Model school teacher
-
విషాదం: హెల్మెట్ పెట్టుకున్నా.. దక్కని టీచర్ ప్రాణం
సాక్షి, కరీంనగర్: మృతువు ఆమెను లారీ రూపంలో వెంటాడింది. భర్త ఇక లేడన్న ఆలోచనల నుంచి తేరుకుంటున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా ఉలిక్కిపాటు చోటుచేసుకుంది. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. అయితే, మరో 30 మీటర్లు దాటితే ఆమె తన గమ్యస్థానం చేరుతుందనగా అనుకోని విధంగా మృత్యువు కాటేసింది. హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కరీంనగర్ పట్టణానికి చెందిన రజిత.. సిరిసిల్ల జిల్లాలోని ఇల్లందకుంట మండలం రహీమ్‌ఖాన్‌పేట మోడల్ స్కూల్లో గణితం టీచర్‌గా పనిచేస్తున్నారు. అయితే, రజిత రోజు మాదిరిగానే శుక్రవారం కూడా విధులకు బయలుదేరింది. కాగా, స్కూటీపై ఓ ప్రైవేటు స్కూల్ వరకు వెళ్లి.. అక్కడే వాహనం పార్క్ చేసి ఆర్టీసీ బస్సులో పాఠశాలకు వెళ్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం స్కూటీపై స్కూల్‌కు వెళ్తుండగా సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ఓ సిమెంట్ కాంక్రీట్ మిక్సర్ లారీ రజిత స్కూటీకి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ నుజ్జునుజ్జు అయిపోయింది. లారీ ఆమెపై నుంచి దూసుకెళ్లడంతో ఘటనా స్థలంలోనే టీచర్ రజిత మృతిచెందారు. అయితే, రజిత హెల్మెట్ ధరించినప్పటికీ ఆమె చనిపోయారు. ఇక, రజిత.. మరో 30 మీటర్ల దూరంలో స్కూటీ పార్క్ చేసే స్థలం ఉండటం గమనార్హం. ఇక, రజితకు ఇద్దరు పిల్లలు ఉండగా.. ఆమె భర్త వినోద్ కుమార్ ఐదేళ్ల క్రితమే మృతిచెందారు. రోడ్డు ప్రమాదంలో రజిత కూడా చనిపోవడంతో పిల్లలు అనాథలయ్యారని కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న టూ టౌన్ పోలీసులు.. రజిత డెడ్‌బాడీని ఆసుపత్రికి తరలించారు. -
ఆదర్శ పాఠశాలల పోస్టుల భర్తీ షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆదర్శ పాఠశాలల్లో 282 టీజీటీ, పీజీటీ పోస్టులకు ఈ నెల 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కె.సురేష్‌కుమార్ తెలిపారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఈ మేరకు మంగళవారం పోస్టుల భర్తీ షెడ్యూల్ విడుదల చేశారు. మొత్తం 282 పోస్టుల్లో 71 టీజీటీ కాగా 211 పీజీటీ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు http://cse.ap.gov.in ద్వారా దరఖాస్తులను సమర్పించాలన్నారు. ఇతర పద్ధతుల్లో వచ్చే దరఖాస్తులను అనుమతించబోమని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చినా, నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినా వారి దరఖాస్తులు తిరస్కరిస్తామన్నారు.] ఇలాంటివారు ఒకవేళ ఎంపికైతే.. వారి నియామకాన్ని రద్దు చేయడంతోపాటు క్రిమినల్ ప్రాసిక్యూషన్ వంటి చర్యలు చేపడతామని హెచ్చరించారు. అభ్యర్థులు తాజా పాస్‌పోర్ట్ సైజ్ఫొటో, సంతకాన్ని స్పష్టంగా కనిపించేలా ఆన్లైన్ దరఖాస్తులో అప్లోడ్ చేయాలన్నారు. స్పష్టంగా లేని దరఖాస్తులను తిరస్కరిస్తామని చెప్పారు. పోస్టుల భర్తీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు వర్తిస్తాయన్నారు. నోటిఫికేషన్ జారీ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల లోపు ఉండాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ అభ్యర్థులకు గరిష్ట వయసు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లుగా పేర్కొన్నారు. ఎంపిక ఇలా.. అభ్యర్థుల ఎంపికకు జోన్ల వారీగా రీజనల్ జాయింట్ డైరెక్టర్లు (ఆర్జేడీలు) చైర్మన్లుగా.. జోన్ హెడ్‌క్వార్టర్ డీఈవో, ఆదర్శ పాఠశాలల అసిస్టెంట్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ సభ్యులుగా కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ పోస్టులకు ఎంపికయ్యే పీజీటీలకు రూ.31,460, టీజీటీలకు రూ.28,940 చొప్పున నెలవారీ మినిమం టైమ్ స్కేల్ కింద వేతనం ఉంటుందన్నారు. ఎలాంటి అలవెన్సులు ఉండవని చెప్పారు. మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపికలుంటాయని వెల్లడించారు. సంబంధిత అర్హతలు, మార్కుల శాతాన్ని అనుసరించి ఎంపిక చేస్తామని తెలిపారు. ఇప్పటికే గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నవారికి మెరిట్ ర్యాంకుల్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఉదాహరణకు వీరికి అర్హతల శాతం 55 ఉంటే దాన్ని 60 శాతంగా పరిగణిస్తారు. అభ్యర్థులకు ఒకే ర్యాంక్ వస్తే ముందు ఎక్కువ వయసు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. వయసు ఒకే రకంగా ఉంటే జెండర్‌ను అనుసరించి ముందు మహిళలకు అవకాశం ఉంటుంది. వయసు, జెండర్ ఒకేలా ఉంటే ముందు ఎస్టీ, ఎస్సీ, బీసీ–ఏ, బీ, సీ, డీ, ఈ కేటగిరీల వారీగా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఎంపికైనవారికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక ఏడాది ఒప్పందంతో నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. ఎంపికయ్యాక ఆయా ఆదర్శ పాఠశాలలకు కేటాయించే టీచర్లతో ప్రిన్సిపాళ్లు రూ.100 నాన్ జ్యుడిషియల్ పేపర్లపై ఒప్పందం కుదుర్చుకోవాలి. కాగా, ఈ టీచర్ల వేతనాల చెల్లింపునకు రూ.2.60 కోట్లు అదనపు బడ్జెట్ కేటాయించాలని సురేష్ కుమార్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. -
మోడల్ స్కూల్ టీచర్లకు సర్వీస్ రూల్స్
పీఆర్సీ ఫైలుపై సంతకం చేసిన సీఎం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూల్ టీచర్లకు సర్వీస్ రూల్స్ రూపొం దించాలని సీఎం కేసీఆర్ సూచించారు. దీంతో పాటు టీచర్లకు, సిబ్బందికి పీఆర్సీ వర్తింపజేసే ఫైలుపై సంతకం చేశారు. ఫలితంగా ఇప్పటివరకు త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడిన మోడల్ స్కూల్ టీచర్లకు ఊరట లభించనుంది. కేంద్రం చేతులెత్తేసిన తర్వాత మోడల్ స్కూల్ సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంలా మారిన విషయం తెలిసిందే. పదో పే రివిజన్ కమిషన్ అమల్లో భాగంగా రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. 2014 జూన్ నుంచి ఇది అమలు చేసింది. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న పీజీటీలు, టీజీటీలు, ప్రిన్సిపాల్స్‌కు మాత్రం ఇది వర్తించలేదు. మరోవైపు కేంద్రం మోడల్ స్కూళ్ల నిర్వహణ నుంచి వైదొలగడంతో చిక్కులు తలెత్తాయి. దీంతో ఈ సిబ్బందిని ఏ కేటగిరీ ఉద్యోగులుగా పరిగణించాలి.. వాళ్ల సర్వీస్ రూల్స్ ఏమిటనే సందేహాలు తలెత్తాయి. ఈ క్రమంలో మిగిలిన ఉద్యోగులకు అమల్లోకి వచ్చిన పీఆర్సీ ఫిట్మెంట్ వర్తింపజేసే అంశం పెండింగ్‌లో పడింది. తెలంగాణలోని 182 మోడల్ స్కూళ్లలో 3,368 మంది ఉద్యోగులున్నారు. సీఎం సంతకంతో వీరందరికీ ఊరట లభించింది.