mobiles robbery
-
వీడు మామూలోడు కాదు..
సాక్షి, కరీంనగర్ : ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందిన బాలుడు(17) తన పదమూడో యేటా పనిచేస్తున్న స్థలంలో తన సెల్‌ఫోన్ చోరీకి గురైంది. దీంతో కోపోద్రిక్తుడైన ఆ బాలుడు అదే ప్రాంతంలో 30నుంచి 40 వరకు సెల్ఫోన్లు చోరీచేసి తన మకాం హైదరాబాద్‌కు మర్చాడు. సెల్ఫోన్లు అమ్మగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేశాడు. దొంగతనాన్నే వృత్తిగా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన తన స్నేహితుడు కుందారపు సాయివర్మ(19)ను కలిశాడు. విషయం చెప్పి మకాంను హుస్నాబాద్‌కు మర్చాడు. సాయివర్మతో పాటు అదే ప్రాంతానికి చెందిన మురిమురి రంజిత్(38), ఎల్వకా సాయిరాం(19), బైరి రాజు(26),విలాసాగరం రజనీకాంత్(19),ఎనగందులనాగరాజు(31)తో కలిసి ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. యూట్యూబ్‌లో చూస్తూ.. తన చోరీలకు అధునాతన టెక్నాలజీని వాడుకోవాలనుకున్నాడు. యూట్యూబ్‌లో దొంగతనాలకు సంబంధించిన వీడియోలు చూస్తూ తన ముఠా సభ్యులకు సైతం శిక్షణ ఇచ్చాడు. ఎలాంటి ఇంటి తాళమైనా రెండు నిమిషాల్లో తీసే నేర్పు సంపాదించారు. పట్టణాలే టార్గెట్.. వీరు చోరీ చేసేందుకు పట్టణాలనే ప్రధానంగా ఎంచుకుంటారు. మధ్యాహ్నం ఆ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తారు.తాళం వేసిఉన్న ఖరీదైన భవంతులు గుర్తిస్తారు. అదే ప్రాంతంలో సెకండ్‌షో సినిమాకు వెళ్తారు.తిరిగి వెళ్లేప్పుడు చోరీ చేసే ఇంటికి వెళ్లి రెండు నిమిషాల్లో తాళం తీస్తారు. అందినకాడికి దండుకుని, పోలీసులకు క్లూస్ దొరకకుండా వాళ్లు తిరిగిన ప్రాంతమంతా కారంపొడి చల్లుతారు.చోరీ చేసిన సొత్తు అమ్మగా వచ్చిన దాంతో జల్సాలు చేస్తారు. ఇలా ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో12, సిద్దిపేట జిల్లాలో10, సిరిసిల్ల జిల్లాలో 4, వరంగల్ జిల్లాలో5 మొత్తంగా 31చోరీలు చేశారు. ఇందులో హుస్నాబాద్ ఎమ్మెల్యే అధికార కార్యాలయంలో కూడా కెమెరాలు చోరీ చేయడం కొసమెరుపు. ఇలా చిక్కారు.. కరీంనగర్ జిల్లాలో ఒకే పద్ధతిలో కారంపొడి చల్లుతూ జరిగిన దొంగతనాల విషయమై సీపీ కమలాసన్‌రెడ్డి దృష్టిసారించారు. సీసీఎస్ ఏసీపీ పర్యవేక్షణలో సీఐ ఎర్రల కిరణ్ ఆధ్వర్యంలో సైబర్‌ల్యాబ్ ఇన్చార్జి మురళిని కలుపుకుని బృందాన్ని ఏర్పాటు చేశారు. పలు సాంకేతిక అంశాల ఆధారంగా నిందితులను గుర్తించారు. హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వస్తున్నారని అందిన పక్కా సమాచారంతో అల్గునూరు వద్ద పట్టుకున్నారు. తమదైన పద్ధతిలో విచారించగా నాలుగు జిల్లాల్లో 31చోరీలు చేసినట్లు ఒప్పుకున్నారు. వారినుంచి రూ.23లక్షల విలువైన 53 తులాల బంగారం, మూడున్నర కిలోల వెండి, ఐదుబైక్లు, ఐడుమొబైల్స్, రెండు ఇనుపరాడ్లు స్వాధీనం చేసుకున్నారు. రివార్డులు అందజేత.. రెండేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న దొంగలముఠాను పట్టుకున్న సీసీఎస్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ కిరణ్, తిమ్మాపూర్ సీఐ కరుణాకర్, ఎస్సై నరేష్‌రెడ్డి, సైబర్‌సెల్,ఐటీకోర్ టీం ఇన్చార్జి మురళి, సీసీఎస్ ఎస్సై కనకయ్య, ఏఎస్సై వీరయ్య, శ్రీనివాస్, హసన్, నరేందర్, అంజయ్య,పాల్, యాసిన్,లక్ష్మిపతి,సాగర్, షరీఫ్, సిబ్బందిని సీపీ కమలాసన్‌రెడ్డి అభినందించి రివార్డులు అందించారు. -
ఈ బాబు... మహా ముదురు బాబూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానికి చెందిన ఓ మైనర్.. బైకులతో స్టంట్స్ చేయడంలో ఎక్స్పర్ట్.. అందులో మరికొందరికి శిక్షణ కూడా ఇస్తుంటాడు.. మరో ముగ్గురు బాలురతో జట్టు కట్టాడు.. ఈ స్టంట్స్ చేయడానికి, రేసింగ్స్‌లో పాల్గొనడానికి అవసరమైన బైక్‌ల కోసం చోరీల బాట పట్టారు. వాటిలో పెట్రోల్ నింపుకోవడానికి మొబైల్ ఫోన్స్ దొంగతనం చేయడం మొదలుపెట్టారు. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ ముఠాలోని నలుగురిని పట్టుకుని వారి గుట్టు రట్టుచేశారు. ‘సాహసాలు’అంటే మక్కువ.. హైదరాబాద్‌లోని సిద్ధార్థనగర్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు ఈసీఐఎల్‌లోని ఓ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి గతంలోనే మరణించగా.. తల్లి ఇళ్లల్లో పని చేసుకుంటూ కొడుకును పోషిస్తోంది. బైక్‌లు నడపటంలో పట్టున్న అతడికి.. స్టంట్స్ చేయడమంటే సరదా. స్నేహితుల వద్ద నుంచి తీసుకున్న బైక్‌లతో రోడ్లపై స్టంట్స్ చేస్తుంటాడు. కేబీఆర్ పార్క్ వద్ద రేసింగ్స్ చేసేవాడు. ఉప్పల్‌లోని భగాయత్ ల్యాండ్స్‌లో ప్రతి శని, ఆదివారాల్లో స్టంట్స్ చేయడంలో యువతకు ‘శిక్షణ’కూడా ఇచ్చేవాడు. ఈ నేపథ్యంలో ఇతడికి తమ ఏరియాలోనే ఉండే ముగ్గురు మైనర్లతో పరిచయం ఏర్పడింది. ఈ ముఠాకు అతగాడు గ్యాంగ్‌లీడర్‌గా మారాడు. స్టంట్స్ చేయడానికి స్పోర్ట్స్‌బైక్స్.. ఎప్పుడు కోరుకుంటే అప్పుడు స్టంట్స్ చేయాలంటే సొంతంగా స్పోర్ట్స్ బైక్ ఉండాలని సూత్రధారి భావించాడు. వాటిని ఖరీదు చేసే స్తోమత వారికి లేకపోవడంతో బైక్‌లను చోరీ చేయాలని పథకం వేశారు. ఇందుకు మరో ముగ్గురు మైనర్లనూ తమతో చేర్చుకున్నారు. వీరంతా కలసి గోల్కొండ, జూబ్లీహిల్స్ ప్రాంతాల నుంచి మూడు బైక్స్ చోరీ చేశారు. వీటిలో రెండు కేటీఎంలు కాగా, మరొకటి పల్సర్. వీటిపై తిరిగేందుకు కావాల్సిన పెట్రోల్ కోసం గోపాలపురం, మహంకాళి, ఎల్బీనగర్లలో సెల్ఫోన్లు దొంగతనం చేశారు. వీరు దొంగిలించిన బైకులకు తప్పుడు నంబర్ప్లేట్లు తగిలించి రోడ్డుపై వెళ్తున్న వారి నుంచి సెల్ఫోన్లు లాక్కుపోయేవారు. మల్కాజ్గిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో రెండు ఫోన్లు దొంగతనం చేశారు. చిక్కినా చెప్పడు... ఈ గ్యాంగ్ సూత్రధారి అయిన మైనర్ చాలా ముదురు. పోలీసులకు చిక్కినా కూడా పూర్తి వివరాలు చెప్పేవాడు కాదు. రెండు సెల్ఫోన్లు దొంగిలించిన కేసులో మల్కాజ్గిరి పోలీసులు గత నెలలో మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో చేసిన నేరాలకు సంబంధించి నోరు విప్పలేదు. గత నెల 18న సూత్రధారి సహా ముగ్గురు మైనర్లు ఓ వాహనంపై వచ్చి క్లాక్‌టవర్ వద్ద సెల్‌ఫోన్ దొంగిలించారు. దీనిపై గోపాలపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సూత్రధారిని గుర్తించారు. అతడి కదలికలపై ఆరా తీయగా.. వీకెండ్స్‌లో ఉప్పల్‌లోని భగాయత్‌లో, మామూలు రోజుల్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు. నిఘా పెట్టిన పోలీసులు సూత్రధారితో పాటు నలుగురు మైనర్లను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. -
ఎయిర్‌పోర్టు సిబ్బంది చేతివాటం!
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సిబ్బంది నిర్వాకం మరోసారి బట్టబయలయింది. నిజామాబాద్‌కు చెందిన దశరథ్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సాదిఖ్ శనివారం మధ్యాహ్నం జెడ్డా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం వారు లగేజీ సరి చూసుకోగా వారి బ్యాగులు చింపివేసి ఉండటం గమనించారు. ఆ లగేజీలో ఉన్న 2,100 సౌదీ రియాల్స్, మూడు సెల్ఫోన్లు కనిపించడం లేదని గుర్తించారు. తమ బ్యాగులను చింపి వేసిన బ్యాగేజి సిబ్బందే వాటిని మాయం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేశారు.