Mohanraja
-
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న గాడ్ ఫాదర్.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పలు రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (చదవండి: బాలీవుడ్లో ‘గాడ్ ఫాదర్’ హవా.. 600 స్క్రీన్స్ పెంపు) గతంలో మెగాస్టార్ ఖైదీ నెం.150 మాత్రమే రూ.164 కోట్లతో ఆయన కెరీర్లో బెస్ట్‌గా నిలిచిందన్నారు. త్వరలోనే గాడ్‌ఫాదర్ ఈ రికార్డును అధిగమించనుందని ట్వీట్ చేశారు. గతంలో విడుదలైన ఆచార్య వసూళ్లను అధిగమించింది. గాడ్ ఫాదర్ 2019లో వచ్చిన మలయాళ చిత్రం లూసిఫర్‌కి తెలుగు రీమేక్. మోహన్ రాజా దర్శకత్వం వహించిన గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార, సత్యదేవ్ నటించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. #GodFather ENTERS ₹100 cr club at the WW Box Office. — Manobala Vijayabalan (@ManobalaV) October 8, 2022 -
‘గాడ్ ఫాదర్’ టైటిల్ సాంగ్ రిలీజ్.. ఇంకెందుకు ఆలస్యం వినేయండి..!
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'గాడ్ ఫాదర్'. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ మెగాస్టార్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. (చదవండి: 'గాడ్‌ఫాదర్' హిందీ ట్రైలర్ రిలీజ్.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్) ఈ సందర్భంగా తాజాగా టైటిల్ సాంగ్‌ను అభిమానులతో పంచుకుంది చిత్ర బృందం. చిరు పాత్రకు అద్దం పట్టే టైటిల్ సాంగ్‌ను రామజోగయ్యశాస్త్రి రాశారు. తమన్ పవర్ఫుల్ సంగీతం అందించారు. సల్మాన్‌ఖాన్, నయనతార, సత్యదేవ్, పూరీ జగన్నాథ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్‌గా గాడ్ ఫాదర్ ప్రేక్షకుల ముందుకొస్తోంది. -
'గాడ్‌ఫాదర్' హిందీ ట్రైలర్ రిలీజ్.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్
చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం 'గాడ్‌ఫాదర్'. మోహన్‌రాజా దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఈ సినిమాను తెరకెక్కించారు. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ కీలక పాత్ర పోషించారు. తాజాగా ముంబైలో నిర్వహించిన ఈవెంట్లో హిందీ ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. మలయాళంలో సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్' రీమేక్ ఈ చిత్రం. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అభిమానులను పలకరించనుంది. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు, సల్మాన్, సత్యదేవ్, మోహన్‌రాజా, నిర్మాతలు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. 'గాడ్ ఫాదర్'లో ఒక బలమైన పాత్ర వుంది. ఆ పాత్రని సల్మాన్ భాయ్ చేస్తే బాగుంటుందని భావించాం. మేము కోరగానే నేను చేస్తాను' అని మాపై ఎంతో ప్రేమ చూపించారు సల్మాన్ భాయ్. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పడానికి తొలిమెట్టు ఆయనే. సల్మాన్‌తో కలిసి ఈ సినిమాని చాలా జోష్ ఫుల్ జోష్‌గా చేశాను.' అని అన్నారు. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ..'చిరంజీవి పేరు చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను. సినిమాల పట్ల ఆయనకున్న ప్రేమే దీనికి కారణం. ఆయనతో నటించడం మంచి అనుభవం. ఇందులో చాలా కొత్త పాత్ర చేశాను. మల్టీస్టారర్లు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటా. గాడ్ ఫాదర్ నా తొలి తెలుగు సినిమా. ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుంది' అని అన్నారు. (చదవండి: గాడ్ ఫాదర్ ట్రైలర్ రిలీజ్.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పవర్‌పుల్ డైలాగ్స్) సత్యదేవ్ మాట్లాడుతూ.. 'ఇద్దరు మెగాస్టార్ల ముందు మాట్లాడటం గొప్ప అనుభూతి. అన్నయ్యపై ప్రేమతో నటుడిని అయ్యాను. అన్నయ్యే ఈ సినిమా కోసం నన్ను ఎంపిక చేశారు. ఈ అవకాశం వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించా. మోహన్ రాజా సినిమాని చాలా కూల్‌గా డీల్ చేశారు. సినిమా అద్భుతంగా వచ్చింది' అని అన్నారు. దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ.. 'ఇద్దరు మెగాస్టార్లను డైరెక్ట్ చేయడమనే నా కల నెరవేరింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. సినిమాను అందరూ తప్పకుండా థియేటర్లలో చూడాలి' అని కోరారు. -
నయన మరో మాయ చేస్తుందా?
