ప్యూన్ ఉద్యోగానికి ఎమ్మెల్యే కొడుకు
జైపూర్: రాజకీయ నేతలు ఎవరైనా తన కొడుకు తమలాగే నాయకుడు కావాలనో, లేకపోతే పెద్ద ఉద్యోగాలు చేయాలనో కోరుకుంటారు. అవసరమైతే దొడ్డిదారిలోఉద్యోగాలు ఇప్పించుకుంటారు. కానీ రాజస్థాన్‌లోని బీజేపీ ఎమ్మెల్యే హీరాలాల్ వర్మ ఇందుకు విరుద్ధం. 8వ తరగతి పాసైన తన కొడుక్కి ప్యూన్ ఉద్యోగమే సరైందన్నారు.
తన కొడుకు హన్స్‌రాజ్ అర్హతకు కు ఇలాంటి ఉద్యోగమే సరిపోతుందన్నారు. శనివారం ఈ ఉద్యోగానికి అజ్మీర్‌లో జరిగిన ఇంటర్వ్యూకు హన్స్‌రాజ్ హాజరయ్యారు. ఇంటర్వ్యూ బాగా జరిగిందని తన కొడుక్కి ఉద్యోగం వస్తుందని వర్మ అన్నారు. వర్మ రాజకీయాల్లోకి రాక ముందు సాంఘిక సంక్షేమ శాఖలో డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేశారు. గోల్డ్‌మెడలిస్ట్ కూడా. కొడుక్కి మాత్రం చదువు అబ్బలేదు. ప్రస్తుతం నెలకు రూ.5వేల జీతానికిప్రైవేట్ క్లినిక్‌లో పనిచేస్తున్నాడు.