సమైక్య సభకు సిక్కోలు జనం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం రాష్ట్ర రాజధానిలో శనివారం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరగనున్న సమైక్య శంఖారావం సభకు జిల్లా నుంచి వేల సంఖ్యలో ప్రజ లు తరలివెళ్లారు. బస్సులు కేటాయించేందుకు ఆర్టీసీ అధికారులు నిరాకరించడంతో ప్రైవేట్ వాహనాల నే పార్టీ నాయకులుబుక్ చేసుకున్నారు. రైళ్లు, ప్రైవేట్ బస్సు లు, కార్లలో గురు, శుక్రవారాల్లో వీరంతా బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల ముందు నుంచే పార్టీ అభిమానులు, కార్యకర్తలు హైదరాబాద్కు వెళ్లినా.. శుక్రవారం మధ్యాహ్నం నుంచి అధిక సం ఖ్యలో తరలి వెళ్లారు.
కొందరు విశాఖపట్నం వెళ్లి అక్కడి నుంచి రైళ్లలో రాజధానికి ప్రయాణమయ్యారు. వర్షాలు, వరదలు జిల్లాను అతలాకుతలం చేస్తున్న సమయంలో ఒకవైపు బాధిత ప్రాంతాల్లో సహాయ చర్యల్లో ముమ్మరంగా పాల్గొం టూనే.. మరోవైపు పార్టీ పిలుపు మేరకు, సమైక్యాంధ్ర లక్ష్యసాధనకు తమ వంతు కృషి చేస్తున్నారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలో జనం తరలివెళ్లారు. శుక్రవారం శ్రీకాకుళం నియోజకవర్గంలోని కళింగ పట్నం తీరప్రాంతంలో భారీగా వరదనీరు గ్రామాల్లోకి చేరడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు సహాయ కార్యక్రమాల్లో మునిగితేలారు. పలువురికి ఆహారం అందించారు.
కాగా పార్టీ జిల్లా కన్వీనర్, నర్సన్నపేట ఎమ్మె ల్యే ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవ ర్గ పరిశీలకుడు పిరియా సాయిరాజ్, సీజీసీ సభ్యులు పాలవలస రాజశేఖరం, మాజీ మంత్రి తమ్మినేని సీతారామ్, అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తల నాయకత్వంలో నాయకులు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. కాగా పార్టీతో సంబంధం లేని అనేక మంది ఉద్యోగు లు, అభిమానులు, సమైక్యాంధ్రను కోరుకునే ప్రజలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా హైదరాబాద్కు ప్రయాణమయ్యారు. జిల్లాలో తుపాను, భారీ వర్షాలు బీభత్సం సృష్టించినా జనం లెక్కచేయకుండా సమై క్య నినాదాన్ని వినిపించాలని గత రెండు రోజులుగా ఎవరికి వారు తరలి వెళ్లడం విశేషం.