భూగర్భ గనుల్లో పూర్తిస్థాయి మిషన్ మైనింగ్ ఏర్పాటు
=అడ్రియాల లాంగ్వాల్ కోసం దేశం ఎదురు చూస్తోంది
=సింగరేణి సీఅండ్ఎండీ సుతీర్థ భట్టాచార్య
గోదావరిఖని(కరీంనగర్), న్యూస్‌లైన్ : భూగర్భ గనుల్లో పూర్తి స్థాయి మిషన్ మైనింగ్ ఏర్పా టు చేయనున్నట్లు సింగరేణి సీఎండీ సుతీర్థ భట్టాచార్య పేర్కొన్నారు. గురువారం ఉదయం గోదావరిఖనికి చేరుకు న్న ఆయన రామగుండం రీజియన్‌లో పర్యటించారు. ఏపీఏ పరిధిలోని జీడీకే-10ఏ ఆవరణలో ఏర్పాటు చేసిన అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ మినీబిల్డ్‌ను పరిశీలించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. బొగ్గు ఉత్పత్తి చేసే సంస్థలలో సింగరేణికి మంచి పేరు ఉందని, అదే స్ఫూర్తితో దేశంలో నే మొదటి సారిగా ఏర్పాటు చేస్తున్న అడ్రియాల లాంగ్వా ల్ ప్రాజెక్ట్ పనులను చాలెంజ్‌గా తీసుకుని చేపడుతు న్నా మని తెలిపారు. బొగ్గు గనుల చరిత్రలోనే ఈ ప్రాజెక్టు మైలురాయిగా నిలుస్తుందని, దీని కోసం యావత్ భారతదేశం ఎదురు చూస్తోందని చెప్పారు. అందుకు తగినట్టుగా అధికారులు, కార్మికులు కృషి చేయడం అభినందనీయమన్నారు.
ప్రాజెక్ట్టు పనులు ఆలస్యం కావడంతో అంచనా వ్యయం పెరిగిందని, అయినా లాంగ్వాల్ మెషినరీని ఒకేసారి కొనుగోలు చేయడం వలన సంస్థకు ఆర్థికంగా లబ్ధి చేకూరినట్లు వివరించారు. ఓసీపీ-2 విస్తరణ పరంగా అటవీశాఖ నుంచి క్లియరెన్స్ వచ్చిందని, త్వరలో పనలు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి ఆశించిన మేర రాలేదని, లక్ష్యాలను చేరుకోవడానికి తీవ్రం గా కృషి చేస్తున్నట్లు వివరించారు.
ఓసీపీ-1లో క్వారీ పరిశీలన
ఆర్జీ-3 ఏరియా పరిధిలోని ఓసీపీ-1 ప్రాజెక్టును సీఎండీ సందర్శించారు. ప్రాజెక్టు వ్యూపాయింట్ నుంచి క్వారీని పరిశీలించిన అనంతరం అధికారులతో మాట్లాడారు. డం పర్లు, డోజర్ల పనితీరుపై ఆరాతీశారు. ముఖ్యంగా బీఈఎంఎల్ సంస్థకు చెందిన కొత్తడోజర్లు, డంపర్లలో సాంకేతిక సమస్య లు తలెత్తుతున్నాయని, వీటి స్థానంలో కోమస్తు సంస్థకు చెందిన యంత్రాలను కొనుగోలు చేస్తే బాగుం టుందని అధికారులు సూచించారు. రాబోయే రోజుల్లో రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎండీ కోరారు. ఆయన వెంట ఏరియా జీఎం నర్సిం హారావు, ఏజెంట్ రవిప్రసాద్, మేనేజర్ నాగేశ్వర్రావు తదితరులున్నారు.
ఆర్జీ-1 సీఎస్సీ ఫ్రీవే బంకర్ తనిఖీ
ఆర్జీ-1 సీఎస్పీ ఇంజిన్ ఆన్ లోడింగ్ సిస్టమ్(ఈఓఎల్)లో ఫ్రీవే బంకర్ ద్వారా రైల్వే వ్యాగన్లో బొగ్గు నింపే ప్రక్రియ ను సీఎండీ తనిఖీ చేశారు. ఇటీవల శ్రీరాంపూర్ సీఎస్పీ నుంచి వ్యాగన్లలో ఎక్కువ బొగ్గు నింపుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ విధానాన్ని నిశితంగా పరిశీలించారు. కంప్యూటర్ సిస్టమ్‌లో బొగ్గు బరువును తూచే విధానాన్ని సింగరేణి సర్వర్‌కు అనుసంధానం చేయాలని సూచించా రు. సీఎండీ వెంట డెరైక్టర్లతోపాటు ఏరియా సీజీఎం కె.సుగుణాకర్‌రెడ్డి, రవిశంకర్, కె.చంద్రశేఖర్, పి.రమేశ్‌బాబు, బి.నాగ్య, రవిసుధాకర్‌రావు తదితరులు ఉన్నారు.