MLAs telangana
-
Telangana: కొలువుదీరనున్న కొత్త సభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ శనివారం ఉదయం 11 గంటలకు తొలిసారిగా కొలువు దీరనుంది. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి శుక్రవారం సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేశారు. కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం, ధన్యవాద తీర్మానం తదితరాల కోసం నాలుగు రోజుల పాటు అసెంబ్లీ తొలి సమావేశాలు జరుగనున్నాయి. రాజ్‌భవన్‌లో అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం తొలిరోజు సమావేశంలో కొత్తగా ఎన్నికైన 119 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమా న్ని నిర్వహించేందుకు ఏఐఎంఐఎం సీనియర్ శాసన సభ్యు డు అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెమ్ స్పీకర్‌గా నామినేట్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రొటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్‌తో రాజ్‌భవన్‌లో శనివారం ఉదయం 8.30కు గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సీఎం ఎ.రేవంత్‌రెడ్డితో పాటు మంత్రివర్గ సభ్యులు ఈ కార్యక్ర మంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ప్రొటెమ్ స్పీకర్ అధ్యక్షతన తెలంగాణ మూడో శాసనసభ తొలిరోజు సమావేశం ప్రారంభమవుతుంది. తొలుత సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత తెలుగు అక్షరమాలలోని అక్షర క్రమంలో ఎన్నికైన ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తొలిసారిగా అసెంబ్లీకి 51 మంది అన్ని పార్టీల తరఫున కలుపుకుని మొ త్తం 51 మంది తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు కాగా, కరీంనగర్ జిల్లా నుంచి 8 మంది తొలిసారిగా ఎన్నికైన వారున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇద్దరు తొలిసారి అడు గు పెడుతున్నారు. 51 మందిలో 18 మంది క్రియాశీల రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేస్తున్న వారే. కేసీఆర్, రాజాసింగ్ దూరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదు. బీజేపీ తరఫున ఎన్నికైన రాజాసింగ్.. ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యేను నియమించినందున తాను ఆయన ఎదుట ప్రమాణ స్వీకారం చేయబోనని ప్రకటించారు. నేడు స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత స్పీకర్ ఎన్నిక కోసం శనివారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల కానుంది. వికారాబాద్ శాసనసభ్యుడిగా ఎన్నికైన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను శాసనసభ స్పీకర్‌గా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఆయన శనివారం సాయంత్రం సీఎం రేవంత్, మంత్రివర్గం సమక్షంలో నామినేషన్ సమర్పిస్తారని తెలిసింది. కాగా రెండో రోజు ఆదివారం స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బాధ్యతల స్వీకరణ కార్యక్రమం, ఆ తర్వాత కొత్త స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. ఈ నెల 11న సోమవారం జరిగే మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత వాయిదా పడే సభ తిరిగి 12వ తేదీ మంగళవారం ఉదయం ప్రారంభమవుతుంది. నాలుగో రోజు సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడుతుంది. బీఆర్ఎస్కు విపక్ష హోదా శాసనసభలో మొత్తం 119 మంది సభ్యులకు గాను తెలంగాణ మూడో శాసనసభలో అధికార కాంగ్రెస్‌కు 64, మిత్రపక్షం సీపీఐకి ఒకరు చొప్పున ఎమ్మెల్యేల బలం ఉంది. బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఏఐఎంఐఎంకు ఏడుగురు సభ్యుల బలం కలిగి ఉన్నాయి. అధికార కాంగ్రెస్ తర్వాత ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్కు విపక్ష హోదా దక్కే అవకాశముంది. ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్ మూడో శాసనసభ తొలి సమావేశాలు శనివారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా ఏర్పాట్లను పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం అసెంబ్లీలో అధికారులతో సమీక్ష తర్వాత భద్రత, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు, అసెంబ్లీ చీఫ్ మార్షల్ కరుణాకర్, ఐఏఎస్ అధికారులు అశోక్‌రెడ్డి, హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు సింగిల్ బెంచ్‌లో మంగళవారం విచారణ జరిగింది. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదైందా అని కోర్టు ప్రశ్నించగా..