ఒక వ్యక్తి...26 పాస్‌పోర్టులు
నిబంధనలకు విరుద్ధంగా 26 పాస్‌పోర్టులు కలిగిన వ్యక్తిని కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు. బుధవారం స్థానిక విమానాశ్రయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహ్మద్ పనపిల్ను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
తాను కేరళలోని కన్నూరు వాసిగా పేర్కొన్న అతను.. దుబాయ్ నుంచి మంగళూరుకు వచ్చానని విచారణలో వెల్లడించాడు. మంగళూరు నుంచి కన్నూరుకు వెళ్లి.. అక్కడి నుంచి మక్కాకు వెళ్లనున్నటు చెప్పాడు. అతని మాటలు, నడవడిక అనుమానాస్పదంగా ఉండడంతో లగేజీను సోదా చేశారు. 26 పాస్‌పోర్టులు లభ్యమయ్యాయి. అందులో రెండు అమెరికాకు చెందినవి కాగా, మిగిలిన 24 భారత దేశానికి చెందినవని అధికారులు గుర్తించారు. దీంతో అతన్ని భద్రతా సిబ్బంది స్థానిక పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.