mla alla nani
-
వైసీపీ సారథి ఆళ్ల నాని
సాక్షి, ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని)ని నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. గడచిన ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ తెల్లం బాలరాజు పార్టీ జిల్లా కన్వీనర్ పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. ఈ నేథ్యంలో పార్టీ నూతన అధ్యక్షుడిగా నాని నియమితులయ్యారు. వైఎస్ శిష్యుడు విద్యార్థి దశనుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి వీరాభిమానిగా ఉన్న ఆళ్ల నాని ఆయన ఆశీస్సుల తోనే 1993లో రాజకీయ రంగప్రవేశం చేశా రు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, పీసీసీ సభ్యుడిగా పనిచేశారు. 1994లో ఏలూ రు అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. ఆ ఎన్నికల్లో మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు. 1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో 32 వేల ఓట్ల మెజార్టీ సాధించారు. 2009 ఎన్నికల్లోనూ ముక్కోణపు పోటీలో విజయం సాధించి రికార్డు సృష్టించారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి చెందారు. తన రాజకీయ గురువుగా వైఎస్ పేరును ప్రతి సందర్భంలోనూ నాని చెబుతుంటారు. అహర్నిశలూ పార్టీ కోసమే పార్టీ పిలుపునందుకుని ప్రతి కార్యక్రమాన్ని ఆళ్ల నాని విజయవంతంగా నిర్వహించారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణాన్ని పూర్తి చేరయించడం కోసం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద గతంలో నాని చేసిన ఆందోళన అప్పట్లో సంచలనం కలిగించింది. గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఏటిగట్ల పటిష్టం కోసం నీటిపారుదల శాఖ ఎస్ఈ కార్యాల యాన్ని ముట్టడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షులు వైఎస్ విజయమ్మ ఏలూరులో రాష్ట్రస్థాయిలో ఫీజు దీక్ష చేసినప్పుడు ఆమెను వెన్నంటి ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలకు నాని నేతృత్వం వహించి పార్టీ అధినేత ఓదార్పు యాత్రను ఏలూరు నుంచే శ్రీకారం చుట్టేలా కృషిచేశారు. షర్మిల నిర్వహించిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో అడుగుకలిపారు. అన్నిటికంటే ముఖ్యంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో నాని అలుపెరగని పోరాటం చేశారు. ఫైర్‌స్టేషన్ సెంటర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రజల్లో సమైక్య దీప్తి రగిలించారు. నగరం మొత్తం పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. అభివృద్ధి ప్రదాత నగరంలో ఐదు కాలనీల్లో 10వేల మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి సొంతగూడు కల్పించారు. ఏటా వర్షాకాలంలో నగర ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్న తమ్మిలేరు వరదల నుంచి కాపాడేందుకు రూ.17.50 కోట్లతో ఏటిగట్ల పటిష్టం కోసం రివిట్మెంట్లు నిర్మించారు. ప్రజల దాహార్తి తీర్చేందుకు, సురక్షితమైన గోదావరి నీటిని అందించేందుకు భారీ మంచినీటి పథకాన్ని నగరానికి అందించిన ఘనత ఆయనదే. వేసవిలో ఒకపూటే తాగునీటికి నోచుకునే నగరవాసులకు ఈ పథకం ద్వారా రెండు పూటలా శుద్ధిచేసిన తాగునీరు అందుతోంది. గన్‌బజార్ రైల్వే లెవెల్ క్రాసింగ్‌పై రూ.18 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మించి ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించారు. ఏలూరు పురపాలక సంఘానికి నగరపాలక సంస్థగా వర్గోన్నతి సాధించారు. నగరంలో రూ.4 కోట్లతో మూడు వంతెనలు నిర్మించి జనం ఇబ్బందులు తొలగించారు. ప్రభుత్వ జూని యర్ కళాశాలను డిగ్రీ కళాశాలగా అప్‌గ్రేడ్ చేయిం చారు. రూ.3.50 కోట్లతో మూడు మార్కెట్లను ఆధునికీకరించారు. గ్రామీణ ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు పదుల సంఖ్యలో వాటర్ ప్లాంట్లు నెలకొల్పారు. సుమారు 200 మంది హమాలీలకు సొంతింటి కల నెరవేర్చారు. రూ.17.50 కోట్లతో నగరంలో భూగర్భ డ్రెయినేజీ నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చారు. నాని ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆళ్ల నాని జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తారని పలువురు నాయకులు ధీమా వ్యక్తం చేశారు. నానిని పార్టీ జిల్లా అధ్యక్షునిగా నియమించడంపై నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఏలూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో నాని చేసిన కృషి నగర ప్రజలందరికీ తెలిసిన విషయమేనని పలువురు పేర్కొన్నారు. సామాన్య ప్రజల సమస్యలపై ఆయన స్పందించే తీరు ఇతర నాయకులకు ఆదర్శమన్నారు. ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని వర్గాలనూ కలుపుకుపోయే వ్యక్తిగా జిల్లాలోని అన్నిరంగాల ప్రముఖుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని వైఎస్సార్ సీపీ నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి నిర్మాణాత్మక పాత్ర పోషిస్తారని ధీమా వ్యక్తం చేశారు. నాని నాయకత్వంలో పని చేయడానికి మరింత మంది యువకులు ముందుకువస్తారని, అలాగే వివిధ పార్టీల నాయకులను కూడా తమ పార్టీలోకి తీసుకు వచ్చేందుకు నాని రాజకీయ చతురత పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. ఆళ్ల నాని జిల్లా అధ్యక్షులుగా నియమితులు కావడంపై పార్టీ ఏలూరు నియోజకవర్గ నాయకులు గుడిదేశి శ్రీనివాసరావు, మంచెం మైబాబు, మున్నుల జాన్‌గురునాథ్, గంపల బ్రహ్మావతి, నెరుసు చిరంజీవులు, కడవకొల్లు సాంబ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలపక్షాన నిరంతర పోరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాపై నమ్మకంతో ఇంతటి బాధ్యతను అప్పగించారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే ప్రధాన అజెండాగా పార్టీని నడిపించడమే నా లక్ష్యం. నా గరువు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నాకు నేర్పింది కూడా అదే. అందరి సహకారంలో పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసి ముందుకు నడిపిస్తాను. - ఆళ్ల నాని, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ -
బాబు చేతిలో మోసపోవద్దు
ఏలూరు (ఆర్ఆర్ పేట), న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేతిలో మరోసారి మోసపోవద్దని, ఆయనవి ఆచరణ సాధ్యం కాని హామీలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు. ఏలూరులోని పలు డివిజన్లలో శుక్రవారం వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయని చంద్రబాబు ఇప్పుడు అధికారమిస్తే చేస్తాననడం హాస్యాస్పదమన్నారు. హై టెక్ మంత్రాన్ని జపిస్తూ రైతులను పట్టిం చుకోకుండా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుం దన్నారు.మరలా తనకు అధికారమిస్తే ఇంటింటికీ ఉద్యోగం, రూపాయికే టిఫిన్, ఐదు రూపాయలకే భోజనం అందిస్తానని ఆచరణ సాధ్యంకాని హామీలను గుప్పిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. చంద్ర బాబు మాయమాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్పారు. చిరస్థాయిగా నిలిచిన వైఎస్సార్ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వారు చెప్పారు. ఆయన మరణానంతరం కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను నిలిపివేసి ప్రజాకంటకంగా మారిందని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అధికార పక్షంతో కుమ్మైక్కై రాష్ట్ర విభజనకు సహకరించిందని ఆరోపించారు. సీమాంధ్ర అభివృద్ధి తనతోనే సాధ్యమంటున్న చంద్రబాబు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని ఎద్దేవా చేశారు. సీమాంధ్రుల అభిప్రాయాలకు ఏమాత్రం విలువనివ్వని చంద్రబాబుకు మరోసారి అధికారం అప్పగిస్తే ఈ రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేయడానికి కూడా వెనకాడబోరన్నారు. రెండుకళ్ల సిద్ధాంతంతో అటు తెలంగాణ ప్రజలను, ఇటు సీ మాంధ్రులను మోసం చేసేందుకు చం ద్రబాబు తెగించారని చెప్పారు. రాష్ట్ర విభజనలో పాలుపంచుకున్న బీజేపీతో తెలుగుదేశం పొత్తుపెట్టుకోవాలనుకోవడం అనైతికమన్నారు. వీరి కూటమిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఏలూరు రెండో డివిజన్ అభ్యర్థి గుత్తుల బాలా త్రిపుర సుందరి, 16వ డివిజన్ అభ్యర్థి దాసరి రమేష్, 14వ డివిజన్ అభ్యర్థి అబ్బిరెడ్డి వెంకటలక్ష్మి, నాయకులు దాసరి వరలక్ష్మి, ఉదయేశ్వరరావు, బుద్దాల రాము, ఆలా గణేష్, రంగ ముత్యాలు, బత్తిన మస్తాన్ రావు, కోలా భాస్కరరావు, బుద్దాల గోవిందరావు, ఆళ్ల రాంబాబు తదితరులు వారి వెంట ఉన్నారు. -
ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని దీక్ష ప్రారంభం
ఏలూరు: సీమాంధ్ర ప్రజల తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన సమర దీక్షకు ‘పశ్చిమ’ ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఆమె దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే ఆళ్లనాని (కాళీ కృష్ణ శ్రీనివాస్)మంగళవారం ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుంటే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. విజయమ్మ సమర దీక్ష చారిత్రాత్మకమని ఆయన అన్నారు. చంద్రబాబునాయుడు వైఖరి వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని ఆళ్లనాని మండిపడ్డారు. బాబు బస్సుయాత్ర చేపడితే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు ఇప్పటికైనా రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని ఆళ్లనాని డిమాండ్ చేశారు. కాగా సమైక్యాంధ్రకు మద్దతుగా ఏలూరులో నేడు, రేపు విద్యాసంస్థలు బంద్ పాటిస్తున్నాయి. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన కొల్లేరు ప్రజలు భారీ ర్యాలీ చేపట్టారు. 22వ తేదీన ఏలూరులో పది వేలమంది రైతులతో భారీ ర్యాలీతోపాటు ధర్నా నిర్వహించనున్నారు.