mla chinta prabhakar
-
‘మోసంతోనే పద్దెనిమిదేళ్లు గెలిచావ్’
సాక్షి, సంగారెడ్డి : మెడికల్ కళాశాల మంజూరుకు దొంగ దీక్షలు చేస్తున్నారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై మండిపడ్డారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రజల్ని మోసం చేసి 18 సంవత్సరాలు ఎన్నికల్లో గెలుస్తూ వచ్చాడని జగ్గారెడ్డిపై విమర్శలు గుప్పించారు. జగ్గారెడ్డి ‘తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల పాలనా కాలంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ఆయన ఎందుకు ప్రయత్నం చేయలేదని ప్రశ్నించారు. గీతారెడ్డి, దామోదర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి సీనియర్లు ఇలాంటి మోసగాడికి మద్దతు తెలపడం బాధాకరమన్నారు. జగ్గారెడ్డిని ప్రజలు నమ్మరు.. మెడికల్ కళాశాల కోసం బూటకపు దీక్షలు చేస్తున్న జగ్గారెడ్డిని ప్రజలు విశ్వసించరని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే దీక్ష చేస్తున్నారని ఆరోపించారు. కళాశాల ఏర్పాటును కోరుతూ 2013లో చేసిన దరఖాస్తును.. మంజూరు అయినట్లు మాట్లాడటం సమంజసం కాదని పేర్కొన్నారు. వైద్య కళాశాల ఏర్పాటుపై ముఖ్యమంత్రితో మాట్లాడతామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగ్గారెడ్డికి ప్రజలు రాజకీయ సమాధి కడతారని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. -
ఉద్యమంలా హరితహారం చేపట్టాలి
సంగారెడ్డి రూరల్: మానవ మనుగడకు చెట్లు ఎంతో అవసరమని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. మంగళవారం సంగారెడ్డి మండలం చింతలపల్లి గ్రామంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామానికి 40 వేల మొక్కలు తప్పకుండా నాటేలా ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు అవసరైమన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కూలీలతో నాటిన మొక్కలకు కంచె ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. వాతావరణ కాలుష్యంతో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడిన నేపథ్యంలో ప్రాణవాయువును ఇచ్చే చెట్టు ఎంతో అవసరమని తెలిపారు. దీనిని గుర్తించుకుని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. రోజురోజుకు అటవీప్రాంతాలు తగ్గుముఖం పట్టడం వల్ల వాతావరణ సమత్యులత దెబ్బతింటుందన్నారు. అలాగే వర్షాలు సకాలంలో కురవటంలేదని చెప్పారు. చెట్టు అధికంగా ఉంటే వర్షాలు సమృద్దిగా కురవటంతోపాటు వాతావరణం చల్లగా ఉంటుందన్నారు. రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. అలాగే గ్రామంలోని ప్రభుత్వ భూములు, దేవాలయ భూములు, ప్రభుత్వ పాఠశాలల్లో విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు, ఉద్యోగులు సైతం హరితహారం అమలుపై ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విద్యార్థులతో కలిసి గ్రామంలోని రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటించారు. నాటిన మొక్కలను కాపాడతామని విద్యార్థులతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొండల్‌రెడ్డి, సర్పంచ్ పావని వెంకటేశ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు చిల్వెరి ప్రభాకర్, ఎంపీడీఓ సంథ్య, ఎంపీఓ ప్రవీణ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు ఎం.ఎ.హకీం, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి యూసుఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
దసరా కలిపింది ఇద్దరిని..
- ఒకే వేదికపై చింతా ప్రభాకర్, జగ్గారెడ్డి - ఆప్యాయంగా కరచాలనం, పలకరింపు సాక్షి, సంగారెడ్డి: ప్రత్యర్థులు ఒకే వేదికపైకి చేరారు.. ఎలా స్పందిస్తారోనని కార్యకర్తల్లో, అభిమానుల్లో ఉత్కంఠ.. ఈ పరిస్థితికి తెర దించుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దసరా వేదికపై ఒక్కటయ్యారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని, ఆలింగనం చేసుకున్నారు. సంగారెడ్డిలో దసరా వేడుకల నిర్వహణపై చింతా ప్రభాకర్, జగ్గారెడ్డి వర్గాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. పట్టణంలో పోటాపోటీగా ఫ్లెక్సీలు పెట్టారు. కరపత్రాలు పంచారు. దీంతో దసరా రోజు ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. అయితే, గురువారం అంబేద్కర్ స్టేడియంలో జరిగిన దసరా వేడుకల సందర్బంగా మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి ఎలాంటి వివాదాల జోలికి పోలేదు. రామమందిరం నుంచి వేడుకలు జరిగే ప్రాంతానికి ఊరేగింపుగా వచ్చారు. అనంతరం వేదికపైకి చేరుకుని ప్రజలకు అభివాదం చేశారు. ఈ సమయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, ఆయన నేరుగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వద్దకు వెళ్లి కరచాలనం చేసి పలకరించారు. ప్రభాకర్ సైతం జగ్గారెడ్డిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. దీంతో దసరా వేడుకలకు హాజరైన ప్రజలు, ఇరువురు నేతల అనుచరుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మొదటగా ప్రసంగించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజకీయ అంశాలను ప్రస్తావించలేదు. గతేడాది ఓడిపోయినందున వేడుకలకు హాజరుకాలేదని ఇకపై వేడుకలకు హాజరువుతానని తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్న చింతా ప్రభాకర్‌ను గౌరవిస్తానని చెప్పారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ జగ్గారెడ్డితో తనకెలాంటి విభేదాలు లేవన్నారు. మొత్తంగా ఇద్దరు నేతల కలయిక అందరినీ ఆకర్షించింది. -
ఇళ్ల పట్టాల పంపిణీలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు
సంగారెడ్డి (మెదక్ జిల్లా): తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు. 58 ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా సంగారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ జీవో ప్రకారం ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు 125 గజాలు విస్తీర్ణం గల స్థలాన్ని క్రమబద్ధీకరించనున్నట్లు మంత్రి హరీశ్ రవు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.