mobile sms
-
మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను మొబైల్ నుంచి ఇలా తెలుసుకోండి
న్యూ ఢిల్లీ: ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులువు. ఈపీఎఫ్ ఖాతాలో రిజస్టర్ ఐనా నంబర్ నుంచి మెసేజ్, మిస్డ్ కాల్ ఇస్తే చాలు క్షణాల్లో మీ ముందు పీఎఫ్ బ్యాలెన్స్ ప్రత్యక్షమవుతుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రకారం ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతాతో రిజిస్టర్ ఐనా మొబైల్ నంబర్ నుంచి 7738299899 లేదా 011-22901406 నంబర్లకు మెసేజ్ లేదా మిస్డ్‌కాల్ చేస్తే చాలు మీ ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ మీకు కనిపిస్తోంది. ఎస్ఎంఎస్తో పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఇలా చెక్ చేసుకోండి. ఈపీఎఫ్ సభ్యులు రిజస్టర్ ఐనా మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ ద్వారా వారి బ్యాలెన్స్ తనిఖీ చేయవచ్చు. ఈపీఎఫ్ సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లు యాక్టివ్ మోడ్‌లో ఉండేలా చూసుకోవాలి. తరువాత రిజిస్టర్ ఐనా మొబైల్ నుంచి ‘EPFOHO UAN LAN’ అని టైప్ చేసి 7738299899 పంపాలి. మీ ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ మీకు మెసెజ్ రూపంలో వస్తుంది. మిస్డ్ కాల్‌తో పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఇలా చెక్ చేసుకోండి. ఈపీఎఫ్ సభ్యులు ఈపీఎఫ్ సభ్యులు రిజస్టర్ ఐనా మొబైల్ నుంచి 011-22901406 కు మిస్డ్ కాల్ ఇవ్వడంతో మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చును. అంతేకాకుండా ఈపీఎఫ్ సభ్యులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌ను https://passbook.epfindia.gov.in/MemberPassBook/Loginలో లాగిన్ ద్వారా తెలుసుకోవచ్చును. దాంతో పాటుగా ఉమాంగ్ యాప్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఉద్యోగులు తెలుసుకోవచ్చును. अब घर बैठे ही अपना #ईपीएफ बैलेंस चेक करें। इन आसान स्टेप्स का पालन करें और परेशानी मुक्त सेवा का आनंद लें।#EPFO #PF #पीएफ #ईपीएफओ #Employees #Services@PMOIndia @PIB_India @PIBHindi @MIB_India @MIB_Hindi @DDNewslive @airnewsalerts @mygovindia @_DigitalIndia @PTI_News pic.twitter.com/WU8L2Z2Sxl — EPFO (@socialepfo) July 8, 2021 -
30 రూపాయలతో పాస్‌పోర్ట్ మెస్సేజ్
18న ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో పాస్‌పోర్ట్ మేళా మైనర్ల పాస్‌పోర్ట్ కావాలంటే తల్లిదండ్రులకు పాస్‌పోర్ట్ అవసరం లేదు పాస్‌పోర్ట్ అధికారి అశ్విని సత్తారు వెల్లడి హైదరాబాద్: పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసేటప్పుడు రూ. 30 చెల్లిస్తే దరఖాస్తు దారు మొబైల్‌కు వివరాలు ఎస్ఎంఎస్ల రూపంలో అంది స్తామని పాస్‌పోర్ట్ అధికారి అశ్విని సత్తారు తెలి పారు. గురువారం ఆమె హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి మదన్‌కుమార్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. దీనివల్ల దరఖాస్తుదారులకు పాస్‌పోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశముందో కూడా తెలుస్తుందన్నారు. ఒకరోజు బిడ్డ నుంచి కనీసం ఐదేళ్లలోపు బిడ్డలకు పాస్‌పోర్ట్‌లు కావాలంటే తల్లిదండ్రులకు పాస్‌పోర్ట్‌లు ఉండాల్సిన పనిలేదని, పోలీస్ వెరిఫికేషన్ విధిగా జరుగుతుందని ఆమె చెప్పారు. ఒక వేళ తల్లిదండ్రులకు పాస్‌పోర్ట్‌లు ఉంటే పోలీస్‌వెరిఫికేషన్ ఉండదన్నారు. పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసేటప్పుడు సరైన ధ్రువపత్రాలు లేక ఆగిపోతే... అన్‌హోల్డ్ అపాయింట్మెంట్ తీసుకుని, ఆయా రోజున వాటి ని సమర్పించే అవకాశం ఇస్తున్నట్టు చెప్పారు. పాస్‌పోర్ట్ రెన్యువల్ చేసుకునే వారు గడువులోగా చేసుకుంటే తత్కాల్‌కు వెరిఫికేషన్ అవసరం లేదన్నారు. పోలీస్‌వెరిఫికేషన్ విషయంలో ఆంధ్రలో తిరుపతి, వెస్ట్‌గోదావరి, గుంటూరు అర్బన్‌లు తొలి మూడుస్థానాల్లో ఉండగా, తెలంగాణలో సైబరాబాద్ కమిషనరేట్, మహబూబ్‌నగర్, ఖమ్మం ప్రాంతాలు తొలి మూడుస్థానాల్లో ఉన్నాయన్నారు. 18 రోజుల్లో ఆయా ప్రాంతాల్లో వెరిఫికేషన్ పూర్తవుతోందని అశ్విని తెలిపారు. ఫిర్యాదులను హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి పంపించాలనుకుంటే po.hyderabad@ passportindia.gov.in మెయిల్‌కు పంపిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని, 040-27704646, 040-277-5656 ఫాక్స్ నంబర్లకు గానీ ఫిర్యాదు చేయచ్చని, నేరుగా కూడా కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లకు రావచ్చన్నారు. ఈనెల 18 పాస్‌పోర్ట్ మేళా ఈనెల 18వ తేదీన విజయవాడ, తిరుపతి, కరీంగనర్, వరంగల్‌లలో పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. మొదటి మూడు సెంటర్లలో పీఎస్కేలలోనే మేళా ఉంటుందని, వరంగల్‌లో మాత్రం నిట్‌లో ఉంటుందన్నారు. దీనికోసం ఈనెల 15న అంటే బుధవారం 9:30 గంటలకు ఠీఠీఠీ.ఞ్చటటఞౌట్టజీఛీజ్చీ.జౌఠి.జీ వెబ్‌సైట్‌కు వెళ్లి స్లాట్లు పొందచ్చునన్నారు. ఆయా జిల్లాల వాళ్లు మాత్రమే ఈ మేళాలో పాల్గొనాలని, విద్యార్థులకు, వృద్ధులకు అధిక ప్రాధాన్యముంటుందన్నారు. విద్యార్థులు సరైన కారణాలు చూపి వీలైనంత తొందరగా పాస్‌పోర్ట్ పొందచ్చునని, వారిని ప్రత్యేక కేటగిరీ కింద పరిగణిస్తామన్నారు. ఈ ఏడాది ఆగస్ట్ మాసంలో 84 వేలకుపైగా పాస్‌పోర్ట్‌లు జారీచేసి రికార్డు నెలకొల్పామన్నారు. అనైకాదియాకు 2వ కోటి పాస్‌పోర్ట్ 2012లో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ప్రారంభించాక ఇప్పటివరకూ 2 కోట్ల మందికి పాస్‌పోర్ట్‌లు జారీచేశారు. ఈ రెండో కోటి పాస్‌పోర్ట్ హైదరాబాద్‌కు చెందిన 2నెలల వయసున్న బేబి అనైకా దియాకు ఇచ్చారు. మంగళవారం పాస్‌పోర్ట్ అధికారి అశ్విని సత్తారు చేతుల మీదుగా అనైకాదియా తల్లి ఈ పాస్‌పోర్ట్‌ను అందుకున్నారు. సెప్టెంబర్ 29న టోలిచౌకిలోని పీఎస్కేలో దరఖాస్తుచేశారని, అదే రోజు ఆ బిడ్డకు పాస్‌పోర్ట్ జారీ చేసినట్టు పాస్‌పోర్ట్ అధికారి తెలిపారు. -
ఎస్ఎంఎస్ కొట్టు.. టికెట్ పట్టు
భువనగిరి, న్యూస్‌లైన్: రైలు ప్రయాణం మరింత సులభతరమవుతోంది. టికెట్ రిజర్వేషన్ చేయించుకునేందుకు ఇప్పుడు స్టేషన్ దాకా వెళ్లాల్సిన పనిలేదు. ఎంచక్కా ఇంట్లో కూర్చొని మొబైల్ ఎంస్‌ఎంస్‌తో రిజర్వేషన్ చేయించుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఇంటర్నెట్ సేవలు విస్తృతమౌతున్న తరుణంలో ఒక్కో సేవ ఇంట్లోంచే పొందే అవకాశా న్ని సమాచార విప్లవం కల్పిస్తోంది. తాజాగా రైల్వే రిజర్వేషన్లను మొబైల్ ద్వారా పొందే సౌకర్యాన్ని రైల్వే శాఖ పెలైట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టింది. నిత్యం బీజిగా ఉండి సమయానికి ప్రాధాన్యతనిచ్చే వర్గాల వారు రైల్వేస్టేష న్కు వెళ్లి రిజర్వేషన్ టికెట్ కోసం గంటల తరబడి నిలబడకుండా మొబైల్ ద్వారా క్షణాల్లో రైల్వే బుకింగ్ సదుపాయాన్ని పొందే వీలు చిక్కింది. రైల్వే రిజర్వేషన్ కోసం చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు క్షణాల్లో ఎక్కడి నుంచైనా ఉచిత రైల్వే రిజర్వేషన్ బుకింగ్ సదుపాయం పొందవచ్చు. కేవలం నెట్ బ్యాంకింగ్ ఉంటే చాలు. టికెట్ ప్రింట్ కూడా అవసరం లేదు. మొబైల్లో నిక్షిప్తమయ్యే సమాచారంతోనే రైల్వేశాఖ ప్రవేశపెట్టిన ఎస్ఎంఎస్ టికెట్ బుకింగ్ సదుపాయం ప్రయాణికులకు ఇప్పుడిప్పుడే చేరువవుతోంది. జూలై ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్ ఇప్పుడిప్పుడే ప్రయాణికులకు చేరుతోంది. దీనిపై గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇంకా ప్రచారం జరగాల్సి ఉంది. అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్న ఈ నూతన విధానంతో సమయం ఆదా అవుతుం దని ప్రజల నుంచి అభిప్రా యం వ్యక్తమవుతోంది. ఎవరు కల్పిస్తున్నారంటే.. ఎస్ఎంఎస్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని రైల్వే శాఖ అనుబంధ సంస్థ ఐఆర్టీఎస్ అందిస్తోంది. ఐఆర్టీఎస్ నిర్వహిస్తోన్న 139 సర్వీస్ ప్రొవైడర్‌తో పాటు ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్, ఫ్రీక్వెన్సీ వీక్లి అనే మరో మూడు సర్వీసు ప్రొవైడర్ల ద్వారా ప్రయాణికులు ఎస్ఎంఎస్ టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఐఆర్‌టీఎస్‌లో తమ పేరు, వయస్సు, జెండర్ తదితర వివరాలను ఎస్ఎంఎస్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం బీఎస్ఎన్ఎల్ మొబైల్ కనెక్షన్ కలిగిన వినియోగదారులు కొంత మొత్తాన్ని మొబైల్లో నిల్వచేసుకొని దాని ద్వారా ఐఆర్‌టీఎస్‌కు డబ్బులు బదిలీ చేసి రిజర్వేషన్ చేసకునే సదుపాయం ఉంటుంది. 26 జాతీయ బ్యాంకుల్లో దేంట్లోనైనా అకౌం ట్ ఉండి నెట్ బ్యాంకింగ్ ఉన్న ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్ నుంచి ఐఆర్‌టీఎస్‌కు చెందిన 139 ద్వారా టిక్కెట్ పొందవచ్చు. రాయితీ టిక్కెట్లకు వ ర్తించదు రాయితీలపై ప్రయాణించే వారికి మా త్రం మొబైల్ ఫోన్ ద్వారా రిజర్వేషన్ సదుపాయం లభించదు. ఈ టిక్కెట్లు తీసుకునే వారు నే రుగా రిజర్వేషన్ కేంద్రానికే వెళ్లాల్సిందే. మొబైల్ ఫోన్ ద్వారా అన్ని కేటగిరీల టిక్కెట్లను రిజర్వేషన్ చేసుకునే సదుపాయం ఉంది. ప్రస్తుతం తత్కాల్ టిక్కెట్ సదుపాయం అందుబాటులోకి రాలేదు. దక్షిణమధ్య రైల్వేలో రోజూ టిక్కెట్లను ఇంటర్నెట్, జనతా టికెట్ బుకింగ్ కేంద్రాలు, పోస్టాఫీసులు, రైల్వేస్టేషన్లలోని బుకింగ్ కేం ద్రాల ద్వారా విక్రయిస్తున్నారు. ఎస్ఎంఎస్ చేయాల్సిన నంబర్లు ఇవే.. 54959, 57886, 5676747, 130 నంబర్లకు ఎస్ఎంఎస్ చేసి రైల్వే టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. -
ఎస్ఎంఎస్ కొట్టు.. టికెట్ పట్టు
భువనగిరి, న్యూస్‌లైన్: రైలు ప్రయాణం మరింత సులభతరమవుతోంది. టికెట్ రిజర్వేషన్ చేయించుకునేందుకు ఇప్పుడు స్టేషన్ దాకా వెళ్లాల్సిన పనిలేదు. ఎంచక్కా ఇంట్లో కూర్చొని మొబైల్ ఎంస్‌ఎంస్‌తో రిజర్వేషన్ చేయించుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఇంటర్నెట్ సేవలు విస్తృతమౌతున్న తరుణంలో ఒక్కో సేవ ఇంట్లోంచే పొందే అవకాశా న్ని సమాచార విప్లవం కల్పిస్తోంది. తాజాగా రైల్వే రిజర్వేషన్లను మొబైల్ ద్వారా పొందే సౌకర్యాన్ని రైల్వే శాఖ పెలైట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టింది. నిత్యం బీజిగా ఉండి సమయానికి ప్రాధాన్యతనిచ్చే వర్గాల వారు రైల్వేస్టేష న్కు వెళ్లి రిజర్వేషన్ టికెట్ కోసం గంటల తరబడి నిలబడకుండా మొబైల్ ద్వారా క్షణాల్లో రైల్వే బుకింగ్ సదుపాయాన్ని పొందే వీలు చిక్కింది. రైల్వే రిజర్వేషన్ కోసం చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు క్షణాల్లో ఎక్కడి నుంచైనా ఉచిత రైల్వే రిజర్వేషన్ బుకింగ్ సదుపాయం పొందవచ్చు. కేవలం నెట్ బ్యాంకింగ్ ఉంటే చాలు. టికెట్ ప్రింట్ కూడా అవసరం లేదు. మొబైల్లో నిక్షిప్తమయ్యే సమాచారంతోనే రైల్వేశాఖ ప్రవేశపెట్టిన ఎస్ఎంఎస్ టికెట్ బుకింగ్ సదుపాయం ప్రయాణికులకు ఇప్పుడిప్పుడే చేరువవుతోంది. జూలై ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్ ఇప్పుడిప్పుడే ప్రయాణికులకు చేరుతోంది. దీనిపై గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇంకా ప్రచారం జరగాల్సి ఉంది. అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్న ఈ నూతన విధానంతో సమయం ఆదా అవుతుం దని ప్రజల నుంచి అభిప్రా యం వ్యక్తమవుతోంది. ఎవరు కల్పిస్తున్నారంటే.. ఎస్ఎంఎస్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని రైల్వే శాఖ అనుబంధ సంస్థ ఐఆర్టీఎస్ అందిస్తోంది. ఐఆర్టీఎస్ నిర్వహిస్తోన్న 139 సర్వీస్ ప్రొవైడర్‌తో పాటు ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్, ఫ్రీక్వెన్సీ వీక్లి అనే మరో మూడు సర్వీసు ప్రొవైడర్ల ద్వారా ప్రయాణికులు ఎస్ఎంఎస్ టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఐఆర్‌టీఎస్‌లో తమ పేరు, వయస్సు, జెండర్ తదితర వివరాలను ఎస్ఎంఎస్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం బీఎస్ఎన్ఎల్ మొబైల్ కనెక్షన్ కలిగిన వినియోగదారులు కొంత మొత్తాన్ని మొబైల్లో నిల్వచేసుకొని దాని ద్వారా ఐఆర్‌టీఎస్‌కు డబ్బులు బదిలీ చేసి రిజర్వేషన్ చేసకునే సదుపాయం ఉంటుంది. 26 జాతీయ బ్యాంకుల్లో దేంట్లోనైనా అకౌం ట్ ఉండి నెట్ బ్యాంకింగ్ ఉన్న ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్ నుంచి ఐఆర్‌టీఎస్‌కు చెందిన 139 ద్వారా టిక్కెట్ పొందవచ్చు. రాయితీ టిక్కెట్లకు వ ర్తించదు రాయితీలపై ప్రయాణించే వారికి మా త్రం మొబైల్ ఫోన్ ద్వారా రిజర్వేషన్ సదుపాయం లభించదు. ఈ టిక్కెట్లు తీసుకునే వారు నే రుగా రిజర్వేషన్ కేంద్రానికే వెళ్లాల్సిందే. మొబైల్ ఫోన్ ద్వారా అన్ని కేటగిరీల టిక్కెట్లను రిజర్వేషన్ చేసుకునే సదుపాయం ఉంది. ప్రస్తుతం తత్కాల్ టిక్కెట్ సదుపాయం అందుబాటులోకి రాలేదు. దక్షిణమధ్య రైల్వేలో రోజూ టిక్కెట్లను ఇంటర్నెట్, జనతా టికెట్ బుకింగ్ కేంద్రాలు, పోస్టాఫీసులు, రైల్వేస్టేషన్లలోని బుకింగ్ కేం ద్రాల ద్వారా విక్రయిస్తున్నారు. ఎస్ఎంఎస్ చేయాల్సిన నంబర్లు ఇవే.. 54959, 57886, 5676747, 130 నంబర్లకు ఎస్ఎంఎస్ చేసి రైల్వే టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు.