ఎయిర్‌పోర్టు సిబ్బంది చేతివాటం! | mobiles and soudi currency theft at shamshabad airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టు సిబ్బంది చేతివాటం!

Published Sat, Nov 5 2016 4:54 PM | Last Updated on Sat, Aug 11 2018 6:04 PM

ఎయిర్‌పోర్టు సిబ్బంది చేతివాటం! - Sakshi

ఎయిర్‌పోర్టు సిబ్బంది చేతివాటం!

శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సిబ్బంది నిర్వాకం మరోసారి బట్టబయలయింది. నిజామాబాద్‌కు చెందిన దశరథ్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సాదిఖ్ శనివారం మధ్యాహ్నం జెడ్డా నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం వారు లగేజీ సరి చూసుకోగా వారి బ్యాగులు చింపివేసి ఉండటం గమనించారు.

ఆ లగేజీలో ఉన్న 2,100 సౌదీ రియాల్స్, మూడు సెల్‌ఫోన్లు కనిపించడం లేదని గుర్తించారు. తమ బ్యాగులను చింపి వేసిన బ్యాగేజి సిబ్బందే వాటిని మాయం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement