
30 రూపాయలతో పాస్‌పోర్ట్ మెస్సేజ్
18న ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో పాస్‌పోర్ట్ మేళా
మైనర్‌ల పాస్‌పోర్ట్ కావాలంటే తల్లిదండ్రులకు పాస్‌పోర్ట్ అవసరం లేదు
పాస్‌పోర్ట్ అధికారి అశ్విని సత్తారు వెల్లడి
హైదరాబాద్: పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసేటప్పుడు రూ. 30 చెల్లిస్తే దరఖాస్తు దారు మొబైల్‌కు వివరాలు ఎస్‌ఎంఎస్‌ల రూపంలో అంది స్తామని పాస్‌పోర్ట్ అధికారి అశ్విని సత్తారు తెలి పారు. గురువారం ఆమె హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి మదన్‌కుమార్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. దీనివల్ల దరఖాస్తుదారులకు పాస్‌పోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశముందో కూడా తెలుస్తుందన్నారు. ఒకరోజు బిడ్డ నుంచి కనీసం ఐదేళ్లలోపు బిడ్డలకు పాస్‌పోర్ట్‌లు కావాలంటే తల్లిదండ్రులకు పాస్‌పోర్ట్‌లు ఉండాల్సిన పనిలేదని, పోలీస్ వెరిఫికేషన్ విధిగా జరుగుతుందని ఆమె చెప్పారు. ఒక వేళ తల్లిదండ్రులకు పాస్‌పోర్ట్‌లు ఉంటే పోలీస్‌వెరిఫికేషన్ ఉండదన్నారు. పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసేటప్పుడు సరైన ధ్రువపత్రాలు లేక ఆగిపోతే... అన్‌హోల్డ్ అపాయింట్‌మెంట్ తీసుకుని, ఆయా రోజున వాటి ని సమర్పించే అవకాశం ఇస్తున్నట్టు చెప్పారు.
పాస్‌పోర్ట్ రెన్యువల్ చేసుకునే వారు గడువులోగా చేసుకుంటే తత్కాల్‌కు వెరిఫికేషన్ అవసరం లేదన్నారు. పోలీస్‌వెరిఫికేషన్ విషయంలో ఆంధ్రలో తిరుపతి, వెస్ట్‌గోదావరి, గుంటూరు అర్బన్‌లు తొలి మూడుస్థానాల్లో ఉండగా, తెలంగాణలో సైబరాబాద్ కమిషనరేట్, మహబూబ్‌నగర్, ఖమ్మం ప్రాంతాలు తొలి మూడుస్థానాల్లో ఉన్నాయన్నారు. 18 రోజుల్లో ఆయా ప్రాంతాల్లో వెరిఫికేషన్ పూర్తవుతోందని అశ్విని తెలిపారు. ఫిర్యాదులను హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి పంపించాలనుకుంటే po.hyderabad@ passportindia.gov.in మెయిల్‌కు పంపిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని, 040-27704646, 040-277-5656 ఫాక్స్ నంబర్లకు గానీ ఫిర్యాదు చేయచ్చని, నేరుగా కూడా కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లకు రావచ్చన్నారు.
ఈనెల 18 పాస్‌పోర్ట్ మేళా
ఈనెల 18వ తేదీన విజయవాడ, తిరుపతి, కరీంగనర్, వరంగల్‌లలో పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. మొదటి మూడు సెంటర్లలో పీఎస్‌కేలలోనే మేళా ఉంటుందని, వరంగల్‌లో మాత్రం నిట్‌లో ఉంటుందన్నారు. దీనికోసం ఈనెల 15న అంటే బుధవారం 9:30 గంటలకు ఠీఠీఠీ.ఞ్చటటఞౌట్టజీఛీజ్చీ.జౌఠి.జీ వెబ్‌సైట్‌కు వెళ్లి స్లాట్లు పొందచ్చునన్నారు. ఆయా జిల్లాల వాళ్లు మాత్రమే ఈ మేళాలో పాల్గొనాలని, విద్యార్థులకు, వృద్ధులకు అధిక ప్రాధాన్యముంటుందన్నారు. విద్యార్థులు సరైన కారణాలు చూపి వీలైనంత తొందరగా పాస్‌పోర్ట్ పొందచ్చునని, వారిని ప్రత్యేక కేటగిరీ కింద పరిగణిస్తామన్నారు. ఈ ఏడాది ఆగస్ట్ మాసంలో 84 వేలకుపైగా పాస్‌పోర్ట్‌లు జారీచేసి రికార్డు నెలకొల్పామన్నారు.
అనైకాదియాకు 2వ కోటి పాస్‌పోర్ట్
2012లో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ప్రారంభించాక ఇప్పటివరకూ 2 కోట్ల మందికి పాస్‌పోర్ట్‌లు జారీచేశారు. ఈ రెండో కోటి పాస్‌పోర్ట్ హైదరాబాద్‌కు చెందిన 2నెలల వయసున్న బేబి అనైకా దియాకు ఇచ్చారు. మంగళవారం పాస్‌పోర్ట్ అధికారి అశ్విని సత్తారు చేతుల మీదుగా అనైకాదియా తల్లి ఈ పాస్‌పోర్ట్‌ను అందుకున్నారు. సెప్టెంబర్ 29న టోలిచౌకిలోని పీఎస్‌కేలో దరఖాస్తుచేశారని, అదే రోజు ఆ బిడ్డకు పాస్‌పోర్ట్ జారీ చేసినట్టు పాస్‌పోర్ట్ అధికారి తెలిపారు.