Miya George
-
పెళ్లి చేసుకున్న సునీల్ హీరోయిన్
కొచ్చి: మలయాళ నటి మియా జార్జ్ ఇప్పుడు శ్రీమతి మియాగా మారారు. ఆమె వ్యాపారవేత్త అశ్విన్ ఫిలిప్‌ను వివాహం చేసుకున్నారు. శనివారం కేరళలోని కొచ్చిలో జరిగిన వీరి పెళ్లి వేడుకకు అతి కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. కాగా కేరళలోని పాలాలో జూన్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా మియా అశ్విన్‌తో కలిసి దిగిన ఫొటోను సైతం అభిమానులతో పంచుకున్నారు. ఆ తర్వాత ఆగస్టులో డ్రీమ్ వెడ్డింగ్ జరుపుకున్నారు. (చదవండి: ప్రసాదు.. మీ పెళ్లెప్పుడు..?!) View this post on Instagram ❤ Our dream Betrothal was held at Palai with the artistic help of @labelmdesigners Reception decor & arrangements by team @labelmsignatureweddings_ Photos by @studio360byplanj A post shared by miya (@meet_miya) on Aug 24, 2020 at 6:51am PDT తాజాగా సాంప్రదాయబద్ధంగా కుటుంబ సభ్యుల మధ్యంగా అధికారికంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కొత్త జంట పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన మియా తర్వాత పలు సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్నారు. 'అమర కావ్యం' అనే రొమాంటిక్ డ్రామా చిత్రంతో తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఆమె తెలుగులో సునీల్ సరసన 'ఉంగరాల రాంబాబు' చిత్రంలో నటించారు. ప్రస్తుతం హీరో విక్రమ్ 'కోబ్రా' చిత్రంలోనూ కనిపించనున్నారు. అలాగే కన్మణిల్ల అనే మలయాళ చిత్రం కూడా ఆమె చేతిలో ఉంది. (చదవండి: ప్రభాస్ అన్నా.. సారీ లెఫ్ట్ అవుతున్నా: తేజ్) View this post on Instagram Actress #MiyaGeorge gets married in Kochi to her beau #AshwinPhilip Happy Married Life Miya George! A post shared by Priya Pro (@priya__pro) on Sep 12, 2020 at 5:25am PDT -
వ్యాపారవేత్తను పెళ్లాడనున్న నటి
తిరువనంతపురం: లాక్డౌన్ వేళ మలయాళ నటి మియా జార్జ్ తన అభిమానులకు శుభవార్త చెప్పారు. కాబోయే భర్తతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసి తనకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని వెల్లడించారు. కాగా వ్యాపారవేత్త అశ్విన్ ఫిలిప్‌తో మియాకు మంగళవారం ఎంగేజ్మెంట్ జరిగింది. అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో కేరళలోని ఫిలిప్ నివాసంలో ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోను మియా సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేయడంతో కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తమను విష్ చేసిన వారికి మియా కృతజ్ఞతలు తెలిపారు.(పదేళ్ల తర్వాత సుస్మితా వెబ్ సిరీస్‌లో..) కాగా మియా- ఫిలిప్‌ల వివాహం సెప్టెంబరులో జరుగనున్నట్లు సమాచారం. ఇక టీవీ నటిగా కెరీర్ ఆరంభించిన మియా జార్జ్.. ఈ అడుత కలాతు, డాక్టర్ లవ్ వంటి మలయాళ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అమర కావ్యం అనే రొమాంటిక్ డ్రామాతో 2014లో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. రెడ్ వైన్, మెమరీస్, విషుధన్, మిస్టర్ ఫ్రాడ్ వంటి చిత్రాల్లో నటించారు. ఇక చియాన్ విక్రమ్ ‘కోబ్రా’ సినిమాలో ప్రస్తుతం మియా నటిస్తున్నారు. అదే విధంగా కన్మణిల్ల అనే మరో మలయాళ చిత్రం ఆమె చేతిలో ఉంది.(YOLO అంటోన్న సోనూసూద్) View this post on Instagram Thanks for all the Love & prayers ❤ Costume designed by @labelmdesigners @anureshma_ A post shared by miya (@meet_miya) on Jun 2, 2020 at 4:34am PDT -
