mobile battery
-
బాబోయ్ స్మార్ట్‌ఫోన్ లోబ్యాటరీ! ఇదెక్కడి లొల్లి! మీకు ‘నోమోఫోబియా’ ఉందా?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కాసేపు ఫోన్ కనపడకపోతే.. ప్రపంచానికి మనం దూరమైపోయినట్టు తల్లడిల్లిపోతుంటాం. అదే.. ఫోన్లో లో–బ్యాటరీ అనే సింబల్ కనిపిస్తే.. చాలామందిలో ఆందోళన పెరిగిపోతుంటుంది. దీనినే నోమోఫోబియో (నో మొబైల్ భయం) అని పిలుస్తారంట. నాలుగేళ్ల క్రితం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఈ పదాన్ని చేర్చినా.. ఇప్పుడు ప్రతి నలుగురు భారతీయుల్లో ముగ్గురు ఈ నోమోఫోబియోతో బాధపడుతున్నారని ఓ సర్వేలో తేలింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఇండియా, మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్‌తో కలిసి దేశంలోని నగరాల్లో ఈ సర్వే నిర్వహించింది. ఫోన్ బ్యాటరీ లెవల్స్ పడిపోయినప్పుడు వినియోగదారులు ఎలా స్పందిస్తున్నారనే దానిపై టైర్–1, టైర్–2 నగరాల్లోని 1,500 మంది ఫోన్ యూజర్ల నుంచి వివరాలు సేకరించారు. -LA PELIGROSA NOMOFOBIA @El_Universal_Mx @Univ_Opinion #nomofobia #artificalintelligence #InteligenciaArtificial #conexion #internet #smartphone #socialmedia pic.twitter.com/Bs0UUOtEUh — Angel Boligan (@AngelBoligan) March 5, 2023 బ్యాటరీ అయిపోతే.. ఫోన్ వాడలేం! ఈ అధ్యయనం ప్రకారం.. సెల్‌ఫోన్ బ్యాటరీ చార్జింగ్ అయిపోతే ఫోన్ వాడలేం కదా.. ఇప్పుడెలా అనే ఆందోళనతో ఎక్కువ మంది బాధపడుతున్నారట. ఈ క్రమంలో లో–బ్యాటరీ అనే సిగ్నల్ కనిపిస్తే చాలు టెన్షన్‌తో ఇబ్బందులు పడుతున్నారని వెల్లడైంది. 100 శాతం బ్యాటరీ ఉన్నప్పుడు ఆనందంగా ఉండే వినియోగదారులు.. ఫోన్ చార్జింగ్ 20 శాతానికి తక్కువగా కనిపిస్తే ఫోబియోతో బాధపడుతున్నారని తేలింది. 100 మందిలో 75 మంది ఫోన్ చార్జింగ్ తగ్గిపోతున్న కొద్దీ స్విచ్ఆఫ్ అయిపోతుందన్న ఆందోళనతో కనిపిస్తున్నారని ఈ అధ్యయనంలో తేలింది. సర్వే ఇంకేం చెప్పిందంటే.. ► ‘లో బ్యాటరీ’ నోమోఫోబియో భయం 31 నుంచి 40 ఏళ్లలోపు వయసు వారిలో 77 శాతం వరకూ ఉండగా.. 25 నుంచి 30 ఏళ్లలోపు వారిలోనూ ఈ భయం గుర్తించినట్టు సర్వేలో వెల్లడించింది. ► 87 శాతం మంది ఫోన్‌ని చార్జింగ్ పెట్టి మరీ ప్రమాదకరంగా వినియోగిస్తున్నారు. ► ఫోన్ బ్యాటరీ పనిచేయకుంటే భయంభయంగా ఉంటుందని 82% మంది పురుషులు చెప్పగా.. 74 శాతం మంది మహిళా యూజర్లు అదే ఆందోళన వెలిబుచ్చారు. ► 60 శాతం మంది వినియోగదారులైతే ఫోన్ బ్యాటరీలో చార్జింగ్ తక్కువ సమయం వస్తుంటే.. వెంటనే 100లో 60 మంది కొత్త ఫోన్ కొనుగోలు చేసేస్తున్నారు. ► 100లో 46 మంది వినియోగదారులు తమ ఫోన్లో చార్జింగ్ ఉన్నప్పటికీ రోజుకు రెండుసార్లు చార్జింగ్ పెడుతున్నారు. 