
సాక్షి, అమరావతి: ‘కొందరు పార్టీలో గౌరవం దక్కడం లేదని, ఆత్మాభిమానం కోసమే వేరే పార్టీలోకి వెళ్తున్నట్లు చెబుతున్నారు.. ఒక గుర్తుపై ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిచి ఆ పదవికి రాజీనామా చేయకుండానే ఇంకొక పార్టీలో చేరుతుంటే ఆ పార్టీని, నాయకుడిని చూసి వారిని గెలిపించిన ప్రజల ఆత్మాభిమానం ఏమైపోవాలి’ అని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు విష్ణుకుమార్‌రాజు సూటిగా ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలు మారే వారు అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరాలనుకుంటే ఉన్న పదవికి రాజీనామా చేయాలన్నారు. పార్టీ నాయకుడిని విభేదించడంలో ఏ నేతనూ ఎవరూ తప్పుపట్టరని, అలాంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పడు ఆ పార్టీ వల్ల దక్కిన పదవులను కూడా వదులుకోవాలని సూచించారు. పార్టీ మారే ఎమ్మెల్యేలు ఎవరైనా తమ పదవికి రాజీనామా చేసి తిరిగి గెలిచి వస్తే అందరూ స్వాగతిస్తారన్నారు.