MLA Somnath Bharti
-
నా డాన్‌ను వేధిస్తున్నారు
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు తన కుక్కను వేధిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి ఆరోపిస్తున్నారు. కేసు విచారణలో తాను పూర్తిగా సహకరిస్తున్నా, తన పెంపుడు కుక్క డాన్‌ను వేధించడం సరికాదన్నారు. విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు లాక్కొచ్చి మూగజీవిని కష్టపెట్టారని విమర్శించారు. ఆప్ నేతపై ఉన్న గృహహింస కేసు విచారణలో భాగంగా ద్వారాకానాథ్ పోలీసులు సోమనాథ్ భారతి పెంపుడు కుక్క డాన్(12)ను గురువారం పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. కాగా తాను గర్భవతిగా ఉన్నప్పుడు తన భర్త దాడికి పాల్పడ్డాడని, ఆయన తన లాబ్రడార్ జాతికి పెంపుడు కుక్కను తనపైకి వదిలేవాడని భార్య లిపికా మిత్రా ఫిర్యాదు చేశారు. ఆప్ ప్రభుత్వంలో పెద్ద అలజడి సృష్టించిన ఈ వివాదంలో, సోమనాథ్ భారతిపై గృహహింస, హత్యాయత్నం కేసు నమోదైంది. చివరికి అనేక నాటకీయ పరిణామాల మధ్య సోమ్పాథ్ కోర్టు ముందు లొంగిపోయారు. ఈ నేపథ్యంలో ఆ కుక్కను గతంలో పోలీసు స్టేషన్‌కు తరలించడం సంచలనం సృష్టించింది. అయితే సోమనాథ్ భారతి ఆదేశాలను డాన్ (కుక్క) పాటించడం లేదంటూ అప్పట్లో క్లీన్ చిట్ లభించిన సంగతి తెలిసిందే. -
ఆప్ ఎమ్మెల్యేపై గృహహింస, హత్యాయత్నం కేసు
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే సోమనాథ్ భారతిపై గృహహింస, హత్యాయత్నం కేసు నమోదైంది. గురువారం నాడు ఫిర్యాదు చేయగా తన భర్తపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని ఆయన భార్య లిపికా మిత్రా మీడియాకు తెలిపారు. అయితే ఈ కేసుపై ఫిర్యాదు చేసిన అనంతరం జరుగుతున్న విషయాలపై తాను చాలా అసంతృప్తిగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. నా భర్త చాలా శక్తివంతమైన మనిషి, ఆయన వెనక సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యే భార్య, డీసీడబ్ల్యూ మాజీ చైర్ పర్సన్ బర్ఖా శుక్లా సింగ్ తో కలిసి సీనియర్ స్పెషల్ పోలీస్ కమిషనర్ దీపక్ మిశ్రాను పోలీసు ప్రధాన కార్యాలయంలో కలిశారు. తన భర్తపై చర్య తీసుకునేందుకు సిద్ధమైనందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. తన భర్తపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు మూడు నెలల సమయం పట్టిందని, నాకు కావాల్సిన పనిని పోలీసులు ఇప్పుడైనా చేశారన్నారు. తన వద్ద బలమైన సాక్ష్యాలున్నాయని, తాను గర్భవతిగా ఉన్న సమయంలో తన భర్త దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. సెక్షన్ 307, సెక్షన్ 498(ఎ), సెక్షన్ 406, 420 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు లిపికా మిత్రా చెప్పారు. ఢిల్లీ కోర్టు గురువారం తన స్టేట్ మెంట్ తీసుకున్నట్లు లిపికా మిత్రా వివరించారు. ఈ కేసుకు సంబంధించి నేడు విచారణకు రావాల్సిందిగా ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి గురువారం రాత్రి నోటీసులు అందినట్లు సమాచారం. -
తెలంగాణలో అవినీతి అంతమే ధ్యేయం
‘ఆప్’ దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జి సోమనాథ్ కవాడిగూడ: కేసీఆర్ కుటుంబ సభ్యులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీగా మారిందని, తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతి రహితంగా తయారు చేయడమే ఆప్ ప్రధాన ధ్యేయమని ఆమ్ ఆద్మీ పార్టీ దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జి, ఢిల్లీ ఎమ్మెల్యే సోమనాథ్ భార్తి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగింది. పార్టీ రాష్ట్ర కన్వీనర్ ఆర్.వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నా ప్రజలకు సరైనా న్యాయం జరగడం లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలోనూ అవినీతి విచ్చలవిడిగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు బ్యాంకు అకౌంట్లలో రూ.15 లక్షలు వేస్తానని చెప్పి, ఆయన మాత్రం రూ.10 లక్షల విలువ చేసే కోట్లు ధరిస్తున్నాడని విమర్శించారు. ఆప్ కార్యకర్తలు ఉత్తమ క్రమశిక్షణతో సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేస్తే వచ్చే 2019 ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆప్ నాయకులు నమ్రతా జైస్వాల్, సిలివేరు శ్రీశైలం, ఖాలిబ్, నసీమా బేగం, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.