విజయ్ ఆంటోనీతో మియాజార్జ్
ఒక చిత్రం అపజయం పాలైతే ఇక ఆ చిత్ర హీరోయిన్‌కు అవకాశాలు అంతే అన్నది పాత మాట. టాలెంట్‌తో పాటు అదృష్టం కలిసొస్తే వచ్చే అవకాశాలను ఆపడం ఎవరితరం కాదన్నది ఇప్పటి మాట. ఇక కేరళ కుట్టీలకు బాగా అచ్చొచ్చిన పరిశ్రమ కోలీవుడ్. ఇక్కడ వారి హవానే రాజ్యమేలుతోంది. అమరకావ్యం చిత్రంతో తమిళ చిత్రపరిశ్రమకు దిగుమతి అయిన నటి మియాజార్జ్. ఆ చిత్రం ఫ్లాప్ అవడంతో ఇక మాలీవుడ్‌కు మూటాముల్లె సర్దుకోవాల్సిందే అనే ప్రచారం జరిగింది. అయితే అలా జరగలేదు. మియాజార్జ్ను కోలీవుడ్ వదులు కోవడానికి ఇష్టపడడంలేదు. అవకాశాలు ఆమెను వరిస్తూనే ఉన్నాయి. ఆ మధ్య ఇండ్రు నేట్రు నాళై చిత్రంతో విజయాన్ని చవి చూసిన మియాజార్జ్ చేతిలో ఇప్పుడు మూడు చిత్రాలున్నాయి. వాటిలో ఒరునాళ్ కూత్తు చిత్రం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక శశికుమార్‌తో వెట్ట్రివేల్ చిత్రంతో పాటు యమన్ అనే చిత్రం నిర్మాణంలో ఉన్నాయి. విజయ్ 60వ చిత్రంలో నటించే లక్కీ ఛాన్స్ వచ్చిందనే ప్రచారం జరిగింది. అయితే అందులో నిజం లేదని మియాజార్జ్నే స్పష్టం చేశారు. అయితే తాజాగా విజయ్ఆంటోనీతో జత కట్టే అవకాశం వరించింది. దీనికి జీవా శంకర్ దర్శకత్వం వహించనున్నారు. విశేషం ఏమిటంటే ఆయన ఇంతకు ముందు విజయ్‌ఆంటోని హీరోగా నాన్ చిత్రానికి, మియాజార్జ్ హీరోయిన్గా అమరకావ్యం చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ ఇద్దరూ హీరోహీరోయిన్లుగా చిత్రం చేయనున్నారు. ఇది తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందంటున్నారాయన. మంచి కమర్షియల్ అంశాలతో జనరంజకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 10న ఈ చిత్రం ప్రారంభం కానుంది. 75 రోజుల్లో ఏకధాటిగా చిత్రీకరణ పూర్తి చేసి ఆగస్ట్‌లో విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. -
ఆ చిత్రంతో మంచి అనుభవం
ఆ చిత్రం నన్ను అయోమయంలో పడేసింది అంటోంది నటి మియాజార్జ్. అమరకావ్యం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన నటి ఈ మలయాళీ బ్యూటీ. ఆ చిత్రం ఆమెను నిరాశ పరచింది. ఇంతకీ మియాజార్జ్ను అయోమయానికి గురి చేసిన చిత్రం ఏది? చిన్న గ్యాప్ తరువాత ఈ అమ్మడు నటిస్తున్న తమిళ చిత్రం ఇండ్రు, నేట్రు, నాళై శ్రీ కుమరన్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై సి.వి.కుమార్ స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞానవేల్ రాజాతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం హీరోయిన్గా నటించిన అనుభవం గురించి మియాజార్జ్ తెలుపుతూ చిత్ర కథను దర్శకుడు కేరళలో ఉన్న తనకు ఫోన్ ద్వారానే చెప్పారంది. అది విన్న తాను చాలా అయోమయానికి గురయ్యానని చెప్పింది. వర్తమాన, భూత, భవిష్యత్ కథలను టైమ్‌మిషన్ ద్వారా ఎలా ఏకకాలంలో చూపించగలరనే పలు సందేహాలు కలిగాయని తెలిపింది. అయితే ఆ సందేహాలన్నీ చెన్నై వచ్చిన తరువాత దర్శకుడిని అడిగి నివృత్తి చేసుకునే చిత్రంలో నటించడానికి అంగీకరించానని పేర్కొంది. మొత్తం మీద ఈ చిత్రంలో నటించడం చాలామంచి అనుభవం అని అంది. చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని మియాజార్జ్ అంటోంది.