0 92 శాతం మంది తమ ఫోన్లో పవర్ సేవింగ్ మోడ్ వినియోగిస్తున్నారు. ► ఇంటికి చేరేలోపు లో–బ్యాటరీ సిగ్నల్ వస్తుందేమోనన్న భయంతో 82 శాతం మంది యూజర్లు సోషల్ మీడియా వినియోగ సమయాన్ని తగ్గించేసుకుంటున్నారు. ► సోషల్ మీడియా కోసమే స్మార్ట్ ఫోన్ అని 78 శాతం మంది చెప్పారు. ► ఎంటర్టైన్మెంట్, మూవీస్, సీరియల్స్, టీవీషోస్ చూసేందుకు ఎక్కువగా వినియోగిస్తున్నామని 42% మంది వినియోగదారులు చెప్పారు. ఆందోళన తగ్గించుకోవాలి స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో వస్తున్న మార్పులపై అధ్యయనం చేసేందుకు సర్వే నిర్వహించాం. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ఫోన్లు జీవితాలపై ప్రతికూల ప్రభావాలను కూడా కలిగిస్తాయని గుర్తించాలి. గంటలకొద్దీ ఫోన్‌ని వినియోగించకుండా అవసరం మేరకే ఫోన్లని వాడాలి. స్మార్ట్ ఫోన్ల విషయంలో కలిగే ఆందోళనలను తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్ వాడకానికి అప్పుడప్పుడూ గ్యాప్ ఇస్తూ కుటుంబసభ్యులు, స్నేహితులు, కొలీగ్స్‌తో మమేకమవుతూ మానవ సంబంధాలకు విలువనివ్వాలి. ఫోన్ల వాడకంపై అవగాహనతో పాటు జాగ్రత్తగా ఉండటం ద్వారా నోమోఫోబియోని అధిగమించడం సులువు. – దమయంత్ సింగ్ ఖనోరియా, సీఎంవో, ఒప్పో ఇండియా -
ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు అతిపెద్ద శుభవార్త!
పెరుగుతున్న ఇంధన ధరల వల్ల ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నప్పటికి ఛార్జింగ్ సమస్య వల్ల కొందరు వెనుకడుగు వేస్తున్నారు. అయితే, ఈ సమస్యకు చెక్ పెడుతూ బ్యాటరీ స్టోరేజీ, ఛార్జర్ డెవలప్ మెంట్ కంపెనీ ఈజెడ్4ఈవీ రాబోయే మూడు నెలల్లో 'ఈజ్ఊర్జా'(Easy Oorja) అనే ఆన్ డిమాండ్ మొబైల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనదారులను వేదిస్తున్న సమస్య చెక్ పెట్టినట్లు అయ్యింది. ఈ మొబైల్ ఎలక్ట్రిక్ వేహికల్ ఛార్జింగ్ స్టేషన్లు కస్టమర్లు ఎంచుకున్న ప్రాంతాల వద్ద కంపెనీ ఏర్పాటు చేయనుంది. అలాగే, కస్టమర్లు మొబైల్ ఎటిఎంలను లొకేట్ చేసినట్లుగా ఈ మొబైల్ స్టేషన్లను గుర్తించగలుగుతారు. మెరుగైన ఈవీ కనెక్టివిటీని అందించడం కొరకు చిన్న పట్టణాల్లో, వివిధ నగరాలు, హైవేల్లో 'ఈజుర్జా' మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. ఛార్జింగ్ స్టేషన్లు 'ఛార్జింగ్-ఆన్-డిమాండ్' వ్యవస్థ ఆధారంగా పనిచేస్తాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఒటీ) పరికరం ఇందులో ఉంటుంది. "ఈ మొబైల్ ఎలక్ట్రిక్ వేహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఈవీ యజమానుల పడుతున్న ఆందోళనను తగ్గిస్తుంది. దేశంలో ఈవి ఛార్జింగ్ పాయింట్లు లేని దగ్గర వీటిని ఏర్పాటు చేయనున్నట్లు" కంపెనీ సీఈఓ సతీందర్ సింగ్ చెప్పారు. (చదవండి: 90 నిమిషాల్లో ఢిల్లీ టూ ముంబై!) ఈ ఛార్జింగ్ స్టేషన్ల దగ్గర ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇది 100 శాతం కార్బన్ ఉద్గార రహిత శక్తిని ఉపయోగించి రీఛార్జింగ్ చేయడానికి లాజిస్టిక్స్ మేనేజ్ మెంట్ వ్యవస్థను కలిగి ఉంది. ఈ స్టేషన్లు 24 గంటలు పనిచేస్తాయి. దేశంలో మొబైల్ ఛార్జింగ్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఛార్జింగ్ మౌలిక సదుపాయాల సమస్యను పరిష్కరించడంలో సహాయపడగలదని ఈజెడ్4ఈవీ విశ్వసిస్తుంది. భారతీయ ఈవి రంగంలో 'ఇన్ ఫ్రా-యాజ్-ఎ-సర్వీస్' ద్వారా సృజనాత్మక ఛార్జింగ్ మౌలిక సదుపాయాల మార్కెట్లో కీలక పాత్రను పోషించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. -
పేలిన మొబైల్ బ్యాటరీ
కోల్‌సిటీ(రామగుండం): సెలవుల్లో ఇంటి దగ్గర సరదాగా ఆడుకుంటున్న ఇద్దరు విద్యార్థులు పాతమొబైల్‌బ్యాటరీ పేలడంతో తీవ్రంగా గాయపడ్డారు. చెత్తకుప్పలో దొరికి మొబైల్‌పాత బ్యాటరీతో ఆడుకుంటుండగా... అకస్మాత్తుగా బ్యాటరీ పేలింది. ఇద్దరివీ రెండు చేతివేళ్లు తెగిపోగా, కంటి చూపు ప్రమాదంగా మారింది. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటన గోదావరిఖనిలో గురువారం చోటు చేసుకుంది. బాధిత పిల్లల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన గుంటి వేణు రమేష్‌నగర్‌లోని మైనార్టీ గురుకుంలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఎదిరింట్లో ఉంటున్న గూడెల్లి అఖిల్ స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో 4వతరగతి చదువుతున్నాడు. సెలవులివ్వడంతో వేణు బుధవారం ఇంటికి వచ్చాడు. గురువారం సాయంత్రం వేణు,అఖిల్ కలిసి ఇంటిసమీపంలో ఆడుకుంటుండగా, చెత్తకుప్పలో పాతస్మార్ట్‌ఫోన్ బ్యాటరీతోపాటు రెండు వైర్లతో ఉన్న ఓ ఎలక్ట్రానిక్ వస్తువు దొరికింది. ఎలక్ట్రానిక్ వస్తువుకు ఉన్న రెండు వైర్లను పాతబ్యాటరీకి అనుసంధానం చేశారు. దీంతో ఒక్కసారిగా బ్యాటరీ పేలింది. పేలిన శబ్దంకు సమీపంలోనే ఉన్న పిల్లల కుటుంబ సభ్యులు హుటాహుటిన వెళ్లి చూడగా, అప్పటికే ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలు అయ్యాయి. అఖిల్‌కు ఎడమ కంటికి తీవ్రమైన గాయం కావడంతోపాటు ఎడమ చెయ్యి రెండు వేళ్లుకు కూడా గాయాలయ్యాయి. వేణుకు ఎడమ చేయి బొటన వేలు, కుడి చేయి చూపుడు వేలు నుజ్జునుజ్జు అయి తెగిపోయాయి. కడుపులు, ముఖంపై స్వల్పగాయాలయ్యాయి. తొలత గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా ప్రధమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి 108 అంబులెన్స్‌లో ఇద్దరు పిల్లలను తలరించారు. కాగా ఈ ప్రమాదంతో కాలనీ ప్రజలు ఉలిక్కిపడ్డారు. -
తరగతి గదిలో పేలిన సెల్‌ఫోన్ బ్యాటరీ
సాక్షి, రఘునాథపల్లి : సెల్‌ఫోన్ బ్యాటరీ పేలి ఓ విద్యార్థికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం అశ్వారావుపల్లి ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మామిడాల శంకర్-లక్ష్మి దంపతుల కుమారుడు రాజు స్థానిక ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఎప్పటిలానే స్కూల్‌కు వచ్చాడు. గణితం టీచర్ సునీత పాఠం బోధిస్తున్న సమయంలో సెల్‌ఫోన్ బ్యాటరీ పెద్ద శబ్దంతో ఒక్కసారిగా పేలింది. దీంతో విద్యార్థి దవడ, ఛాతీ చేతికి గాయలయ్యాయి. గాయపడిన రాజును స్థానిక ఆర్ఎంపీ వద్ద ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సెల్‌ఫోన్ బ్యాటరీతో ఆడుతుండగా ప్రమాదం జరిగినట్లు పాఠశాల హెచ్ఎం నర్సింహారెడ్డి తెలిపారు. -
బ్యాటరీ టెస్ట్ చేస్తే.. ఐఫోన్ ఢమాల్
బీజింగ్ : ధర కాస్త ఎక్కువైనా.. యాపిల్‌కు సంబంధించిన ఉత్పత్తుల్లోనూ నాణ్యత ఉంటుందని వినియోగదారులు భావిస్తుంటారు. అయితే ఈ మధ్య వరుసగా జరుగుతున్న ఉదంతాలు మాత్రం వారికి దడ పుట్టిస్తున్నాయి. తాజాగా ఐఫోన్ పేలిన ఘటన చైనాలో చోటు చేసుకుంది. బీజింగ్‌లోని ఓ షోరూమ్‌కి వెళ్లిన వ్యక్తి తన ఐఫోన్ ఎస్-8 మోడల్ మొబైల్ కోసం బ్యాటరీని కొనుగోలు చేశాడు. సేల్స్ కౌంటర్ వద్ద బ్యాటరీని తన ఫోన్లో వేసి అది అసలుదో కాదో తెలుసుకునే యత్నం చేశాడు. బ్యాటరీని నోటితో చిన్నగా కొరికి చూశాడు. వెంటనే ఫోన్ ఢమాల్ అని పేలిపోయింది. అయితే అప్పటికే ఫోన్‌ను కాస్త దూరం జరపటంతో పెను ప్రమాదం నుంచి అతను బయటపడ్డాడు. చుట్టుపక్కల వారు కూడా ఆ ఘటనతో షాక్‌కి గురయ్యారు. అది కంపెనీ తరపు బ్యాటరీ అని షాపు నిర్వాహకుడు దృవీకరించాడు. కాగా, బ్యాటరీలు చార్జింగ్ అయినప్పుడు.. ఇతరత్రా సందర్భాల్లో ఫోన్లు పేలుడుకు గురయినప్పుడు బ్యాటరీ సేఫ్టీ చెక్‌ను యాపిల్ ప్రవేశపెట్టింది. దీంతో ఫోన్లు సేఫ్ అని భావించిన వినియోగదారులు.. ఇప్పుడు ఈ వరుస పేలుళ్ల ఘటనలతో కలవరపాటుకు గురవుతున్నారు. ఎప్పుడు జరిగిందో స్పష్టంగా తెలీకపోయినప్పటికీ.. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిని మీరూ వీక్షించండి. -
బ్యాటరీ టెస్ట్ చేస్తే.. ఐఫోన్ ఢమాల్
-
సూపర్ బ్యాటరీ తయారు చేసిన సోనీ
స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో వినియోగదారుల అవసరాల మేరకు శక్తిమంతమైన బ్యాటరీల తయారీ మొబైల్‌ఫోన్ కంపెనీలకు కష్టంగా మారింది. ఫోన్లలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిన కారణంగా ఒక రోజుకు సరిపడ బ్యాటరీ చార్జింగ్ ఉంచడం కష్ట సాధ్యమే అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ సోనీ కొత్త సూపర్ బ్యాటరీని తయారుచేసినట్లు వెల్లడించింది. సాంప్రదాయ లిథియం అయాన్ బ్యాటరీల కంటే 40 శాతం ఎక్కువ శక్తిని ఈ బ్యాటరీలో నిల్వచేసే అవకాశం ఉన్నట్లు సోనీ ప్రకటించింది. ఈ బ్యాటరీల తయారీలో లిథియం- సల్ఫర్, మెగ్నీషియం-సల్ఫర్ మూలకాలను వాడినట్లు తెలిపింది. కొత్త విధానం ద్వారా బ్యాటరీలో తక్కువ స్థలంలో ఎక్కువ శక్తిని నిల్వచేసే అవకాశం ఉందని తెలిపిన సోనీ... ఇవి పూర్తి స్థాయిలో వినియోగదారులకు అందుబాటులోకి రావాలంటే మాత్రం 2020 వరకు ఆగాల్సిందే అని చెబుతోంది. గతంలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో కూడా సోనీ సంస్థ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.