mla house
-
మణిపూర్‌లో మళ్లీ హింస... మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై నిరసనకారుల దాడి
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు మళ్లీ రాజుకున్నాయి. కుకీ, మైతీ వర్గాల మధ్య వైరంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుకీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన మైతీ వర్గానికి చెందిన వారి ఆరుగురి మృతదేహాలు లభ్యం కావడంతో రాష్ట్రంలో తాజాగా అలజడి రాజుకుంది. ఈ క్రమంలో వీరి హత్యకు నిరసనగా జిరిబామ్ జిల్లాలో నిరసనలు ఆందోళన చేపట్టారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఇంఫాల్‌లో ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసనకారులు దాడి చేశారు. శాసనసభ్యుల ఇళ్లపై అల్లరి మూకలు దాడులు చేయడంతో జిరిబామ్ జిల్లాలో అధికారులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఇంఫాల్ వెస్ట్, ఈస్ట్, బిష్ణుపూర్, తౌబల్, కక్చింగ్, కాంగ్పోక్పి, చురచంద్‌పూర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలను నిలిపివేశారు.లాంఫెల్ సనకీతెల్ ప్రాంతంలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సపమ్ రంజన్ నివాసంపై ఒక గుంపు దాడి చేసిందని సీనియర్ అధికారి తెలిపారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని సగోల్‌బంద్ ప్రాంతంలో ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆర్కే ఇమో నివాసం ముందు నినాదాలు చేశారు. ముగ్గురిని హత్య చేసిన నిందితులను 24 గంటల్లోగా పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు.కైషామ్‌థాంగ్ నియోజకవర్గ స్వతంత్ర శాసనసభ్యుడు సపం నిషికాంత సింగ్‌ను తిడ్డిమ్ రోడ్‌లోని ఆయన నివాసంలో కలవడానికి నిరసనకారులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యే రాష్ట్రంలో లేరని చెప్పడంతో ఆయనకు చెందిన స్థానిక వార్తాపత్రిక కార్యాలయ భవనాన్ని లక్ష్యంగా చేసుకొనిదాడులు చేశారు.కాగా ఈ వారం ప్రారంభంలో అనుమానిత కుకీ మిలిటంట్లు జిరిబామ్ జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్‌పై దాడి చేయడంతో భద్రతా దళాలకు, మిలిటెంట్ల మధ్య కాల్పులు జరిగాయి. ఈ భారీ ఎన్కౌంటర్ అనంతరం ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులను కుకీలు బందీలుగా తీసుకెళ్లారు. వారి మృతదేహాలు శనివారం ఉదయం గుర్తించారు. -
Maratha reservation: మరాఠాల ఆందోళన హింసాత్మకం
ముంబై: మహారాష్ట్రలో ప్రత్యేక కోటా డిమాండ్‌తో మరాఠాలు చేపట్టిన ఆందోళన మళ్లీ హింసాత్మక రూపం దాల్చింది. ఆందోళనకారులు సోమవారం బీడ్ జిల్లా మజల్‌గావ్‌లోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎమ్మెల్యేలు ప్రకాశ్ సోలంకె, సందీప్ క్షీరసాగర్ ఇళ్లకు నిప్పు పెట్టారు. మజల్గావ్ మున్సిపల్ కౌన్సిల్ భవనంలోని మొదటి అంతస్తులో ఫర్నిచర్‌కు నిప్పుపెట్టి, విధ్వంసం సృష్టించారు. ఛత్రపతి శంభాజీ జిల్లా గంగాపూర్‌లో నిరసనకారులు బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్ బంబ్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కిటికీలు, ఫర్నిచర్ పగులగొట్టారు. పలు చోట్ల రహదారులపై బైటాయించారు. మరాఠాలకు ప్రత్యేక కోటా డిమాండ్‌కు మద్దతుగా సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన నాశిక్, హింగోలి ఎంపీలు హేమంత్ గాడ్సే, హేమంత్ పాటిల్‌లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘మరాఠాలకు రిజర్వేషన్లు అక్టోబర్ 24 నుంచి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి 40 రోజుల డెడ్‌లైన్ పెట్టిన వారు ఈ వ్యవహారం చిన్న పిల్లల ఆట అనుకుంటున్నారు’అంటూ ఎమ్మెల్యే సోలంకె చేసిన వ్యాఖ్యల ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరాఠాలకు రిజర్వేషన్ల డిమాండ్‌తో మనోజ్ జరంగె అనే వ్యక్తి అక్టోబర్ 25 నుంచి జల్నా జిల్లాలోని అంతర్వలి సరటి గ్రామంలో నిరశన దీక్షకు సాగిస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే సోలంకె..కనీసం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేయని వ్యక్తి, ఇప్పుడు నాయకుడా..అంటూ వ్యాఖ్యానిస్తున్నట్లుగా ఆ ఆడియోలో ఉంది. దీంతో మరాఠా సంఘాలు భగ్గుమన్నాయి. సోమవారం స్థానికంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. కొందరు ఆందోళనకారులు సోమవారం మధ్యాహ్నం మజల్‌గావ్‌లోని ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టారు. ఆయన నివాసానికి, కారుకు నిప్పుపెట్టారు, రాళ్లు రువ్వారు. ఘటన సమయంలో ఆ ఇంట్లోనే ఉన్నట్లు ఎమ్మెల్యే సోలంకె ఆ తర్వాత తెలిపారు. బీడ్ నగరంలో మరో ఎన్సీపీ ఎమ్మెల్యే సందీప్ క్షీరసాగర్ నివాసం, ఆఫీసుకు కూడా నిప్పు పెట్టారు. పోలీసులు అక్కడికి చేరుకున్న గుంపును చెదరగొట్టారు. బీడ్‌లోని ఒక హోటల్‌కు మరాఠా నిరసనకారులు అగ్నికి ఆహుతి చేశారు. జల్నా వద్ద ముంబైకి వెళ్లే సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వేపై బైటాయించారు. షోలాపూర్–అక్కల్కోట్ హైవేపై మండుతున్న టైర్లను వేసి వాహనాలను అడ్డుకున్నారు. కొందరు నిరసనకారులు కర్రలు పట్టుకుని గంగాపూర్‌లోని ఎమ్మెల్యే ప్రశాంత్ కార్యాలయంపై దాడి చేశారు. యావత్మాల్లో తనను ఆందోళనకారులు అడ్డగించి, రిజర్వేషన్ అంశంపై నిలదీశారని హింగోలి ఎంపీ హేమంత్ పాటిల్ తెలిపారు. దీంతో, రాజీనామా పత్రం రాశానన్నారు. తన రాజీనామా లేఖ అందినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి రసీదు వచ్చిందని చెప్పారు. రిజర్వేషన్లపై వైఖరి తెలపాలంటూ నాశిక్ ఎంపీ గాడ్సేను కొందరు నిలదీయడంతో ఆయన రాజీనామా చేసి లేఖను సీఎంకు పంపించారు. -
గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో యువకుడి ఉరి
జునాగఢ్: గుజరాత్ రాష్ట్రం జునాగఢ్ జిల్లా చార్వాడ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విమల్ చుదాసామా ఇంట్లో ఓ యువకుడు(28) అనుమాస్పద స్థితిలో ఉరికి వేలాడుతూ శవమై కనిపించాడు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించిందని, తన ఆత్మహత్యకు ఎమ్మెల్యే విమల్తోపాటు అతడి అత్త, మామ వేధింపులే కారణమంటూ ఆ లేఖలో ఉందని వివరించారు. బలవన్మరణానికి పాల్పడిన యువకుడిని నితిన్ పర్మర్‌గా పోలీసులు