విదర్భ ప్రాంతంలో జౌళి పరిశ్రమ విస్తరణ
నాగపూర్: విదర్భ ప్రాంతంలో రాష్ట్ర జౌళి మంత్రిత్వ శాఖ భారీ విస్తరణ ప్రణాళిక చేపట్టింది. రూ. 1,800 కోట్ల వ్యయంతో 15 వేల ఉద్యోగాలు కల్పిం చేం దుకు అధికార వర్గాలు ఓ ప్రణాళికను రూపొందిస్తున్నాయి. ప్రస్తుతం 500 జౌళి పరిశ్రమలు ప్రారంభమయ్యాయని, మరి కొన్ని పరిశ్రమలను నెలకొల్పే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని జౌళి శాఖ మంత్రి మహ్మద్ ఆరిఫ్ నసీమ్ ఖాన్ తెలిపారు.
ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 14 టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని, వీటి పెట్టుబడుల విలువ 16 వేల కోట్ల రూపాయలని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 180 టెక్స్టైల్ పార్కులు ఉన్నాయని ఆయన వివరించారు. విదర్భ ప్రాంతంలో సంవత్సరానికి 90 లక్షల బెయిళ్ల పత్తి పండిస్తున్నారని, ఇందులో కొంతమాత్రమే రాష్ట్ర పరిశ్రమలు వినియోగించుకుంటున్నాయని, మిగతాది ఎగుమతి అవుతుందన్నారు.