శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని గణేష్ క్లాత్‌స్టోర్‌లో శనివారం వేకువజామున భారీ చోరీ జరిగింది. దుకాణంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల వైర్లు కత్తిరించి రూ.15 లక్షల విలువైన బట్టలు చోరీచేశారు. దుకాణం యజమాని ఫిర్యాదుమేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దుకాణంలో పనిచేస్తున్న నర్సింహులు, శివ, శ్రీనివాస్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.