ధర కాస్త ఎక్కువైనా.. యాపిల్‌కు సంబంధించిన ఉత్పత్తుల్లోనూ నాణ‍్యత ఉంటుందని వినియోగదారులు భావిస్తుంటారు. అయితే ఈ మధ్య వరుసగా జరుగుతున్న ఉదంతాలు మాత్రం వారికి దడ పుట్టిస్తున్నాయి. తాజాగా ఐఫోన్ పేలిన ఘటన చైనాలో చోటు చేసుకుంది.
బీజింగ్‌లోని ఓ షోరూమ్‌కి వెళ్లిన వ్యక్తి తన ఐఫోన్ ఎస్-8 మోడల్ మొబైల్ కోసం బ్యాటరీని కొనుగోలు చేశాడు. సేల్స్ కౌంటర్ వద్ద బ్యాటరీని తన ఫోన్‌లో వేసి అది అసలుదో కాదో తెలుసుకునే యత్నం చేశాడు. బ్యాటరీని నోటితో చిన్నగా కొరికి చూశాడు. వెంటనే ఫోన్ ఢమాల్ అని పేలిపోయింది. అయితే అప్పటికే ఫోన్‌ను కాస్త దూరం జరపటంతో పెను ప్రమాదం నుంచి అతను బయటపడ్డాడు. చుట్టుపక్కల వారు కూడా ఆ ఘటనతో షాక్‌కి గురయ్యారు. అది కంపెనీ తరపు బ్యాటరీ అని షాపు నిర్వాహకుడు దృవీకరించాడు.