Published
Tue, Sep 27 2016 5:33 PM
| Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
హోదాపై రాజీ పడొద్దు
సీఎంకు బాపట్ల ఎమ్మెల్యే కోన వినతి
బాపట్ల : రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం ప్రయత్నించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వినతి పత్రం అందించారు. బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో సోమవారం జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన lముఖ్యమంత్రినిS ఎమ్మెల్యే కోన కలిసి ఈమేరకు విన్నవించారు. హోదా విషయంలో ఎటువంటి రాజీపడవద్దని కోరారు. సూర్యలంక బీచ్‌ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక ప్రాజెక్టు కింద సూర్యలంకను తీసుకుని కలెక్టర్‌ని అందుకు సంబంధించిన అడ్మిస్ట్రేషన్ ఆఫీసర్‌గా నియమిస్తే అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.2.80 కోట్ల ప్రత్యేక నిధులు వివిధ పనుల నిమిత్తం విడుదల చేయాలని కోరారు. నల్లమల డ్రెయిన్ ఆధునీకరణæ చేసేందుకు నిధులు విడుదల చేయటంతో పాటు ఎమ్మెల్యే గ్రాంటు మంజూరు చేయాలన్నారు. వీటిపై ముఖ్యమంత్రి పరిశీలిస్తామని చెప్పారు.