సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో ఎంసెట్ మాక్ కౌన్సెలింగ్
హైదరాబాద్: ఎంసెట్ 2014లో వచ్చిన ర్యాంకు ఆధారంగా తమకు వచ్చే కాలే జీ, బ్రాంచ్ వివరాలను తెలియజేసే మాక్ కౌన్సెలింగ్ పోర్టల్‌ను సాక్షిఎడ్యుకేషన్.కామ్ ప్రారంభించింది. అభ్యర్థులు ఇంజనీరింగ్, మెడికల్, డెంటల్, ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాలలో తమకు సీటు వచ్చే కాలేజీ, బ్రాంచ్ వివరాలను ఈ పోర్టల్‌లో తెలుసుకోవచ్చు. విద్యార్థులు www.sakshieducation.comలోని ఎంసెట్ మాక్ కౌన్సెలింగ్ లింక్ ఓపెన్‌చేసి తమ ర్యాంకు, ఇతర వివరాలను పొందుపరిచి తమకు ఏ కాలేజీలో, ఏ బ్రాంచిలో సీటు వస్తుందో తెలుసుకోవచ్చు. ఎంసెట్ 2013 కౌన్సెలింగ్‌లో జరిగిన కాలేజీ, బ్రాంచ్ కేటాయింపుల ఆధారంగా ఈ సంవత్సరం ఫలితాలను ఈ పోర్టల్ అంచనా వేస్తుంది.
ఐసెట్ మాక్ కౌన్సెలింగ్ పోర్టల్
అలాగే ఐసెట్ 2014లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్లు, కాలేజీల కేటాయింపు వివరాలను తెలియజేసే ప్రత్యేక మాక్ కౌన్సెలింగ్ పోర్టల్‌ను సాక్షిఎడ్యుకేషన్.కామ్ ప్రారంభించింది. అభ్యర్థులు మాక్ కౌన్సెలింగ్ కోసం www.sakshieducation.comని సందర్శించవచ్చు.