జగన్ యువభేరితో ప్రభుత్వానికి ముచ్చెమట
* విద్యార్థి, యువజనులు కన్నెర చేస్తే ఉప్పెనే..
* ఫిబ్రవరి 11న బాపట్లలో యువభేరి
* బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి
బాపట్ల: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న యువభేరితో రాష్ట్ర ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పేర్కొన్నారు. బాపట్లలో ఫిబ్రవరి 11వ తేదీన నిర్వహించనున్న యువభేరి సదస్సుకు సమాయత్తంగా బాపట్ల నియోజకవర్గంలోని విద్యార్థి, యువజనుల సదస్సును శనివారం కోన ఛాంబర్లో నిర్వహించారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ విద్యార్థి, యువజనులు కన్రెర చేస్తే ఆ ఉప్పెనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టుకుపోతాయని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు విద్యార్థి, యువజనుల్లో చెరగని ముద్రవేసుకున్నాయని, వాటిని నిర్వీర్యం చేసేందుకు నేడు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. ప్రత్యేక హోదాతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని అందరూ ఆశగా ఎదురుచూస్తే, ప్రత్యేక ప్యాకేజీ అంటూ కాలం గడుపుతున్నారని దుయ్యబట్టారు. కనీసం ప్యాకేజీ కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో రాష్ట్రప్రభుత్వం ఉందంటే సిగ్గుచేటని పేర్కొన్నారు.
ప్రజా ఉద్యమాన్ని అడ్డుకోలేరు : బాలవజ్రబాబు
వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు వి.బాలవజ్రబాబు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాన్ని అడ్డుకునే శక్తి ఎవ్వరికీ లేదన్నారు. కచ్ఛితంగా రాష్ట్రంలో వైఎస్సార్కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వస్తుందని, జగనన్నను ముఖ్యమంత్రిగా చూసుకుందామని పేర్కొన్నారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పుడప్పుడు ఎన్నికలు వస్తాయా అంటూ కసిగా ఎదురుచూస్తున్నారని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. యువభేరిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో వైఎస్సార్సీపీ పట్టణ, మండల అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశరావు, కోకి రాఘవరెడ్డి, దొంతిబోయిన సీతారామిరెడ్డి,షేక్. బాజీ, పార్టీ నాయకులు వడ్డిముక్కల డేవిడ్, కూనపురెడ్డి ఆవినాష్నాయుడు, చింతల రాజశేఖర్, చందు, నరీన్, మరియదాసు, మనోహర్, జయభారత్‌రెడ్డి, వాలి శివారెడ్డి, ఆట్ల ప్రసాద్‌రెడ్డి, కోకి పవన్‌కుమార్, కోదండం, కొక్కిలిగడ్డ చెంచయ్య, బడుగు ప్రకాశ్,నర్రావుల వెంకట్రావు,మారం రామకోటేశ్వరరావు, గొర్రుముచ్చు పుష్పరాజ్యం, శేఖర్, సమ్మెట వెంకటేశ్వరరెడ్డి, చిన్నపోతుల హరి తదితరులు పాల్గొన్నారు.