నాయకిగా అగ్రస్థానంలో వెలుగొందుతున్న నటి నయనతార. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో యమ బిజీగా ఉన్నారు. శింబుతో రొమాన్స్ చేసిన ఇదునమ్మఆళు చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. జీవాతో జత కట్టిన తిరునాళ్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా కార్తీ సరసన నటించిన కాష్మోరా, విక్రమ్‌కు జంటగా నటిస్తున్న ఇరుముగన్, తెలుగులో వెంకటేశ్‌తో బాబు బంగారం చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఇక మోహన్‌రాజా దర్శకత్వంలో శివకార్త్తికేయన్తో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇవి కాక మరో నూతన చిత్రాన్ని అంగీకరించారు. ఈ బ్యూటీని రీఎంట్రీలో ఉన్నత స్థాయిలో కూర్చోపెట్టిన చిత్రాల్లో మాయ ఒకటని చెప్పక తప్పదు. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా నయన్‌కు మంచి విజయాన్ని అందించిన మాయ చిత్ర దర్శకుడు అశ్వన్ శరవణన్ తాజా చిత్రానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ది హిందూ రంగరాజన్ మనవడు రోహిత్ రమేశ్ డబ్ల్యూఎఫ్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థతో కలిసి మో అనే చిత్రాన్ని నిర్మిస్తున్న మూమెంట్ ఎంటర్‌టెయిన్‌మెంట్‌పై నిర్మిస్తున్న జీఏ.హరిక్రిష్ణన్ మాయ చిత్ర దర్శకుడి తాజా చిత్రాన్ని భారీ ఎత్తున్న నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మాయ చిత్రాన్ని హారర్ నేపథ్యంలో తెరకెక్కించిన అశ్విన్శరవణ న్ తాజా చిత్రాన్ని వేరే బ్యానర్లో రూపొందించడానికి సిద్ధమయ్యారు. అయితే ఇదీ కథానాయకి చుట్టూ తిరిగే కథేనట. నాయకిది హిందీలో విద్యాబాలన్ నటించే తరహాలో చాలా బరువైన పాత్ర కావడంతో ఈ పాత్రలో నయనతారను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. అయితే ప్రస్తుతం అరడజను చిత్రాలతో బిజీగా ఉన్న నయన్ మాయ చిత్ర దర్శకుడికి పచ్చజెండా ఊపుతారా? అన్నదే చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే తమ చిత్రంలో నటించే తారాగణాన్ని వెల్లడిస్తామంటున్నారు చిత్ర దర్శకనిర్మాతలు. -
ఆయన ధైర్యాన్ని అభినందిస్తున్నా!
నెగెటివ్ ప్రచారాన్ని ఆపండి, సెంటిమెంట్లను పక్కన పెట్టండి అన్నారు యువ దర్శకుడు మోహన్‌రాజా. సంగీతదర్శకుడు విజయ్‌ఆంటోని సంగీతం అందించి, కథానాయకుడిగా నటించి సొంతంగా నిర్మించిన చిత్రం పిచ్చైక్కారన్. శశి కథ, కథనం,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించిన ఈ చిత్రం గత వారం తెరపైకి వచ్చి విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం సాయంత్రం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. స్థానిక వడపళనిలోని ఆర్కేవీ.స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శకుడు మోహన్‌రాజా మాట్లాడుతూ పిచ్చైక్కారన్ టైటిల్‌పై కొనసాగుతున్న నెగెటివ్ ప్రచారానికి చిత్ర విజయం పుల్‌స్టాప్ పెట్టిందన్నారు.తాను తన చిత్రానికి తనీఒరువన్ అని పేరు నిర్ణయించినప్పుడూ అదేం పేరు ఆ చిత్రంతో మోహన్‌రాజా ఒంటరి వాడయైపోతారనే ప్రచారం జరిగిందన్నారు. ఆ చిత్ర విజయం అలాంటి వాళ్ల నోళ్లను మూయించిదని వ్యాఖ్యానించారు. తాను తనీఒరువన్ పెడితేనే అలాంటి కామెంట్స్ చేసిన వాళ్లు విజయ్‌ఆంటోని పిచ్చైక్కారన్ టైటిల్‌ను నిర్ణయించనప్పుడు ఇంకెలా నెగెటివ్ ప్రచారం చేస్తారోనని అనుకున్నానన్నారు. దీన్ని పలువురు రాంగ్ సెంటిమెంట్ అంటూ ప్రచారం చేశారని గుర్తు చేశారు.అలాంటి ప్రచారాన్ని ఎదురొడ్డి పిచ్చైక్కారన్ విజయపథంలో దూసుకుపోతోందన్నారు. అలాంటి టైటిల్‌తో చిత్రం చేసిన విజయ్‌ఆంటోని ధైర్యానికి అభినందిస్తున్నానన్నారు. పిచ్చైక్కారన్ కాపాడింది పిచ్చైక్కారన్ చిత్రం విజయవంతం అయ్యి తనను కాపాడిందని ఆ చిత్ర కథానాయకుడు, నిర్మాత విజయ్‌ఆంటోని అన్నారు.దర్శకుడు శశి పిచ్చైక్కారన్ టైటిల్ చెప్పగానే బాగా నచ్చేసిందన్నారు.తన భార్యకు ఆ పేరు గురించి చెప్పగా చాలా మెస్మరైజ్ అయ్యారన్నారు. పిచ్చైక్కారన్ లాంటి చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడు శశికి కృత జ్ఞలు చెప్పుకుంటున్నానని అన్నారు.చిత్రాన్ని విడుదల చేసిన ఆర్కే ఫిలింస్, స్కైలార్క్ అధినేతలు తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. -
అసలైన ఆనందంలో అన్నయ్య
ఇప్పటి వరకూ తన సంతోషంతోనే తృప్తిపడిన అన్నయ్య ఇప్పుడే అసలైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు అన్నారు నటుడు జయంరవి. ఏమిటి అసలు ఆనందం, కొసరు సంతోషం అదేమిటో చూద్దాం. జయంరవి తన అన్నయ్య మోహన్‌రాజా (జయంరాజా పేరు మార్చుకున్నారు) దర్శకత్వంలో నటించిన ఆరవ చిత్రం తనీఒరువన్. నయనతార హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించింది. ఇటీవల విడుదలయిన తనీఒరువన్ విశేష ప్రజాఆధరణతో ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం సక్సెస్ మీట్‌ను నగరంలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించింది. ఇందులో పాల్గొన్న చిత్ర కథానాయకుడు జయంరవి మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకుడు, తన సోదరుడు ఇప్పటి వరకూ నా సంతోషాన్ని తన సంతోషంగా భావిస్తూ వచ్చారు. దర్శకుడిగా పలు విజయాలను పొందినా రీమేక్‌ల రాజాగానే పిలవబడ్డారు. ఇవన్నీ చూస్తూ అన్నయ్య తానేమిటో నిరూపించుకునే రోజు వస్తుందని నేను మనసులోనే అనుకునేవాడిని. అది ఈ తనీఒరువన్ చిత్రంతో జరిగింది. ఇది అన్నయ్య తయారు చేసిన కథతో తెరకెక్కించిన చిత్రం. చాలా పెద్ద విజయం సాధించడం చెప్పలేనంత ఆనందంగా ఉంది. చిత్రం విడుదలకు ముందే చిత్రం ఘన విజయం సాధిస్తుందని మా కుటుంబ సభ్యులకు చెప్పారు. అన్నయ్య మోహన్‌రాజాగా పేరు మార్చుకున్నట్లు తనీఒరువన్ చిత్రం విజయం తరువాత తనీఒరువన్ రవిగా పేరు మార్చుకుంటారా? అని అడుగుతున్నారని తొలి చిత్రం జయం నాకు అడ్రస్ నిచ్చింది. అందువల్ల జయంరవి పేరును మార్చుకునే ప్రశక్తే లేదు.అయితే తనీఒరువన్ నా గుండెల్లో చెరగని పచ్చబొట్టుగా నిలిచిపోతుందిఅని జయంరవి అన్నారు. త్రిశంకు స్వర్గంలో ఉన్నా దర్శకుడు మోహన్‌రాజా మాట్లాడుతూ ఇప్పటి వరకూ నేను త్రిశంకు స్వర్గంలో ఉన్నాను. ఏ చిత్రం చేసినా ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉన్నారు. సొంతంగా తయారు చేసుకున్న కథల్లో నటించడానికి హీరో లెవరూ అంగీకరించని పరిస్థితి. ఎలాంటి చిత్రం చెయ్యాలో అర్థం గాక రీమేక్ చిత్రాలు చేసుకుంటూ వచ్చాను. ఫలితం రీమేక్ చిత్రాల దర్శకుడుగా ముద్ర వేశారు. ఇలా పుష్కర కాలం గడిసిపోయింది. అలాంటిది ఏజీఎస్ సంస్థ అధినేత 2009లో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడే సొంత కథతో చిత్రం చేయాలని ప్రోత్సహించారు. తనీఒరువన్ చిత్రం ద్వారా ఒక వ్యక్తిపై ప్రతీకారం అనే ఫార్ములాను బ్రేక్ చేసి విజయం సాధించాను అని అన్నారు.