MLA vishnu kumar raju
-
కళా వెంటనే మార్వాడీలకు క్షమాపణలు చెప్పాలి
-
ఓటర్ల ఆత్మాభిమానం ఏమవ్వాలి?
సాక్షి, అమరావతి: ‘కొందరు పార్టీలో గౌరవం దక్కడం లేదని, ఆత్మాభిమానం కోసమే వేరే పార్టీలోకి వెళ్తున్నట్లు చెబుతున్నారు.. ఒక గుర్తుపై ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిచి ఆ పదవికి రాజీనామా చేయకుండానే ఇంకొక పార్టీలో చేరుతుంటే ఆ పార్టీని, నాయకుడిని చూసి వారిని గెలిపించిన ప్రజల ఆత్మాభిమానం ఏమైపోవాలి’ అని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు విష్ణుకుమార్రాజు సూటిగా ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలు మారే వారు అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరాలనుకుంటే ఉన్న పదవికి రాజీనామా చేయాలన్నారు. పార్టీ నాయకుడిని విభేదించడంలో ఏ నేతనూ ఎవరూ తప్పుపట్టరని, అలాంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పడు ఆ పార్టీ వల్ల దక్కిన పదవులను కూడా వదులుకోవాలని సూచించారు. పార్టీ మారే ఎమ్మెల్యేలు ఎవరైనా తమ పదవికి రాజీనామా చేసి తిరిగి గెలిచి వస్తే అందరూ స్వాగతిస్తారన్నారు. -
అసెంబ్లీలో లేకున్నా ఎలా సస్పెండ్ చేస్తారు?
బద్వేలు ఎమ్మెల్యే తిరువీధి జయరాములు బద్వేలు(అట్లూరు): అసెంబ్లీలో లేని తనను ఎలా సస్పెండ్ చేస్తారని వైఎస్సార్ జిల్లా బద్వేలు ఎమ్మెల్యే తిరువీధి జయరాములు ప్రశ్నించారు. ఐదు రోజుల క్రితం అయ్యప్పస్వామి దర్శనం కోసం శబరిమలై వెళ్లిన ఆయన శనివారం సాయంత్రం పోరుమామిళ్లలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తాను ఐదు రోజుల క్రితం శబరిమలైకి వెళ్లానని అందువల్ల అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేకపోయానన్నారు. అయినా ఈనెల 18న తాను అసెంబ్లీలో ఉన్నట్లు ప్రకటించి స్పీకర్ తనను కూడా సస్పెండ్ చేశారన్నారు. అదే రోజు శాసనసభలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బద్వేలు ఎమ్మెల్యే జయరాములు అసెంబ్లీలో లేరని ఆయనను ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. అధికార పార్టీ అసెంబ్లీలో వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.