షాకింగ్ వీడియో హల్చల్
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో సీఆర్పీఎఫ్ జవాన్‌ను వెంటాడి మరీ దాడిచేసిన దృశ్యాలు అంటూ చెబుతున్న షాకింగ్ వీడియో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతోంది. కశ్మీర్ అల్లర్లలో సాయుధుడైన సీఆర్ పీఎఫ్ జవాన్‌ను కొందరు చుట్టుముట్టారు. చివరికి తప్పించుకొని పోతున్న ఆ జవాన్‌ను వెంటాడి అమానుషంగా సామూహికంగా దాడిచేశారు. 'ది ఇల్లీగల్ ఇండియన్' పేరుతో శనివారం పోస్ట్ అయిన ఈ వీడియో వైరల్ అయింది.
ఎపుడు, ఎక్కడ అనే పూర్తి వివరాలు తెలియని ఈ వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో జోరుగా షేర్ అవుతోంది. మరోవైపు ఈ సంచలన వీడియో పై అటు పోలీస్ వర్గాలనుంచిగానీ, ఇటు అధికారుల నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు.