారించిందని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో జిల్లాలోని 3,251 చెరువులను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామన్నారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో చైర్మన్ దఫేదార్ రాజు అధ్యక్షతన చిన్న నీటి వనరుల పునరుద్ధరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే లు, నీటిపారుదలశాఖ అధికారులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. చెరువులు, కుంటల పునరుద్ధరణపై పలు సూచనలు చేశారు. వినతులను సమర్పించారు. రైతుల పాత్రే కీలకం అనంతరం మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ జిల్లాలో 3,251 చెరువులకుగాను ఈ ఏడాది 700 చెరువుల పునరుద్ధరణకు ప్రతిపాదనలు వచ్చాయని పేర్కొన్నారు. జిల్లా రైతులు ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తూ పంటల సాగులో, దిగుబడిలో జిల్లాకు ధాన్యాగారంగా పేరు తెచ్చారన్నారు. చెరువుల పునరుద్ధరణతో వృత్తి పనివారికి ఉపాధి లభిస్తుందని, పశువులకు, గొర్రెలకు తాగునీరు లభిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించడానికి ప్రతి జిల్లాకు ఒక చీఫ్ ఇంజినీరును నియమించామన్నారు. కబ్జాకు గురయిన చెరువుల భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ చెరువుల నుంచి తీసిన మట్టి నమూ నాలను సేకరించి, వాటిని వాడడంతో కలిగే ఫలితాలను తెలియజేయాలని జేడీఏకు సూ చించారు. చెరువుల చుట్టూ చెట్లు, కాలువల గట్టున ఈత చెట్లను నాటించనున్నామన్నారు. ఈనెల మూడవ వారం కల్లా టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పునరుద్ధరణ పనులను ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమాలను గ్రామాలలో ఉద్యమరీతిలో, పండుగ వాతావరణంలో నిర్వహిస్తామన్నారు.పనులు పారదర్శకంగా ఉండా ల ని, అవినీతికి ఆస్కారం లేకుండా చూడాల ని, అవసరమైన చోటే ఖర్చు చేయాలని అన్నా రు. ప్రతి ఏఈకి ల్యాబ్టాప్లు, సర్వే పరికరా లు అందిస్తామన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఏడాదికి ఒక మిని ట్యాంక్‌బండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆక్రమణలు, కబ్జాదారుల భరతం పట్టండి ‘మిషన్ కాకతీయ’పై జరిగిన ప్రత్యేక సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు చెరువులు, కుంటల ఆక్రమణలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బోధన్, కామారెడ్డి, ఆర్మూరు, నిజామాబాద్, బాన్సువాడ, బిచ్కుంద తదితర ప్రాం తాలలో కబ్జాలకు గురైన చెరువులపై అధికారు లు స్పందించడం లేదని వాపోయారు. స్పందించిన మంత్రి హరీష్‌రావు చెరువుల పునరుద్ధరణలో రెవెన్యూశాఖ పాత్ర ఏమీ లేదన్నట్లుగా వ్యవహరించడం సరికాదని, ఖచ్చితంగా నీటి పారుదలశాఖ అధికారులతో కలిసి కబ్జా దారుల భరతం పట్టాల్సిందేనన్నారు. రెండు శాఖలు సమన్వయంతో సర్వే చేసి ఆక్రమణల వెనుక ఎంతటి వారున్నా వదలిపెట్టద్దన్నారు. చెరువుల పునరుద్ధరణలో పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములు కావాలని కోరారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు ఏర్పాటు చేయనున్నామని, ఇందు కోసం ఆర్అండ్బీ శాఖకు రూ.1,122 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.750 కోట్లు కేటాయించామన్నారు. ఇప్పటి ఇందూరు జిల్లా బడ్జెట్ ఒకప్పుడు రాష్ట్ర బడ్జెట ని పేర్కొన్నారు. మంత్రి హరీష్ సుడిగాలి పర్యటన మంత్రి హరీష్‌రావు జిల్లాలో శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. హైదరాబాద్ నుంచి రో డ్డుమార్గాన నిజామాబాద్‌కు చేరుకున్న ఆయన మొదట స్థానిక ఎమ్మెల్యే గణేష్‌గుప్త ఇంటికి, అ ర్బన్ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అనంత రం నిజామాబాద్ మార్కెట్ యార్డులో రూ. 255.50 లక్షలతో నిర్మించిన మహిళా రైతు వి శ్రాంతి భవనం, క్యాంటిన్, రూప్ట్ షెడ్డు, ఎల క్ట్రానిక్ ట్రేడింగ్ సిస్టమ్, ఆర్ఓ ప్లాంట్‌ను ప్రా రంభించారు. రూ. 405 లక్షలతో ఏర్పాట య్యే గాల్వాల్యూమ్ సీట్ షెడ్డుకు, 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మాణానికి, మురుగు కాలువ నిర్మాణానికి, 10 చిన్న ఈ ట్రేడింగ్ క్యాబిన్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చే శారు. జడ్పీ సమీక్షలో పాల్గొన్న మంత్రి సదాశివనగర్ మండలం భూంపల్లి చెరువును, ప్రా ణహిత-చేవెళ్ల కాల్వ నిర్మాణం పనులను, గాం ధారి మండలం కాటేవాడీ డ్యామ్, గుజ్జులం ప్రాజెక్టును పరిశీలించారు.కార్యక్రమంలో మం త్రి పోచారం, ఎంపీ కవిత, కలెక్టర్ రొనాల్డ్రో స్, మేయర్ సుజాత, శాసనమండలి స భ్యు లు వీజీ గౌడ్, సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంతు సింధే, ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, గణేష్‌గుప్త, డీ సీ సీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ పాల్గొన్నారు.