నా డాన్ను వేధిస్తున్నారు | somnath Bharti said his Labrador Don is being harassed to appear at the police station | Sakshi
Sakshi News home page

నా డాన్ను వేధిస్తున్నారు

Published Thu, Dec 10 2015 7:32 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

నా డాన్ను వేధిస్తున్నారు - Sakshi

నా డాన్ను వేధిస్తున్నారు

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు తన కుక్కను వేధిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి ఆరోపిస్తున్నారు. కేసు విచారణలో తాను పూర్తిగా సహకరిస్తున్నా, తన పెంపుడు కుక్క డాన్‌ను వేధించడం సరికాదన్నారు.  విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు లాక్కొచ్చి మూగజీవిని కష్టపెట్టారని విమర్శించారు. ఆప్ నేతపై ఉన్న గృహహింస కేసు విచారణలో భాగంగా   ద్వారాకానాథ్ పోలీసులు సోమనాథ్ భారతి పెంపుడు కుక్క డాన్(12)ను గురువారం పోలీస్ స్టేషన్కు పిలిపించారు.

కాగా తాను గర్భవతిగా ఉన్నప్పుడు తన భర్త దాడికి పాల్పడ్డాడని, ఆయన తన లాబ్రడార్ జాతికి పెంపుడు కుక్కను తనపైకి వదిలేవాడని భార్య లిపికా మిత్రా ఫిర్యాదు చేశారు. ఆప్ ప్రభుత్వంలో పెద్ద అలజడి సృష్టించిన ఈ  వివాదంలో, సోమనాథ్ భారతిపై గృహహింస, హత్యాయత్నం కేసు నమోదైంది.  చివరికి అనేక నాటకీయ పరిణామాల మధ్య సోమ్పాథ్  కోర్టు ముందు లొంగిపోయారు. ఈ నేపథ్యంలో ఆ కుక్కను గతంలో పోలీసు స్టేషన్‌కు తరలించడం సంచలనం సృష్టించింది. అయితే సోమనాథ్ భారతి ఆదేశాలను డాన్ (కుక్క) పాటించడం లేదంటూ అప్పట్లో క్లీన్ చిట్ లభించిన సంగతి  తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement