Mission Kashmir
-
గులాం నబీ ఆజాద్‌కు ఉగ్రవాదుల బెదిరింపులు
శ్రీనగర్: కాంగ్రెస్ మాజీ నేత, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు రావడం కలకలం రేపింది. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మిషన్ కశ్మీర్ కార్యక్రమంలో భాగంగా జమ్ముకశ్మీర్‌లో ఆజాద్ ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే ముష్కర సంస్థ ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు ప్రచురించడం ఆందోళన కల్గిస్తోంది. పోస్టర్లో ఆజాద్‌ను రాజకీయ ఊసరవెల్లి అని ఆరోపించారు ఉగ్రవాదులు. ఆయన ద్రోహి అని విధేయత అంటే ఏంటో తెలియదని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం ముందస్తు ప్రణాళికతోనే కశ్మీర్ రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొన్నారు. తన గార్డులను మార్చడానికి ముందు ఆజాద్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమావేశమయ్యారని తెలిపారు. కాగా.. కాంగ్రెస్‌తో 50 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని ఆ పార్టీకి కొద్ది రోజుల క్రితమే రాజీనామా చేశారు ఆజాద్. రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కశ్మీర్లో సొంత రాజకీయ పార్టీ స్థాపిస్తానని ప్రకటించారు. ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని ప్రచారం జరిగినప్పటికీ.. తనకు ఆ ఆలోచన లేదని ఆజాద్ చెప్పారు. చదవండి: పొలిటికల్ ట్విస్ట్.. పీకేతో నితీశ్ కుమార్ భేటీ -
కశ్మీరీల భాగస్వామ్యంతోనే ముందడుగు
జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి 370, 35(ఎ) అధికరణల ద్వారా దశాబ్దాల క్రితం దఖలు పడిన ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విభజించడం ద్వారా ఏడు దశాబ్దాలుగా రగులుతున్న కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే సువర్ణావకాశం ఏర్పడటం దేశ చరిత్రలో ఓ అపురూప ఘట్టం. ఎంతో సాహసోపేతంతో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సహా మరికొన్ని ప్రాంతీయ పార్టీలు బేషరతుగా తమ సంపూర్ణ మద్దతును ప్రకటించి, దేశ ప్రయోజనాలు అన్నింటికంటే అత్యంత ప్రధానమైనవని చాటి చెప్పాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం లేకపోవడం ఆ పార్టీ డొల్లతనాన్ని ఎత్తి చూపింది. ఆ పార్టీలో కొంతమంది సీనియర్ నేతలతో పాటు యువ నేతలు కూడా ఎన్డీఏ చర్యను సమర్థించడం గమనార్హం. కాంగ్రెస్ బలహీనతను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంది. భారత్‌ను ఇరుకున పెట్టడానికి అంతర్జాతీయ సమాజం మద్దతును కూడగట్టాలని ప్రయత్నించి పాకిస్తాన్ భంగపాటుకు గురయ్యింది. కశ్మీర్ రాష్ట్రాన్ని ఏలిన ప్రభుత్వాలు అక్కడి ప్రజలకు తగిన నమ్మకాన్ని కల్పించలేకపోయాయి. పాకిస్తాన్ తయారు చేసిన ఉగ్రవాద మూకలు రాష్ట్రంలోకి చొరబడకుండా నిలువరించలేకపోయాయి. ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని మతవాద రాజకీయాలకు పరోక్షంగా సహకరించాయి. కశ్మీర్ అంశంలో స్పష్టమైన వైఖరి అవలంబించింది ఒక్క బీజేపీయే అన్నది నిర్వివాదాంశం. కేంద్రంలో కనుక తాము అధికారం చేపడితే 370 ఆర్టికల్‌ను రద్దుచేసి కశ్మీర్‌ను జాతీయ స్రవంతిలోకి తీసుకువస్తామని బీజేపీ మొదట్నుంచీ చెబుతూ వస్తోంది. కశ్మీర్‌పై ఉదారవాద వైఖరి ప్రదర్శిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ‘దీనికి రాజకీయ పరిష్కారం’ అనివార్యం అనే విధానాన్ని అవలంబించింది. కానీ, రాజకీయ పరిష్కారం అంటే ఏమిటో ఏనాడూ స్పష్టం చేయలేకపోయింది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉండగా పాకిస్తాన్‌తో కుదుర్చుకున్న ‘సిమ్లా ఒప్పందం’ ఎటువంటి పరిష్కారాన్ని చూపించలేకపోయింది. ఇక, జమ్మూ కశ్మీర్‌లోని ప్రధాన ప్రాంతీయ పార్టీల్లో ఒకటైన నేషనల్ కాన్ఫరెన్స్ ఎప్పటికప్పుడు కప్పదాట్ల వైఖరితో వ్యవహరిస్తూ స్థానిక ప్రజల ఆదరణ సంపాదించలేకపోయింది. ఆ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కశ్మీర్ సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలనేవారు. ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లాదీ అదే పాట. అధికారం పోయాక నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు మాట మార్చారు. హురియత్ కాన్ఫరెన్స్‌ను చర్చల్లో భాగస్వామ్యం చేయాలన్నారు. జమ్మూ కశ్మీర్లో మరో ప్రధాన ప్రాంతీయ పార్టీ అయిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ విధానం మొదట్నుంచీ వేర్పాటువాదులకు అనుకూలమే. 2015లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లభించని నేపథ్యంలో పీడీపీతో బీజేపీ జత కలిసింది. మహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వం కశ్మీర్లో శాంతిని నెలకొల్పడంలో పూర్తిగా విఫలం చెందడమే కాకుండా.. స్థానిక పోలీస్ యంత్రాంగానికి, సైన్యానికి మధ్య సమన్వయం లోపించిన పరిస్థితి ఉత్పన్నమైంది. భద్రతా బలగాలపై రాళ్లు విసిరినందుకు స్థానిక యువతపై నమోదైన క్రిమినల్ కేసులను ముఫ్తీ ప్రభుత్వం ఎత్తివేసింది. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుల్లో వివక్ష చూపారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా జరిగిన కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ చావు దెబ్బ తిన్నప్పటికీ..ఆ సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి తగిన చొరవ చూపలేకపోయింది. 2014లో ఆ దిశగా అడుగులు వేయడానికి బీజేపీకి కొన్ని పరిమితులు ఎదురయ్యాయి. లోక్‌సభ ఎన్నికలలో సంపూర్ణ మెజార్టీ సాధించిన తర్వాత కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కశ్మీర్ అంశాన్ని పరిష్కరించడానికి వేగంగా అడుగులు ముందుకు వేసింది. పాకిస్తాన్‌తో నియంత్రణ రేఖ మీదుగా కొనసాగుతున్న వాణిజ్యాన్ని నిలిపేశారు. జమ్మూ లోయలో ర్యాలీలు నిర్వహించడాన్ని నిషేధించారు. కశ్మీర్, రాజస్తాన్, గుజరాత్, పంజాబ్‌ల్లో సరిహద్దులన్నింటినీ కలుపుతూ ఏర్పర్చిన చొరబాటు నిరోధక గ్రిడ్‌కు ‘ఆపరేషన్ సుదర్శన్’ అనే పేరు పెట్టి చొరబాటుదారులను నిర్దాక్షిణ్యంగా ఏరివేయడం మొదలు పెట్టారు. సరిహద్దులను దుర్భేద్యం చేసేందుకు దాదాపు 15,000 బంకర్లను నిర్మించడానికి అవసరమైన నిధులను విడుదల చేశారు. ఉగ్రవాదుల బెడద అధికంగా ఉన్న దోడ, కిష్వ, రాంబా, రాజౌరి, కఠువా, పూంచ్ వంటి తదితర జిల్లాల్లో గ్రామ రక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీలకు ఆయుధాలు సమకూర్చాలని నిర్ణయించారు. మరోవైపు, రాష్ట్రంలో సర్వాధికారిగా ఉన్న గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని కేంద్రం అనేక కీలక నిర్ణయాలను తీసుకుంది. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను పటిçష్టపరుస్తున్నారు. ప్రాంతాల వారీగా రిజర్వేషన్లలో ఉన్న అసమానతలను తొలగించడానికి నియోజకవర్గాల సరిహద్దులను మార్చాలన్న ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నారు. ఇక, 1989 తర్వాత జమ్మూ లోయ నుండి పెద్దఎత్తున తరలిపోయిన పండిట్లను స్వస్థలాలకు తిరిగి రప్పించి అవసరమైతే వారికోసం ప్రత్యేక కాలనీల నిర్మాణం చేపట్టి వాటి చుట్టూ కంచెలు నిర్మించి పటిష్ట భద్రత కల్పించాలని కూడా కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ చర్యలకు తోడుగా అంతిమంగా జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370, 35(ఎ) అధికరణలను రద్దు చేసే బిల్లును తొలుత రాజ్యసభలో, తదుపరి లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేయడంలో చోటుచేసుకున్న ఉత్కంఠ, బీజేపీ అగ్రనాయకత్వం వ్యవహరించిన తీరు వ్యూహాత్మకమైనది. మోదీ ప్రారంభించిన ‘మిషన్ కశ్మీర్’లో ప్రథమ అధ్యాయం సజావుగా సాగింది. మిగిలిందల్లా ద్వితీయ అధ్యాయం. ఇది విజయవంతం కావాలంటే జమ్మూకశ్మీర్ ప్రజల సహకారం, తోడ్పాటు, భాగస్వామ్యం అవసరం. ఆ దిశగా కేంద్రం కృషి చేయాలి. అందరి సహకారాన్ని స్వీకరించాలి. ప్రజలకు త్వరితగతిన సత్ఫలితాలు అందగలిగితే ఏ లక్ష్యం కోసమైతే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాలు ‘మిషన్ కశ్మీర్’ ను ప్రారంభించారో అది దిగ్విజయం అవుతుంది. డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రి -
ప్రేమానురాగాల కలబోత
పువ్వు సున్నితంగా ఉంటుంది. పరిమళాలు వెదజల్లుతుంది. సహజంగా ఉంటుంది, చూడడానికి చాలా అందంగానూ ఉంటుంది. రేకులు విచ్చుకున్నాక, వాటి చక్రవ్యూహంలో దారి తప్పుతుంది. పుప్పొడుల ఘన పదార్థాన్ని దాటి మరింత లోనికి వెళ్లగలిగితే తేనియలూరుతుంది. ఆ మధువుని వధువుగా అందుకోవాలంటే, చేయాల్సిన ప్రయాణంలో ఎన్ని మలుపులో... ఎన్ని అడ్డుగోడలో! పువ్వులాంటి సున్నితమైన, కోమలమైన స్త్రీ... తన ప్రవర్తనతో, నడవడికతో తన ఇంట్లో అనురాగ పరిమళాలు వెదజల్లుతుంది. సహజంగా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. ఆమె మనసుని అర్థం చేసుకోవాలంటే పూరేకుల చుట్టూ దారితప్పి తిరిగినట్టు గింగిరాలు తిరగాల్సిందే. పరిస్థితుల ప్రభావంతో ఘనీభవించిన గోడల్ని చెమటోడ్చి పగలగొట్టాల్సిందే. ఆపైన ఆమె అనుమతిస్తే... మధువు లాంటి తీయనైన, అమృతమయమైన సహచర్య సుఖాన్ని అనుభవించవలసిందే. తరించవలసిందే. మోక్షం కలగాలంటే ఏ మునైనా తపస్సు చేయాల్సిందే. ఆడదాని మనసర్థం చేసుకుని, మోక్షంతో సమానమైన, సుఖమయమైన జీవితం పొందాలంటే తలకిందులుగా తపస్సు చేయాల్సిందే. 1914 అయినా, 2014 అయినా, వందేళ్లు దాటినా, మనసుకి నచ్చిన స్త్రీ సహచర్యంలో ఉండే సుఖమైతే అదే. అది పొందడంలో ఉండే దుఃఖమూ అదే. ఆహార, వేష, దేశ, భాషలెన్ని మారినా, స్త్రీ ఆత్మ సౌందర్యము గౌరవమూ, అమాయకత్వమూ, అందమూ, గూఢత్వమూ, గాఢత్వమూ, మృదుత్వమూ, సంక్లిష్టమూ - ఇవేవీ మారలేదు. మారకపోవడం సృష్టిలో ఒక అద్భుతమే. ఇదంతా నేను రీసెర్చ్ చేసి కనుక్కున్నది కాదు. 1800 చివర్లో పుట్టి 2000 దాటాక కూడా మనల్ని అలరించే పాత్రల్ని సృష్టించిన బెంగాలీ మేధావి, రచయిత శరత్చంద్ర ఛటోపాధ్యాయ స్త్రీల మానసిక పరిణతిపై చేసిన అధ్యయనం, అది సృష్టించిన చరిత్ర - మొదట దేవదాసులో పార్వతి, చంద్రముఖి. తర్వాత పరిణీతలో లలిత. ఏం క్యారెక్టరైజేషన్?! ప్రముఖ దర్శక నిర్మాత విధువినోద్ చోప్రా 2000వ సంవత్సరంలో ‘మిషన్ కాశ్మీర్’ అనే చిత్రాన్ని తీస్తున్న రోజుల్లో ప్రదీప్ సర్కార్ అనే ఒక తెలివైన సాంకేతిక నిపుణుడిని పిలిపించి, ‘మిషన్ కాశ్మీర్’ చిత్రానికి పాటలు షూట్ చేయమని అడిగాడట. అందుకు ఒక కారణం ఉంది. అప్పటికే ప్రదీప్ సర్కార్ 1000 ఎడ్వర్టయిజ్మెంట్లు, 15 మ్యూజిక్ వీడియోలు తీసిన అనుభవంతో ఉన్నాడు. దర్శకుడిగా సినిమాల్లోకి ప్రవేశించేదెలా అని మథనపడిపోతున్న ప్రదీప్ సర్కార్... విధు వినోద్ చోప్రా నుంచి పిలుపు రాగానే మహదానందభరితుడై వెళ్లిపోయి, వినోద్ చోప్రాతో కలసి వర్క్ చేయడం ప్రారంభించాడు. కానీ హృతిక్‌తో తీసిన ‘మిషన్ కాశ్మీర్’ ఘోర పరాజయం పొందింది. షారుఖ్ ఖాన్‌తో సంజయ్‌లీలా భన్సాలీ తీసిన ‘దేవదాసు’ బాగా ఆడింది. ఈ రెండూ విధు వినోద్ చోప్రాని బాగా ఆలోచనలో పడేసినట్టున్నాయి. భారతదేశంలో సౌత్ ఇండియన్ సినిమాకి పుట్టినిల్లు అయిన బెంగాలీ కథని తీసుకుని, ప్రముఖ బెంగాలీ నటుడు సవ్యసాచి చక్రవర్తిని సైఫ్ అలీఖాన్ తండ్రి పాత్రలో మెయిన్ విలన్‌గా తీసుకుని, బెంగాలీ నటి రైమాసేన్ని హీరోయిన్ చెల్లెలి పాత్ర కోయెల్కి ఎంచుకుని, విద్యాబాలన్‌ని హీరోయిన్గా తీసుకుని, ప్రదీప్ సర్కార్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, సహ రచయితగా, కళాదర్శకుడిగా నియమించి, చిత్రాన్ని నిర్మించాడు విధు వినోద్ చోప్రా. అప్పటికే ఆయన అనిల్‌కపూర్, మనీషా కొయిరాలా జంటగా, భారీగా తీసిన ‘1942 ఎ లవ్‌స్టోరీ’ పీరియడ్ ఫిల్మ్ మంచి పేరును మిగిల్చినా, పరాజయాన్ని మూటకట్టుకొంది. అయినా, వెరవకుండా పరిణీత చిత్రానికి శ్రీకారం చుట్టాడు విధు వినోద్ చోప్రా. ఏడాది పాటు కూర్చుని నవలని తెరకి అనువదించారు చోప్రా, ప్రదీప్ సర్కార్. మరో ఏడాది పాటు కూర్చుని శంతను మొయిత్రాని పీల్చి పిప్పిచేసి, కొన్ని వందల ట్యూన్లు స్వరం చేయించి, ఆరు పాటలు ఫైనలైజ్ చేశారు. అప్పుడే ఒక ఇంటర్వ్యూలో చోప్రా, బాలీవుడ్‌కి మరో ఆర్.డి.బర్మన్ కాగల సత్తా శంతను మొయిత్రాకి ఉందని కితాబిచ్చాడు. ఆయన అన్నట్టే పరిణీత రిలీజ్ అయ్యాక ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ మ్యూజిక్ డెరైక్టర్ అవార్డు, ఆర్.డి.బర్మన్ స్మారక అవార్డుల్ని శంతను మొయిత్రా గెలుచుకున్నారు. నిజానికి శేఖర్ పాత్రలో ముందు అభిషేక్ బచ్చన్‌ని ఎంపిక చేసుకున్నారు. గిరీష్ పాత్రలో సైఫ్ అలీఖాన్ని ఫిక్స్ అయ్యారు. ఈ శేఖర్ ఎవరు, గిరీష్ ఎవరు అంటారా? అయితే ముందు కథనోసారి పరికించి వద్దాం. అందమైన కలకత్తా నగరంలో ప్రజల జీవన విధానం చూపిస్తూ, గంభీరమైన అమితాబ్ బచ్చన్ గళం 1960ల నాటి కలకత్తా పరిస్థితుల్ని, కథని మనకి పరిచయ వాక్యాలుగా వినిపిస్తూ సినిమా మొదలౌతుంది. శరీరం సీట్లకి, కళ్లు తెరకీ అతుక్కుపోతాయి ఆ ఇంట్రడక్షన్‌తో. ధనవంతుడైన నవీన్‌రాయ్ కొడుకు శేఖర్. పక్కింట్లో ఉండే దిగువ మధ్యతరగతి అమ్మాయి లలిత. శేఖర్ వివాహం గాయత్రితో జరగబోతోంది మరికాసేపట్లో. వివాహానికి తయారౌతున్న శేఖర్ మనసు మనసులో లేదు. ఏవో జ్ఞాపకాలు. పందిట్లో పాట మొదలైంది. పక్కింటివైపు వెళ్లాడు శేఖర్. రెండిళ్లకీ మధ్య పెద్ద గోడ అడ్డుగా ఉంది. తనని చిన్నప్పట్నుంచీ అభిమానించిన వసుంధరా ఆంటీని కలిశాడు శేఖర్. భర్త మరణించిన బాధలో ఉందామె. అయినా, ఆ కుటుంబాన్ని ఆదుకున్న గిరీష్‌ని ప్రశంసించింది. భర్త ఆఖరి కోరిక మేరకు లలితకి, గిరీష్‌కి వివాహం చేశారని శేఖర్‌కి అర్థమైంది. కోపంగా వెనక్కి వెళ్లిపోతున్న శేఖర్ని పిలిచింది లలిత, అతని చిన్నప్పటి స్నేహితురాలు. ఇప్పుడు గిరీష్ భార్య. మొహం కూడా చూడదను కున్నాడు. అసలు ఆమె మీద కోపంతోనే ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. అభిమానంగా దగ్గరకొచ్చిన లలితని దూషించి, అవమానించి వెళ్లిపోయాడు శేఖర్. ఇంటికెళ్లి పియానో వాయించాడు. ఆ పియానో మెట్లమీద అందంగా, ఉల్లాసంగా ఊయల ఊగుతూ శేఖర్‌తో మాట్లాడుతూ, ఆడుతూ, పాడుతున్న సెలయేరంటి యువతి లలిత. గతంలోకి వెళ్తే శేఖర్, లలితల మధ్య ఒక పాటలో లిరిక్‌కి, మ్యూజిక్‌కి ఉన్నంత స్నేహం. ఆ స్నేహం పరిఢవిల్లి ప్రేమగా మారాక, అంతరాలు మొదలై, అపార్థాలకి దారితీసి శేఖర్ జీవితంలోకి గాయత్రి, లలిత జీవితంలోకి గిరీష్ వస్తారు. చివరికి లలిత పట్ల శేఖర్‌కున్న అపార్థాన్ని గిరీషే తొలగిస్తాడు. ఆ రెండు ఇళ్ల మధ్యనున్న అడ్డుగోడని శేఖర్ పడగొడతాడు. లలితని చేపడతాడు. అనివార్య కారణాల వల్ల అభిషేక్ బచ్చన్ ఈ శేఖర్ పాత్ర నుంచి తప్పుకున్నాడు. అప్పుడు చోప్రాకి పెద్దగా ఇష్టం లేకపోయినా ప్రదీప్ సర్కార్ బలవంతం మీద సైఫ్ అలీఖాన్ని గిరీష్ పాత్ర నుంచి తప్పించి, శేఖర్ పాత్రకి అయిష్టంగానే ఫిక్స్ అయ్యారు. తర్వాత గిరీష్ పాత్రకి సంజయ్‌దత్‌ని ఒప్పించారు. ప్రదీప్ సర్కార్ చేసిన మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించిన విద్యాబాలన్‌ని ప్రధాన హీరోయిన్గా తీసుకోవడం సైఫ్‌కి పెద్దగా ఇష్టం లేదు. ఏ ఐశ్వర్యారాయ్‌నో, రాణీముఖర్జీనో పెడితే బావుంటుందని అనేవాట్ట. కానీ, ఆరు నెలలపాటు కొన్ని వందలసార్లు ఆడిషన్ చేసి ప్రదీప్ సర్కార్ విద్యాబాలన్ ఆ పాత్రకి న్యాయం చేయగలదని హీరోని, నిర్మాతని ఒప్పించాడు. ఇదంతా కన్ఫార్మ్ అయ్యాక, స్క్రిప్ట్ రెడీ అయ్యాక, చోప్రా ఇంక ఈ ప్రాజెక్ట్‌ని నిశ్చింతగా ప్రదీప్ సర్కార్‌కి అప్పచెప్పేశాడు. చివరికి డబ్బు కూడా ప్రదీప్ అకౌంట్లో వేసి, అతని ద్వారానే ఖర్చు పెట్టించాట్ట. అంత నమ్మకంగా అప్పగించాడు నిర్మాత.విద్యాబాలన్ అద్భుతమైన పరిణతి ప్రదర్శించింది పరిణీత పాత్రలో. చిత్రం చూశాక, ఆ పాత్రలో వేరెవరినీ ఊహించలేం. దియామీర్జా చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది ఉన్న కాస్సేపూ.కెమెరా, ఎడిటింగ్, సంభాషణలు, సంగీతం, కళాదర్శకత్వం అన్నీ అదనపు హైలైట్స్ ఈ చిత్రానికి. మొదటి చిత్ర ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు ప్రదీప్ సర్కార్. ‘కైసీ పహేలి జిందగానీ’ అనే 1960ల నాటి నైట్‌క్లబ్‌లో పాటకోసం అలనాటి అందాల నటి రేఖని ఒప్పించారు. లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ మ్యూజికల్ ఆల్బమ్‌లో ‘ఎ కిస్ టు బిల్డ్ ఏ డ్రీమ్ ఆన్’ పాట స్ఫూర్తితో ఈ పాటని స్వరపరిచారు శంతను మొయిత్రా. శ్రేయాఘోషల్, సోనూనిగమ్ పాడిన ‘పియా బోలే’ పాట చాలా బావుంటుంది వినడానికి, చూడ్డానికి కూడా.రేఖ ప్రత్యేకంగా నటించిన ఈ ‘కైసీ పహేలి జిందగానీ’ పాట చిత్రీకరణ, ట్యూన్ అన్నీ స్ఫూర్తిగా తీసుకుని మన తెలుగు దర్శకులు శ్రీ నీలకంఠగారు, ఆయన భూమికతో తీసిన మిస్సమ్మ సినిమాలో ‘నే పాడితే లోకమే పాడదా’ అనే పాట దృశ్యీకరించారు.ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన చిత్రం ‘పరిణీత’. గంభీరమైన చిత్రాలు, గతంలోకి తొంగిచూసే చిత్రాలు, పాత్రల నడుమ సున్నితమైన భావోద్వేగాలు ఇష్టపడే ప్రేక్షకులు తప్పక చూడాల్సిన సినిమా ‘పరిణీత’!వచ్చేవారం మరో మంచి సినిమాతో మళ్లీ మీ ముందుంటాను. -
ఇప్పుడు హాలీవుడ్లో...
‘‘చిన్నప్పటి నుంచి హిందీ మీడియంలో చదువుకున్న నేను ఒక హాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని కలలో కూడా అనుకోలేదు’’ అని అంటున్నారు దర్శక - నిర్మాత విధు వినోద్ చోప్రా. ‘1942: ఎ లవ్ స్టోరీ’, ‘మిషన్ కాశ్మీర్’ లాంటి విజయవంతమైన చిత్రాల దర్శకునిగా, ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘లగే రహో మున్నాభాయ్’, ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’ లాంటి విభిన్నమైన చిత్రాల నిర్మాతగా పేరొందిన విధు వినోద్ చోప్రా మొదటిసారిగా ‘బ్రోకెన్ హార్సెస్’ అనే హాలీవుడ్ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం తన కలలను సాకారం చేసిందనీ, హాలీవుడ్ దర్శక దిగ్గజాలు జేమ్స్ కామెరూన్, ఆల్ఫాన్సో క్యూరోన్ ప్రశంసలు మర్చిపోలేనని విధు వినోద్ చోప్రా చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. -
జార్ఖండ్,జమ్ముకశ్మీర్ ప్రజలకు కృతజ్ఞతలు