ఇంకా నమోదు కాలేదని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కేసు బదిలీకి మూడు సార్లు లేఖ రాసినా ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. సీబీఐ కేసు నమోదు చేయాలని, కేసు ఫైళ్లు అప్పగించాలని సీబీఐ ఒత్తిడి చేస్తోందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు పిటిషన్ విచారణకు చీఫ్ జస్టిస్ బెంచ్ నుంచి అనుమతి తీసుకొని రావాలని జస్టిస్ విజయసేన్‌రెడ్డి అడ్వకేట్ జనరల్‌కు సూచించారు. దీంతో రేపు ఉదయం సీజే బెంచ్‌లో మెన్షన్ చేస్తామని ఏజీ తెలిపారు. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఎన్నిరోజులు పడుతుందని సింగిల్ బెంచ్ ప్రశ్నించగా.. వారం పడుతుందని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. కాగా ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించి హైకోర్టు సింగిల్ బెంచ్ సీబీఐ విచారణకు అప్పగించాలని ఇచ్చిన తీర్పుపై.. తెలంగాణ ప్రభుత్వం. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నిన్న(సోమవారం) డివిజన్ బెంచ్ తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్ వేసింది. మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉన్నత న్యాయస్థానంలో తెలంగాణ సర్కార్‌కు చుక్కెదురైంది. సీబీఐ విచారణకే మొగ్గు చూపిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సమయం కోరగా.. అందుకు కూడా హైకోర్టు నిరాకరించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిబీఐతో విచారణ జరిపించాలని తెలంగాణ సర్కార్‌ను.. సింగిల్ బెంచ్ తీర్పు అమలు చేయాలనీ దర్యాప్తు సంస్థ సీబీఐని ఆదేశించింది హైకోర్టు డివిజన్ బెంచ్. మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం జరిగినట్లు అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేసి.. ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసింది. ఆపై సిట్ ద్వారా ఈ కేసు దర్యాప్తును కొనసాగించింది ప్రభుత్వం. అయితే.. కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించగా.. సీబీఐకి ఇవ్వొద్దంటూ తెలంగాణ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. అయినప్పటికీ సర్కార్ అభ్యర్థనను డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది దాంతో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది తెలంగాణ సర్కార్. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సర్కార్‌కు మళ్లీ ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉన్నత న్యాయస్థానంలో తెలంగాణ సర్కార్‌కు మళ్లీ చుక్కెదురైంది. సీబీఐ విచారణకే మొగ్గు చూపిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సమయం కోరగా.. అందుకు కూడా హైకోర్టు నిరాకరించింది. గతంలో సీబీఐ విచారణకు హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వగా.. దానిని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు సింగిల్ బెంచ్ తీర్పును సమర్థిస్తూ.. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ‘సర్కార్ అభ్యర్థన’ను కొట్టేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మళ్లీ చుక్కెదురైనట్లయ్యింది. ఆర్డర్ పై సుప్రీం కోర్టు వెళ్లేందుకు కొంత సమయం కావాలని.. అప్పటి వరకు ఆర్డర్ సస్పెండ్ లో ఉంచాలని కోరారు అడ్వకేట్ జనరల్. అయితే.. ఆర్డర్ సస్పెన్షన్ కు నిరాకరించింది హైకోర్టు. ఇక.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిబీఐతో విచారణ జరిపించాలని తెలంగాణ సర్కార్‌ను.. సింగిల్ బెంచ్ తీర్పు అమలు చేయాలనీ దర్యాప్తు సంస్థ సీబీఐని ఆదేశించింది హైకోర్టు డివిజన్ బెంచ్. ఇదిలా ఉంటే.. మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం జరిగినట్లు అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేసి.. ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసింది. ఆపై సిట్ ద్వారా ఈ కేసు దర్యాప్తును కొనసాగించింది ప్రభుత్వం. అయితే.. కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించగా.. సీబీఐకి ఇవ్వొద్దంటూ తెలంగాణ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. అయినప్పటికీ సర్కార్ అభ్యర్థనను డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. -
భయంతో పరుగులు తీసిన టీ.మంత్రులు
ఆదిలాబాద్: జిల్లాలోని ఉట్నూరులో గురువారం సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) గవర్నింగ్ బాడీ సమావేశంలో షార్ట్ సర్య్యూట్ సంభవించింది. తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో ఆకస్మికంగా షార్ట్ సర్య్యూట్ చోటు చేసుకుని ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు కాలిపోయాయి. దీంతో షాక్ కు గురైన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్నతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు బయటకు పరుగులు తీశారు.