గుర్తించారు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఇంటి పైకప్పునకు ఉరి వేసుకొని చనిపోయినట్లు చెప్పారు. చనిపోయిన యువకుడు నితిన్ ఎమ్మెల్యేకు దగ్గరి బంధువేనని తెలిసిందని అన్నారు. అయితే, ఎమ్మెల్యే విమల్ వాదన మరోలా ఉంది. నితిన్‌ను ఎవరో హత్య చేశారని, తనను అప్రతిష్టపాలు చేయడానికే ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని, నకిలీ సూసైడ్ నోట్‌ను సృష్టించారని ఆరోపించారు. నితిన్ చావుకు తానే కారణం అంటూ రాజకీయ ప్రత్యర్థులు నిందలు మోపుతున్నారని వాపోయారు. -
ప్రసాద్ గౌడ్ ను చూసి గట్టిగ అరిచిన జీవన్ రెడ్డి
-
సీన్ మారింది
- ఎమ్మెల్యే ఇంట్లో టీడీపీ నాయకుల సమావేశం - పీఏ శేఖర్ ప్రస్తావన లేకుండానే ముగించిన వైనం హిందూపురం అర్బన్ : పురంలో టీడీపీ అసమ్మతి నాయకుల సీన్ తెల్లవారేసరికి మారిపోయింది. నిన్నటి దాకా ‘‘పీఏ శేఖర్‌ను హిందూపురం నుంచి తరిమేద్దాం.. ఆయన ఉంటే మేం పార్టీకి రాజీనామా చేస్తాం..’’ అని పలికిన వారంతా తాజాగా శుక్రవారం ‘‘ఎమ్మెల్యే బాలకృష్ణ వెంటే ఉందాం. ఆయన ఎవరికి పెత్తనమిచ్చినా.. వారి వెంట నడుద్దాం.’’ అని పేర్కొన్నారు. బాలయ్య పీఏ అనుకూల వర్గం వారు శుక్రవారం ఎమ్మెల్యే ఇంట్లో సమావేశమయ్యారు. ఇన్నాళ్లూ అసమ్మతి వర్గంలో ఉన్న బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, వైస్‌చైర్మన్ రాము, ఆస్పత్రి కమిటీ చైర్మన్ వెంకటస్వామి, మైనార్టీ కార్పొరేషన్ సభ్యులు షఫీ సమావేశానికి హాజరు కావడంతో కంగుతినడం కార్యకర్తల వంతైంది. ఎమ్మెల్యే పీఏ శేఖర్‌ను హిందూపురం నుంచి సాగనంపాలనే డిమాండ్‌తో ఈనెల 5న అసమ్మతి నాయకులు చిలమత్తూరులో భారీఎత్తున సమావేశం పెట్టేందుకు మంతనాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సమావేశం జరిగితే పార్టీ ప్రతిష్ట దెబ్బ తింటుందని భావించిన ఎమ్మెల్యే పీఏ శేఖర్ వర్గీయులు సమావేశానికి అడ్డుకట్ట వేసేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే బాలకృష్ణతో కొందరు ముఖ్యనాయకులకు ఫోన్ కూడా చేయించారు. దీంతో గురువారం రాత్రి అసమ్మతి వర్గంలో ఉన్న నాయకులు శుక్రవారం ఉదయానికే ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణ మాట్లాడుతూ బాలకృష్ణపై తప్పుడు ప్రచారం చేస్తే చంపేస్తామన్నారు. ఇదంతా చూసిన కార్యకర్తలు ఇదేం గోలరా.. బాబూ అని చర్చించుకోవడం విశేషం. అయితే సమావేశంలో ఎక్కడా పీఏ శేఖర్ ప్రస్తావన రాలేదు. ఉన్నంతసేపు బాలకృష్ణపై స్వామిభక్తి చాటుకున్నారు. -
ఖానాపూర్ ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి
ఖానాపూర్ (ఆదిలాబాద్) : తమ వేతనాలు పెంచాలంటూ సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె 32 వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఆదివారం ఉదయం ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాం నాయక్ ఇంటిని కార్మికులు ముట్టడించారు. డప్పుల దరువులతో ఊరేగుతూ వచ్చిన కార్మికులు ఎమ్మెల్యే ఇంటి ముందు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. -
శ్రీకాకుళంలో ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడించిన వైఎస్సార్ సీపీ