అలలకు బలైన అన్నదమ్ములు
భార్యాబిడ్డలను రక్షించబోయి మృత్యువాత
ఎస్‌రాయవరం: ఎస్‌రాయవరం మండలం బంగారమ్మపాలెం సమీపంలో సముద్రంలో మునిగి ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాతపడ్డారు. పాయకరావుపేటలోని శాంతినగర్ చెందిన మహ్మద్ గయాజ్(38), మహ్మద్ దావూద్‌వాహబ్(36)లు అన్నదమ్ములు. గయాజ్ పాయకరావుపేటలో తోళ్లవ్యాపారం చేస్తుండగా, వాహబ్ హైదరాబాద్‌లో సాఫ్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం వీరు తమ కుటుంబాలతో శనివారం బంగారమ్మపాలెం సముద్రతీరానికి విహారయాత్రకు వెళ్లారు. స ముద్రంలో స్నానం చేద్దామని దిగా రు. కొంచెం సమీపాన చిన్నపాటి కట్టెలపై కుటుంబ సభ్యులు ఆడుకుంటున్నారు. కెరటాల తాకిడికి పిల్లలు మునిగిపోతారేమోనని భావించి వీరిద్దరూ రక్షించే ప్రయత్నం చేశారు.
అప్పటికే కెరటాల తాకిడికి ఈ అన్నదమ్ములు నీటమునిగిపోయారు. అక్కడే ఉన్న నేవీసిబ్బంది ..మత్య్స కారులు వీరిని ఒడ్డుకుచేర్చారు. వీరిని నక్కపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో వృతిచెందారు. ఎస్.రాయవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాలకు నక్కపల్లి ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. నే వల్ సిబ్బంది ప్రమాదం సంభవిస్తుందని హెచ్చరించే లోగా నే వీరిద్దరూ మునిగిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.