చోరీ నెపంతో ఉద్యోగిపై సహచరుల దాడి | Employee theft under the pretense of to attack colleagues | Sakshi
Sakshi News home page

చోరీ నెపంతో ఉద్యోగిపై సహచరుల దాడి

Published Sun, Jun 28 2015 1:01 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

Employee theft under the pretense of to attack colleagues

శంషాబాద్: చోరీ నెపం తో ఓ కొరియర్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగిపై సహచరులు దాడి చేశారు. ఈ సంఘటన శం షాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరా లు.. నగరంలోని సైదాబాద్‌కు  చెందిన ఫైజల్(25) శంషాబాద్‌లోని ఓ కొరియర్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. ఈక్రమంలో ఆయన శుక్రవారం రాత్రి విధులు నిర్వహించేందుకు కార్యాలయానికి వచ్చాడు.
 
 ఆఫీస్‌లోని వస్తువులు చోరీ చేశావంటూ అతడిపై కార్యాలయంలో సహచర ఉద్యోగులు చంద్ర శేఖర్, ఇబ్రహీం దాడి చేశారు. శనివారం ఉదయం తన సోదరుడు షాబాద్‌తో కలిసి ఫైజల్ ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విలేకరులకు తెలిపాడు. అకారణంగా తనపై సహచర సిబ్బంది దాడి చేశారంటూ ఆయన ఆరోపించాడు సాయంత్రం వరకు సదరు సంస్థ ఉన్నత ఉద్యోగులు ఫైజల్‌పై ఒత్తిడి చేయడంతో చివరకు రాజీ కుదుర్చుకున్నాడు. ఉద్యోగిపై దాడి విషయ మై తమకు ఎలాంటి ఫిర్యాదు అంద లేదని సీఐ సుధాకర్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement