Mojtaba Khamenei
-
ట్రంప్ హెచ్చరిక.. ఇరాన్ ఆసక్తికర సందేశం విడుదల
టెహ్రాన్: ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇక, తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై సంచలన కామెంట్స్ చేశారు. ఇరాన్లో విధ్వంసం జరిగిందని, ఇరాన్ ముఖ్య నేతలను అంతం చేసినట్టు చెప్పుకొచ్చారు. రెండు వారాల్లో ఇరాన్‌పై భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ కీలక సందేశం విడుదల చేశారు. అలాగే, ఇరాన్ అధ్యక్షుడు బహిరంగ లేఖ ఆసక్తికరంగా మారింది. దీంతో, యుద్దం వేళ కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఇస్లామిక్ రిపబ్లిక్ డే, ఇరాన్ జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి తాజాగా మొజ్తాబా ఖమేని సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా అమెరికా-ఇజ్రాయెల్ తమపై అకారణంగా దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇరాన్‌పై జరుగుతున్న దాడులు, నీచమైన దురాక్రమణలను ఖండించారు. ఈ దాడుల కారణంగా ఇరాన్లో మౌలిక సదుపాయాలతో పాటు పర్యావరణం కూడా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ఇరాన్ ప్రజల ముందున్న లక్ష్యం ఒక్కటే. ప్రస్తుతం దేశ అంతర్గత అభివృద్ధిపై దృష్టిసారించాలి. అభివృద్ధిని విస్తరించడం, ఇరాన్ ఉజ్వల భవిష్యత్తుకు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మౌలిక సదుపాయాలను తిరిగి పునరుద్ధరించడానికి నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు.ఇదే సమయంలో ఇరాన్‌లోని మినాబ్ పాఠశాలపై జరిగిన దాడి గురించి మొజ్తాబా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఘటనలో 186 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరికి నివాళిగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని అన్నారు. యుద్ధంలో చనిపోయిన వారిని స్మరించుకుంటూ ఇరాన్ ప్రజలు మొక్కలు నాటనున్నట్లు తెలిపారు.మరోవైపు.. యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రజలను ఉద్దేశిస్తూ మసూద్ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా తమకు అమెరికన్లపై ఎలాంటి శత్రుత్వం లేదని స్పష్టంచేశారు. అనేకసార్లు ఒత్తిళ్లు, ఆంక్షలు ఎదురైనప్పటికీ.. తాము ఎన్నడూ యుద్ధానికి దిగలేదన్నారు. తమపై చేస్తోన్న దాడులను దృఢంగా, ధైర్యంగా తిప్పికొడుతున్నామన్నారు. అలాగే, ప్రస్తుత ట్రంప్ పాలనలో ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదం కనిపిస్తోందా? అని ప్రశ్నించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
ట్రంప్‌కు ఝలక్ : ఇరాన్ సుప్రీం కొత్త సందేశం
ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్ధం, ఇరన్ ప్రతిదాడులు భీకరంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడిలో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తర్వాత, ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ దాడిలో మోజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డాడని, అసలు ప్రాణాలతో లేడని ఇలా పలు ఊహాగానాలు చెలరేగాయి. దీనిపై ఇరాన్ మోజ్తబా గాయపడినా, ఆరోగ్యంగానే ఉన్నారని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఆయన ప్రజల ముందుకు రాలేదు.కేవలం లిఖితపూర్వక ప్రకటనలు మాత్రమే విడుదల చేస్తూ వస్తున్నారు. తాజాగా మరో సందేశాన్ని విడుదల చేశారు. ప్రస్తుత యుద్ధంలో మద్దతుగా నిలిచినందుకు ఇరాక్ ప్రజలకు తమ నాయకుడు మొజ్తబా ఒక లిఖిత సందేశంలో కృతజ్ఞతలు తెలిపారని ఇరాన్ మీడియా మార్చి 29న తెలిపింది.మొజ్తబా ఖమేనీ స్వయంగా కనిపించకపోవడంతో, ఆయన ఆరోగ్య పరిస్థితి మరియు ఆచూకీపై తీవ్ర పుకార్లు చెలరేగాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపే అంశంపై గత వారం మాట్లాడుతూ, తాము ఇరాన్‌లోని ఒక ముఖ్య వ్యక్తితో చర్చలు జరుపుతున్నామనీ కానీ అది సుప్రీం లీడర్‌తో మాత్రం కాదు, ఆయన అసలు బతికి ఉన్నారో లేదో తెలియదని వ్యాఖ్యానించారు.ట్రంప్ ఈ వ్యాఖ్యల తర్వాత మొజ్తబా ఖమేనీ కొత్త సందేశంప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా-ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్‌కు మద్దతుగా నిలిచినందుకు ఇరాక్ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఒక లేఖను విడుదల చేశారు. అలాగే ఇరాన్‌పై దురాక్రమణకు వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరిని తీసు కున్నందుకు ఇరాక్ సుప్రీం మత పెద్ద గ్రాండ్ అయతుల్లా అలీ సిస్తానీకి, అక్కడి ప్రజలకు ఇరాన్ పట్ల వారు చూపుతున్న మద్దతుకు మొజ్తబా కృతజ్ఞతలు తెలిపారు.ఇదీ చదవండి: వైభవంగా ఐపీఎస్ జంట వెడ్డింగ్ : ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్మోజ్తబా ఖమేనీ బయట కనిపించకపోవడంతో ఆయన ప్రాణాలతో ఉన్నారా లేదా అనే సందేహాలు తలెత్తాయి. అయితే, ఆయన వైమానిక దాడిలో గాయపడ్డారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని ఇరాన్ అధికారులు మరియు ప్రభుత్వ మీడియా పేర్కొన్నాయి. కాగా 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత రూహోల్లా ఖొమేనీ మరియు అలీ ఖమేనీల తర్వాత మోజ్తబా ఖమేనీ ఇరాన్‌కు మూడవ సుప్రీం లీడర్ అయ్యారు.ఇదీ చదవండి : రూ. 10 కోట్లు చూసి ఆమె షాక్ : నెటిజన్లు మాత్రం ఫిదా -
మొజ్తబా ఎక్కడ?
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్న ప్రశ్న అమెరికా, ఇజ్రాయెల్లను వేధిస్తోంది. ఇరాన్ అగ్రనాయకత్వాన్ని దాదాపుగా అంతం చేసిన నేపథ్యంలో మొజ్తబా జాడ కోసం అవి తీవ్రంగా వెదుకుతున్నాయి. తండ్రి ఖమేనీ మరణానికి కారణమైన దాడిలో మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడి రష్యాలో చికిత్స పొందుతున్నారని వార్తలు రావడం తెలిసిందే. ‘‘మొజ్తాబా క్షేమంగానే ఉండి ఉంటారు. ఇజ్రాయెల్‌కు తన జాడ తెలియొద్దనే బయటికి రావడం లేదు’’ అని ఇరాన్ వ్యవహారాల నిపుణుడు రజ్ జిమిత్ అభిప్రాయపడ్డారు. -
మోజ్తాబా ఖమేనీ ఎక్కడ?.. ట్రంప్ బ్రీఫింగ్‌లలో హాట్‌టాపిక్!
టెహ్రాన్: రోమ్ తగలబడుతుంటే నీరో ఫిడేలు వాయించినట్టే… ఇరాన్ యుద్ధంలో మోజ్తాబా మౌనం. దేశం రగులుతున్నా కొత్త సుప్రీం లీడర్ ఒక్క బహిరంగ ప్రకటన చేయలేకపోవడం ఇప్పుడు ట్రంప్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్‌లలో హాట్‌టాపిక్‌గా మారిందిఅమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్లో పరిస్థితులు తీవ్రంగా మారాయి. ఫిబ్రవరి 28న జరిగిన క్షిపణి దాడుల్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే ఆయన ఆరోగ్యం, నాయకత్వ సామర్థ్యంపై అంతర్జాతీయ స్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.జెరూసలెం పోస్ట్ నివేదిక ప్రకారం, మోజ్తాబా తీవ్ర గాయాలతో బాధపడుతున్నారని, వాస్తవానికి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) యుద్ధ వ్యూహాలను నడిపిస్తున్నాయని పేర్కొంది. అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం, దాడుల్లో ఆయన ఒక కాలు కోల్పోయి, కాలేయం దెబ్బతిని ఆయన ఆరోగ్య పరిస్థి అంతంత మాత్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.మోజ్తాబా మౌనంమరో అమెరికా మీడియా సంస్థ యాక్సియోస్ ..ఇరాన్‌పై ముప్పేటా దాడి,ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీని ముట్టుబెట్టడం,ఇరాన్‌పై పైచేయి సాధించేలా యుద్ధ వ్యూహాల్ని రచిస్తున్నా మోజ్తాబా మౌనం.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్‌ల సమయంలో చర్చనీయాంశంగా ఉంది. ఇరాన్ బాధ్యతలు ఎవరు నిర్వహిస్తున్నారో అమెరికా జాతీయ భద్రతా బృందం ఆరా తీస్తుందని ట్రంప్ వర్గంలోని ఓ కీలక వ్యక్తి చెప్పారని నివేదించింది మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యం అంతంత మాత్రమే?అదే సమయంలో ఇజ్రాయెల్ ఇనిస్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ నిపుణుడు రజ్ జిమ్మ్ట్ మోజ్తాబా ఆచూకీపై మీడియా యాక్సియోస్‌తో మాట్లాడారు. కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ప్రస్తుత భద్రతా పరిస్థితుల కారణంగా ప్రజల ముందుకు రావడం అసాధ్యం.క్షిపణి దాడుల్లో ఆయన గాయపడిన తీరు అలాంటిది. ఓ వీడియో రికార్డు చేసి ప్రజలకు సైతం సందేశం పంపించ లేకపోతున్నారని చెప్పారు.వరుస ప్రాణాలు కోల్పోతున్న ఇరాన్ అగ్రనాయకులు ఇదే సమయంలో ఇజ్రాయెల్–అమెరికా దాడుల్లో ఇరాన్ అగ్రనాయకులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. మార్చి 16న కమాండర్ ఘోలాంరెజా సోలేమానీ, మార్చి 17న భద్రతా వ్యూహకర్త అలీ లారిజానీ మరణించారు. ఈ పరిణామాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి స్పందిస్తూ.. ఓ వ్యక్తి ఉండటం,లేకపోవడం ఇరాన్ రాజకీయ, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపదు. మేము పోరాటాన్ని కొనసాగిస్తాం.సుప్రీం లీడర్ కూడా వీరమరణం పొందినా, వ్యవస్థ తన పనిని కొనసాగించింది’ అని పేర్కొన్నారు.ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం, యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 1270 మంది మరణించారు. అమెరికా స్థావరాలపై ప్రతిదాడులు జరిపిన ఇరాన్, హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు విధించింది. ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలో ఐదవ వంతు ఈ మార్గం ద్వారా జరుగుతుంది. నౌకలు ప్రయాణించలేకపోవడంతో ఇంధన సరఫరా తీవ్రంగా దెబ్బతింది. ఈ పరిణామాలు ఇరాన్ అంతర్గత రాజకీయాలపై మాత్రమే కాకుండా, ప్రపంచ ఇంధన మార్కెట్లపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. -
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్.. అన్నదమ్ముల్లా కలిసి ఉండండి: ఖమేనీ పిలుపు
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో నలిగిపోతున్న ఇరాన్.. పక్క దేశాల పంచాయితీని చక్కబెడతానని ముందుకొచ్చింది. ఆ దేశ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ 1405వ పర్షియన్ నూతన సంవత్సరం "నౌరూజ్" సందర్భంగా ఇచ్చిన సందేశంలో పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కలిసి ఉండాలని పిలుపునిచ్చారు.మా తూర్పు దేశాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మాకు అత్యంత సన్నిహితమైనవి.. ఇరు దేశాలు సోదరుల్లా మెలగండి.. ముస్లింల ఐక్యత కోసం పరస్పర సంబంధాలను మెరుగుపర్చుకోండి.. అవసరమైతే నేను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. మొజ్తబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యాక పాక్-ఆఫ్ఘన్ ఘర్షణలపై చేసిన తొలి బహిరంగ వ్యాఖ్యలు ఇవి. ఇటీవలికాలంలో ఇరాన్ విదేశాంగ మంత్రి పలుమార్లు ఇదే అంశాన్ని ప్రస్తావించినా, కాబూల్–ఇస్లామాబాద్‌వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. కాగా, గతకొంతకాలంగా పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య అనధికారిక య్దుదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఒమర్ డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్‌పై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సంఖ్యలో గాయపడ్డారు. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారంతా వైద్య సాయం పొందుతున్న రోగులని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది.అయితే పాక్ మాత్రం ఈ ఆరోపణను తీవ్రంగా ఖండిస్తూ.. తాము కేవలం ఉగ్రవాద మౌలిక వసతులు మరియు సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని వెల్లడించింది. ఈ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అయితే, సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ దేశాల విజ్ఞప్తి మేరకు ఇరు దేశాలు ఈద్ అల్-ఫితర్ సందర్భంగా తాత్కాలికంగా యుద్ధ విరమణకు అంగీకరించాయి. -
శత్రువు ఓడిపోయింది.. ఇరాన్ సుప్రీం లీడర్ సంచలన ప్రకటన
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సంచలన ప్రకటన చేశారు. పర్షియన్ నూతన సంవత్సరం "నౌరూజ్" సందర్భంగా విడుదల చేసిన రాతపూర్వక సందేశంలో "శత్రువు ఓడిపోయిందంటూ.." ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా–ఇజ్రాయెల్ దాడుల మధ్య ఇరాన్ ప్రజలు ఐక్యతను ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. తన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి తర్వాత మొజ్తబా ఖమేనీ మొదటిసారి ప్రజలకు రాతపూర్వక సందేశాన్ని విడుదల చేశారు.ఈ సందేశంలో ఖమేనీ ఇలా రాసుకొచ్చారు. మతపరమైన, సాంస్కృతిక, రాజకీయ భిన్నతలు ఉన్నప్పటికీ ప్రజలు ఒకటిగా నిలిచారు. ఈ ఐక్యత వల్లే శత్రువు ఓటమి చెందిందని పేర్కొన్నారు. అమెరికా–ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ప్రజలను భయపెట్టి ప్రభుత్వాన్ని కూలదోయాలని భావించారు. ఇది వారు చేసిన భారీ తప్పిదమని త్వరలోనే తెలుసుకుంటారు.శత్రువులు ఇరాన్ నాయకత్వాన్ని హతమార్చడం ద్వారా ప్రజల్లో భయం, నిరాశ కలిగించి దేశాన్ని విభజించాలనుకున్నారు. ఇలా జరగకపోగా, శత్రువులలోనే విభేదాలు పుట్టాయి. ప్రాంతీయ పరిణామాలపై కూడా ఆయన స్పందించారు. టర్కీ, ఒమాన్‌పై జరిగిన దాడులకు ఇరాన్ బలగాలు బాధ్యులు కాదని తెలిపారు. అవి ఫాల్స్ ఫ్లాగ్ చర్యలు అని, పొరుగు దేశాల మధ్య విభేదాలు సృష్టించడమే శత్రువుల లక్ష్యమని అన్నారు.ఆఫ్ఘనిస్తాన్–పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఘర్షణలపై కూడా ఖమేనీ స్పందించారు. ఇరు దేశాల మధ్య సయోధ్యకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్-పాక్ సోదరుల్లా మెలగాలని.. ముస్లింలు ఐక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు. కాగా, ఈద్ అల్-ఫితర్ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్-పాక్ తాత్కాలికంగా యుద్ధ విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. -
త్వరలోనే మూల్యం చెల్లించుకుంటారు: ఖమేనీ
తమ కీలక సైనికాధికారి లారిజానీ హత్యపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా స్పందించారు. ప్రతి రక్తపు బొట్టుకు ఓ లెక్క ఉంటుంది, లారిజానీ హంతకులు త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకుంటారని డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ వర్గాలు లారిజానీ హత్యను ధృవీకరించిన ఒక రోజు తర్వాత మొజ్తబా ఖమేనీ ఓ ప్రజా ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఇజ్రాయెల్, అమెరికాపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. లారిజానీ మరణ వార్త చాలా బాధించింది. అతను విలువలకు కట్టుబడి ఉన్న వ్యక్తి. ఇరాన్ రాజకీయ వ్యవస్థలో ప్రత్యేక స్థానమున్న నాయకుడు. అలాంటి వ్యక్తిని హత్య చేసి ఇజ్రాయెల్, అమెరికా చాలా పెద్ద తప్పు చేశాయి. లారిజానీ హత్య ఇస్లాం వ్యతిరేకుల ద్వేషాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ప్రతి రక్తపు బొట్టుకు ఓ లెక్క ఉంటుంది. లారిజానీ హంతకులు త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకుంటారని మొజ్తబా ఖమేనీ హెచ్చరించారు.కాగా, అలీ లారిజానీ దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి కుడి భుజం లాంటి వ్యక్తి. కొద్ది గంటల ముందు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో లారిజానీ సహా ఐఆర్‌జీసీకి చెందిన బసిజ్ పారామిలటరీ ఫోర్స్ కమాండర్ జనరల్ ఘోలమ్రెజా సులేమానీ మృతి చెందారు. వీరిద్దరి మరణాన్ని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. వీరిని హతమార్చాక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. లారిజానీ, సులేమానీని గ్యాంగ్‌స్టర్ (అయతొల్లా అలీ ఖమేనీ) అసిస్టెంట్లుగా పేర్కొన్నారు. -
ఆ చిన్నవాక్ మోజ్తబాని కాపాడింది : సంచలన ఆడియో
ఫిబ్రవరి 28న జరిగిన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడి నుంచి ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ లిప్త పాటులో ప్రాణాలతో బయట పడినట్లు తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ కాంపౌండ్‌పై జరిగిన భయంకరమైన దాడి, ఖమేనీ తృటిలో ప్రాణాలతో బైటపడిన వైనం కొత్తంకథనం సంచలనంగా మారింది.తృటిలో తప్పిన ప్రమాదంది టెలిగ్రాఫ్ నివేదించిన లీకైన ఆడియో రికార్డింగ్ ప్రకారం, 56 ఏళ్ల ఖమేనా టెహ్రాన్‌లోని తన నివాసంపై క్షిపణులు దాడి చేయడానికి కొన్ని క్షణాల ముందు బయటకు వచ్చారు. ఫిబ్రవరి 28 ఉదయం 9:32 గంటలకు టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ నివాసంపై ఇజ్రాయెల్ 'బ్లూ స్పారో' బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఆ సమయంలో మోజ్తబా ఏదో పని మీద నివాసం నుండి బయటకు వచ్చి ప్రాంగణంలోని ఖాళీ స్థలంలోకి వెళ్లారు. అదే సమయంలో క్షిపణులు భవనాన్ని తాకాయి. ఆయన తిరిగి లోపలికి వెళ్లేలోపే ఈ విధ్వంసం జరిగింది.అలీ ఖమేనీ కార్యాలయంలో ప్రోటోకాల్ విభాగాధిపతి మజాహెర్ హొస్సేనీ, మార్చి 12న టెహ్రాన్‌లోని ఖోల్హాక్ ప్రాంతంలో ఉన్నత మత పెద్దలను, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్లను ఉద్దేశించి ప్రసంగించగా, లీకైన ఒక ఆడియో రికార్డింగ్ ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయని 'ది టెలిగ్రాఫ్' తెలిపింది.(బంగారం, డాలర్ కాదు : దీని దూకుడు మామూలుగా లేదు!)హొస్సేనీ ప్రకారం, ఒకేసారి పలు ప్రాంతాలపై దాడి చేసేలా ఈ దాడులు ప్లాన్ చేశారు.మోజ్తబా నివాసం, అతని బావమరిది మిస్బా అల్-హుదా బఘేరీ కనీ ఇల్లు, అతని సోదరుడు ముస్తఫా నివాసం ఇలా మూడు క్షిపణులతో దాడి చేశారు. ఈ దాడిలో మోజ్తబా ప్రాణాలతో బయటపడినప్పటికీ, తండ్రి మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, తల్లి, ఆయన భార్య (హద్దాద్) కుమారుడు అక్కడికక్కడే మరణించారు. పలువురు ఉన్నత ఇరాన్ అధికారులు మరణించారు.సుప్రీం లీడర్ మిలిటరీ బ్యూరో చీఫ్ మహమ్మద్ షిరాజీ ఈ దాడిలో శరీర భాగాలు ఛిద్రమై అత్యంత దారుణంగా మరణించారు. చివరకు కొన్ని కిలోల మాంసం దొరికిందని హోస్సేని ఆ రికార్డింగ్‌లో చెప్పారు. క్షిపణుల తాకిడికి భవనాలు పూర్తిగా ధ్వంస మయ్యాయి.(కాల్పుల విరమణ ప్రసక్తే లేదు : ఇరాన్ సుప్రీం)ఖమేనీ ఆరోగ్యంపై పుకార్లు, షికార్లుఈ దాడి తరువాత మోజ్తబా ఖమేనీ కొత్త సుప్రీంగా ఎన్నికైనప్పటికీ బహిరంగంగా కనిపించలేదు. దీనితో ఆయన తీవ్రంగా గాయ పడ్డారని లేదా మరణించి ఉంటారనిఊహాగానాలకు ఆజ్యం పోసింది. తరువాత తీవ్రగాయాలతో, కాలు కోల్పోయి కోమాలో ఉన్నారనే వార్తలు వెలువడ్డాయి. అయితే కేవలం కాలికి చిన్న గాయం మాత్రమే అయ్యిందని అంతర్గత వర్గాల ఆడియో రికార్డింగ్ ద్వారా తెలుస్తోంది.ఇదీ చదవండి: సంచలన ఆరోపణలు : ట్రంప్‌నకు భారీ షాక్ -
కాల్పుల విరమణ ప్రసక్తే లేదు : ఇరాన్ సుప్రీం
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రయెల్ దాడులతో మొదలైన యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ దశలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాల్పుల విరమణ ప్రతిపాదను మోజ్తబా తిరస్కరించినట్టు తెలుస్తోంది.అమెరికాతో ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి లేదా కాల్పుల విరమణకు సంబంధించి మధ్యవర్తి దేశాలు పంపిన ప్రతిపాదనలను ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తబా ఖమేనీ తిరస్కరించారని సమాచారం. అమెరికా ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే విషయంలో ఖమేనీ చాలా కఠినంగా ఉన్నారని ఇరాన్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ కాళ్లమీద పడి ఓటమిని అంగీకరించి, పరిహారం చెల్లించే వరకు శాంతి అనే మాటలు తావులేదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఇజ్రాయెల్ ప్రకటన : ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ?!ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీ, అతని కుటుంబ సభ్యులు దారుణంగా హత్య గావించబడిన తరువాత ఆయన కుమారుడు మోజ్తబా సుప్రీంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా ఇరాన్ ఎప్పటికీ వెనకడుగు వేయదని, పూర్తి శక్తితో ప్రతిఘటిస్తుందని, దివంగత అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి మాత్రమే కాకుండా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి పౌరుడికి ప్రతీకారం తీర్చుకుంటుందని, శత్రువు మూల్యం చెల్లించాల్సిందేనని మోజ్తాబా ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొండి వైఖరిమరోవైపు, ఇరాన్ యుద్ధాన్ని ముగించడానికి దౌత్యపరమైన చర్చలు ప్రారంభించాలని మధ్యప్రాచ్య మిత్రదేశాలు చేస్తున్న ప్రయత్నాలను ట్రంప్ ప్రభుత్వం తోసిపుచ్చినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.ఇదీ చదవండి: బంగారం, డాలర్ కాదు : దీని దూకుడు మామూలుగా లేదు!ఖమేనీ మాస్కో ఆసుపత్రిలో కోలుకుంటున్నారా?ఫిబ్రవరి 28న తన తండ్రిని బలిగొన్న అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడిలో తీవ్రంగా గాయపడిన 56 ఏళ్ల ఖమేనీని వైద్య చికిత్స కోసం రష్యాకు తరలించి ఉండవచ్చని అంచనాలు వెలువడ్డాయి.కానీ అంచనాలను ధృవీకరించడానికి గానీ, ఖండించడానికి గానీ రష్యా నిరాకరించింది. -
అమెరికా-ఇజ్రాయెల్ మిసైళ్లు కళ్లుగప్పిన మొజ్తాబా
టెహ్రాన్: ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా నిర్వహించిన భారీ దాడిలో ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. అమెరికా ఈ దాడిని ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’, ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రోర్ ఆఫ్ ది లయన్’ పేరుతో చేపట్టింది. ఖమేనీ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ దాడుల్లో ఆయనతో పాటు పలువురు ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు.దాడి సమయంలో ఖమేనీ పక్కనే ఉన్న ఆయన రెండవ కుమారుడు, నూతన సుప్రీం లీడర్‌గా భావిస్తున్న మోజ్తాబా ఖమేనీ, అమెరికా,ఇజ్రాయెల్ క్షిపణులు,యుద్ధ విమానాలు జరిపిన దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇరాన్ ప్రభుత్వంలోని ప్రముఖుల మధ్య జరిగిన ఒక అంతర్గత ఆడియో సంభాషణలో ఈ విషయం బయటపడిందని ది టెలిగ్రాఫ్ నివేదించింది.ఖమేనీ కార్యాలయ ప్రోటోకాల్ అధిపతి మజాహెర్ హొస్సేనీ ఆ ఆడియోలో మాట్లాడుతూ.. ‘మోజ్తాబా బయటికి వెళ్లిన సమయమే మిసైల్ దాడి జరిగింది. ఆయన ప్రాణాలతో బయటపడటానికి కారణం ఇదంతా దేవుని సంకల్పమే’ అని వివరించారు.టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం, ఇజ్రాయెల్ బాలిస్టిక్ మిసైళ్లు ఖమేనీ నివాస సముదాయంపై మూడు మిసైళ్లు దాడు ప్రయోగించబడ్డాయి. ఒకటి ఖమేనీ ఉన్న ప్రాంతాన్ని తాకగా.. మరొకటి మోజ్తాబా నివాసంపై అంతస్తును ఢీకొట్టింది. ఈ దాడి నుంచి మొజ్తాబా ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయనకు కేవలం కాలి భాగంలో స్వల్ప గాయం మాత్రమే జరిగింది.ఇరాన్ సైనికాధికారి మహ్మద్ షిరాజీ ఈ దాడిలో మరణించారు. ఆయన శరీరం పూర్తిగా ఛిద్రమైంది. మరో మిసైల్ మోజ్తాబా మరిది మిస్బాహ్ అల్-హుదా బఘేరీ కానీ నివాసమే లక్ష్యంగా ధ్వంసం చేసింది. ఈ దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఆడియో టేపులు వెలుగులోకి వచ్చిన తర్వాత మోజ్తాబా ఆరోగ్యంపై అనేక వదంతులు వ్యాపించాయి. ఆయన ఎక్కడా బహిరంగంగా కనిపించలేదు. ఈ క్రమంలో ఇరాన్ ప్రభుత్వ అధికార మీడియా ద్వారా ఆయన ఒక సందేశం పంపించారు. ‘మార్త్యుల రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటాం’అని పేర్కొన్నారు.అమెరికా ప్రతిస్పందనఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మోజ్తాబా గురించి స్పష్టత లేదని తెలిపారు. కొందరు ఆయన తీవ్రంగా గాయపడ్డారని, మరికొందరు ఆయన మరణించారని చెబుతున్నారని పేర్కొన్నారు. ‘మేము ఆయనను ఇప్పటి వరకు చూడలేదు. ఆయన బ్రతికున్నాడో లేదో తెలియదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
మోజ్తబా ఖమేనీ ఆచూకీ : మరో బిగ్ ట్విస్ట్!
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆచూకీ, ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఇప్పట్లో తెరపడేనా? అసలు ఆయన బతికే ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? రష్యా అద్యక్షుడు పుతిన్ నీడలో రక్షణ పొందుతున్నాడనే మరో వార్తహల్ చల్ చేస్తోంది. ఇరాన్ సుప్రీం మోజ్తబా ఖమేనీ సేఫ్టీపై అగ్రనేతలు ఏమంటున్నారు? ఈ విషయాలపై కథనం.అమెరికా, ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య యుద్ధం మూడవ వారంలోకి ప్రవేశించిన వేళ, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆచూకీ , ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు.మోజ్తబా ఖమేనీ ఉనికిపై ఊహాగానాలుఇరాన్పై ఫిబ్రవరి 28న మొదలు పెట్టిన అమెరికా -ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అప్పటి సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమేనీ ఇతర కుటుంబ సభ్యులు మరణించారు. తండ్రి మరణం తర్వాత, 56 ఏళ్ల మోజ్తబా ఖమేనీ ఇరాన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. అయితే, యుద్ధం ప్రారంభంలో జరిపిన దాడుల్లో మోజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం కోమాలో ఉన్నారనే ఊహాగానాలు భారీగా వ్యాపించాయి. అయితే ఈ విషయాలను ఖండించిన ఇరాన్ మోజ్తబా గాయపడినప్పటికీ నాయకత్వ బాధత్యలను నిర్వహించే స్థితిలోనే ఉన్నారని ప్రకటించింది. రష్యాలో చికిత్స ?అయితే ఆయన రష్యాలో చికిత్స పొందుతున్నారని కువైట్ పత్రిక 'అల్-జరీదా' తెలిపింది. దీని ప్రకారం అమెరికా-ఇజ్రాయెల్ బాంబు దాడుల తర్వాత మోజ్తబాను అత్యంత రహస్యంగా ఒక రష్యన్ సైనిక విమానంలో మాస్కోకు తరలించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంలోని ఒక ప్రైవేట్ వైద్య సదుపాయంలో ఆయనకు శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం అక్కడే కోలుకుంటున్నారని సమాచారం. ఇరాన్లో దాడులు కొనసాగుతున్నందున భద్రతా కారణాల దృష్ట్యా ఆయన్ని రష్యాకు తరలించినట్లు తెలుస్తోంది.ఇరాన్‌లోనే ఉన్నారా?మరోవైపు 'ది సన్' పత్రిక కథనం మాత్రం మరోలా ఉంది మోజ్తబా ఇరాన్‌లోని సినా యూనివర్సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడుల్లో ఆయన రెండు కాళ్లు కోల్పోయారని, కాలేయం లేదా కడుపు భాగం తీవ్రంగా దెబ్బతిన్నదని, ఆయన ప్రస్తుతం కోమాలో ఉన్నారని పేర్కొంది.ట్రంప్ , నెతన్యాహు ప్రకటనలుఅయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర అనుమానాలను రేకెత్తించాయి.ఆయన అసలు బతికే ఉన్నారో లేదో నాకు తెలియదు. ఇప్పటివరకు ఎవరూ ఆయన్ని చూడలేదు. ఆయన బతికే ఉంటే, తన దేశం కోసం శరణు కోరడం మంచిదని వ్యాఖ్యానించారు. అంతేకాదు మోజ్తబా సమాచారం కోసం అమెరికా 10 మిలియన్ డాలర్ల రివార్డును కూడా ప్రకటించడం గమనార్హం. మరోవైపు ఇరాన్ నేత మోజ్తబా ఆచూకీపై తమ వద్ద సమాచారం ఉందంటూనే "ఆయన ప్రాణాలకు నేను ఎలాంటి భరోసా (లైఫ్ ఇన్సూరెన్స్) ఇవ్వలేనునీ, అయితే ఖమేనీ ఉన్న ప్రదేశం గురించి ఇజ్రాయెల్‌కు నిఘా సమాచారం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించడం ఈ ఊహాగానాలను మరింత సంక్లిష్టం చేసింది. ఇరాన్ సైనిక కమాండర్లకు కూడా తమ కొత్త నాయకుడి నుండి ఎటువంటి ఆదేశాలు అందడం లేదని, దీంతో ఇరాన్ అంతర్గత గందరగోళం నెలకొన్నట్టు తెలుస్తోంది. మోజ్తబా అందుబాటులో లేని కారణంగా యుద్ధంపై ఆయనకు ఎటువంటి నియంత్రణ లేదని, కమాండర్లకు కూడా ఆయన స్థితిగతులపై స్పష్టత లేదని 'ది టెలిగ్రాఫ్' నివేదించింది.(నెతన్యాహూ కాఫీ వీడియో : షాకింగ్ ‘డీప్‌ఫేక్’ చర్చ)ఖమేనీ పరిస్థితి గురించి సీనియర్ అధికారులు కూడా అనిశ్చితంగా ఉన్నారని ఇరాన్ అధికారి ఒకరు ది టెలిగ్రాఫ్‌తో అన్నారు. "మోజ్తాబా గురించి ఎవరికీ ఏమీ తెలియదు, అతను బతికే ఉన్నాడా లేదా చనిపోయాడా లేదా ఎంత తీవ్రంగా గాయపడ్డాడో. అతను గాయపడ్డాడని చెప్పారు. అతను ఇక్కడ లేనందున అతనికి యుద్ధంపై నియంత్రణ లేదు. మెజారిటీ కమాండర్లకు, లేదా మరింత సరిగ్గా చెప్పాలంటే, అన్ని కమాండర్లకు అతని గురించి ఎటువంటి సమాచారం లేదు." అని ఇరాన్ సీనియర్ అధికారిన ఉటంకిస్తూ టెలిగ్రాఫ్ వెల్లడించింది.అలాగే సుప్రీం లీడర్ పేరుతో విడుదలైన మొదటి ప్రకటన ఆయన రాసింది కాదని, భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ రాసి ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి మోజ్తబా ఖమేనీ ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ పరిస్థితి ఇరాన్ రాజకీయ , సైనిక వ్యూహాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఇదీ చదవండి: అమ్మానాన్నకు సర్ప్రైజ్ గిఫ్ట్ : ఎమోషనల్ వీడియో -
మొజ్తబాకు నోపో కవచం
శత్రు శేషం, రుణ శేషం, వ్రణ శేషం, అగ్ని శేషం ఉండకూడదంటారు. ఇరాన్ నూతన సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ విషయంలో అమెరికా కూడా ఈ సూత్రాన్నే పాటించే ప్రయత్నంలో ఉంది. తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మాదిరిగానే మొజ్తబాను కూడా అంతం చేయాలని చూస్తోంది. కానీ అదంత సులువు కాదని ఇరాన్ ధీమాగా చెబుతోంది. అందుకు కారణం ఒక్కటే. మొజ్తబా చుట్టూ ఉన్న అత్యున్నత రహస్య భద్రతా కమెండో విభాగం ‘నోపో’! ఏమిటీ నోపో? నోపో ఇరాన్ ప్రత్యేక రహస్య భద్రతా దళం. పార్సీ భాషలోని ‘నిరోయే విజేహ్ పాస్దరాన్ వేలాయత్’కు సంక్షిప్త రూపం. అంటే ‘పాలకులను కాపాడే ప్రత్యేక దళం’ అని చెప్పొచ్చు. ఇరాన్ పోలీస్ వ్యవస్థలో ఒక విభాగంగా నోపోను దశాబ్దాల క్రితం ఏర్పాటుచేశారు. మెరుపు వేగంతో పనిముగించే మెరికల్లాంటి కమెండోలు ఇందులో ఉంటారు. 1979లో ఇరాన్లో ‘ఇస్లామిక్ చైతన్యం’ తర్వాత తొలి సుప్రీం నేతగా ఆవిర్భవించిన అయతొల్లా రుహొల్లా ఖమేనీ కాలంలో తిరుగుబాటుదారుల నుంచి అగ్ర నేతల రక్షణ నిమిత్తం 28వ రొహల్లా డివిజన్ నుంచి నోపోను ఏర్పాటు చేశారు. ఇరాన్లో అత్యంత శక్తిమంతమైన, పలుకుబడి గల సాయుధ విభాగమైన రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్జీసీ)తో కూడా నోపోకు సంబంధం ఉండదు.కేవలం అగ్ర నేతల భద్రతపైనే ఇది దృష్టి సారిస్తుంది. వారిని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతుంది. నోపో కమెండోల పని పూర్తిగా గోప్యంగానే కొనసాగుతుంది. ప్రమాదాన్ని పసిగట్టి ముందస్తు వ్యూహాలు రచించి అమలు చేయడం, పరిస్థితి హఠాత్తుగా అదుపు తప్పితే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లడం ఈ దళం ప్రత్యేకత. నాలుగు నోపో బ్రిగేడ్లు మొజ్తబా రక్షణలో నిరంతరం నిమగ్నమైనట్టు తెలు స్తోంది. మహ్ షాద్, ఇస్ఫహాన్ అణుకేంద్రాల భద్రత కోసం మరో రెండు యూ నిట్లు పని చేస్తున్నట్టు సమా చారం. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో పాల్గొనడం, బందీ లను విడిపించడం, ప్రభుత్వ భవనాలతోపాటు వ్యూహాత్మక ప్రదేశాలకు రక్షణ కలి్పంచడం వంటి విధులను కూడా నోపో చూస్తుందని యుద్ధ రంగ నిపుణులు చెబుతున్నారు. కఠిన శిక్షణ యుక్త వయసులో ఉండి శరవేగంగా స్పందించగల నైపుణ్యం, తెలివితేటలు, దేహదారుఢ్యం, సాంకేతికతపై పట్టు, గురిపెట్టి కాల్చే నైపుణ్యం... ఇలా పలు అర్హతలున్న వారిని అన్నిరకాలుగా వడపోసిన అనంతరం నోపోలోకి తీసుకుంటారు. సాధారణ పోలీస్ శిక్షణలో అత్యంత ప్రతిభ కనబర్చిన వాళ్లను నోపో కోసం ఎంపిక చేస్తారు. వారికి మళ్లీ కఠినమైన కమెండో శిక్షణ ఇస్తారు. నోపో మాజీ కమెండో హొస్సేన్ అమ్జాదియాన్ గతంలో ఒక ఇంటర్వ్యూలో ఈ వివరాలను వెల్లడించారు. ‘‘అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ అవలీలగా పని ముగించే తెగువ, నైపుణ్యం నోపో కమెండోల సొంతం. కఠినమైన కమెండో శిక్షణ పూర్తయ్యాక కూడా సభ్యుని ప్రవర్తనపై అనుమానముంటే తక్షణం విధుల నుంచి తప్పిస్తారు.స్వీయరక్షణ విద్యతో పాటు మార్షల్ ఆర్ట్స్ సైతం వచ్చి ఉండాలి. స్నైపర్ షూటింగ్లో నైపుణ్యముండాలి. పరిసరాలను డేగ కళ్లలో గమనిస్తుండాలి. అగ్ర నేతల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసే తెగువ కావాలి’’ అని ఆయన చెప్పారు. 1999– 2022 మధ్య ఇరాన్లో సంక్షోభం లేవదీసేందుకు జరిగిన పలు ప్రయత్నాలను వమ్ము చేసేందుకు ఖమేనీ ప్రభుత్వం నోపో కమెండోలను విజయవంతంగా ఉపయో గించినట్టు గతంలో వార్తలొచ్చాయి. ‘‘దేశం పట్ల అత్యంత అంకితభావం చూపడమే నోపో సభ్యుల ప్రాథమిక లక్షణం’’ అని పారిస్ కేంద్రంగా పనిచేసే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇరాన్ (ఎన్సీఆర్ఐ) పార్టీ నేత అలీ సఫావీ చెప్పారు. నోపో అరాచకాలకు పాల్పడుతోందని, మానవహక్కులను హరిస్తోందని అమెరికా ఆరోపించింది. 2021లోనే నోపోపై ఆంక్షలు విధించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వీళ్లను పట్టిస్తే కోటీశ్వరులైపోవచ్చు.. ఏకంగా రూ.93 కోట్లు
వాషింగ్టన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సహా ఆ దేశంలోని పలువురు ఉన్నతాధికారుల గురించి సమాచారం ఇచ్చిన వారికి 10 మిలియన్ డాలర్లు (రూ.92,47,48,000) బహుమతి ఇస్తామని అమెరికా ప్రకటించింది. యుద్ధం మరింత ముదురుతున్న పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రోత్సాహకాన్ని అమెరికా విదేశాంగ శాఖ నిర్వహించే “రివార్డ్స్ ఫర్ జస్టిస్” కార్యక్రమం ద్వారా ప్రకటించింది.రివార్డు ఉన్న వ్యక్తుల జాబితాలో మొజ్తబా ఖమేనీతో పాటు కీలక నేతలు, అధికారులు అలీ అస్గర్ హిజాజీ, యాహ్యా రహీమ్ సఫవి, అలీ లరిజాని, ఎస్మాయిల్ ఖతీబ్ ఎస్కందర్ మొమెని ఉన్నారు. ఈ నాయకులపై సమాచారం ఇచ్చే వారికి అమెరికా బహుమతి ప్రకటించింది.అమెరికా ఈ నాయకులకు వేర్వేరుగా కచ్చితమైన మొత్తాన్ని బహుమతిగా ప్రకటించలేదు. అమెరికా చెప్పింది ఒక్కటే.. ఎవరైనా తమకు ఇచ్చే సమాచారం ఉపయోగపడితే “గరిష్ఠంగా $10 మిలియన్ (సుమారు రూ.92-93 కోట్లు) వరకు” బహుమతి ఇవ్వవచ్చు.రివార్డ్స్ ఫర్ జస్టిస్ ప్రోగ్రాం అంటే అమెరికా మీద ఉగ్రదాడులు చేసినట్లు అనుమానించే వ్యక్తులను గుర్తించేందుకు సమాచారం ఇచ్చిన వారికి డబ్బు బహుమతి ఇచ్చే కార్యక్రమం. మొజ్తబా ఖమేనీ సహా పలువురు ఉన్నతాధికారులను “ఇరానియన్ టెర్రరిస్టులు”గా పేర్కొంటూ అమెరికా ఒక ప్రకటనలో వివరాలు తెలిపింది.“ఈ వ్యక్తులు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ)లో వివిధ విభాగాలను నడిపిస్తున్నారు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర చర్యలకు ప్రణాళికలు వేసి, అమలు చేస్తుంది” అని చెప్పింది.“ఈ ఐఆర్జీసీ నాయకులు లేదా దాని విభాగాలపై సమాచారం తెలిసినవారు ఆ విషయాన్ని టోర్ ఆధారిత టిప్‌లైన్ లేదా సిగ్నల్ ద్వారా మాకు పంపండి. సమాచారం ఇచ్చిన వారికి బహుమతి లభించే అవకాశం ఉంటుంది” అని తెలిపింది.టోర్ అంటే ఇంటర్నెట్లో గుర్తింపును దాచుతూ సమాచారాన్ని పంపే సాంకేతిక వ్యవస్థ. సిగ్నల్ అంటే గోప్యంగా సందేశాలు పంపే ఎన్క్రిప్షన్ ఆధారిత మెసేజింగ్ యాప్. -
తీవ్ర గాయాలతో కోమాలో ఖమేనీ? సంచలనంగా బ్రిటీష్ మీడియా కథనాలు
ఇరాన్ కొత్త అత్యున్నత నాయకుడు మోజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) ఆరోగ్య పరిస్థితిపైపలు అనుమానాలు హల్చల్ చేస్తున్నాయి. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న భిన్నమైన కథనాల ప్రకారం శత్రు పక్షం దాడిలో మోజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని కాలు తీసేసారని, కోమాలో ఉన్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ధృవీకరణఘేదీ లేనప్పటికీ ఇప్పటివరకు ప్రజల ముందుకు రాకపోవడం ఈ అనుమానాలను బలపరుస్తోంది.ది సన్ నివేదిక ప్రకారం, మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని బ్రిటీష్ పత్రిక 'ద సన్' (The Sun) నివేదించింది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హత్యకు గురైన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ 56 ఏళ్ల కుమారుడు మోజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడి ,ప్రస్తుతం టెహ్రాన్‌లో చికిత్స పొందుతున్నాడని నివేదించింది. తండ్రిమరణానికి దారి తీసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఖమేనీకి ఒక కాలు (లేదా రెండు కాళ్లు) తొలగించారని, కాలేయం లేదా కడుపు భాగంలో తీవ్రమైన గాయాలయ్యాయని సమాచారం. ప్రస్తుతం ఆయన టెహ్రాన్‌లోని సినా యూనివర్సిటీ హాస్పిటల్లో కోమాలో ఉన్నట్లు ఆ వార్తలు పేర్కొంటున్నాయి.దీనికి తోడు ఇరాన్ సుప్రీంగా ఎన్నికైన తరువాత తొలిసారి మొజ్తబా ఖమేనీ పేరుతో ఒక ప్రకటన జారీ అయింది. ఈ కొత్త ఫోటోలను ఇరాన్ మీడియా విడుదల చేసినప్పటికీ, అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో సృష్టించినవి లేదా పాత ఫోటోలను ఎడిట్ చేసినవనీ చాలా సంస్థలు అనుమానిస్తున్నాయి.అయితే ఏఐ ఫోటో అన్న ఆరోపణలను ఇరాన్ ప్రభుత్వ అధికారులు, అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ కుమారుడు యూసుఫ్ ఖండించారు. మొజ్తబా ఖమేనీ "సురక్షితంగా, ఆరోగ్యంగా" ఉన్నారని , భద్రతా కారణాల దృష్ట్యా రహస్య ప్రదేశంలో ఉన్నారని పేర్కొన్నారు. (ఇరాన్ వార్ : ట్రంప్ సరికొత్త వార్నింగ్)మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంపై స్పందిస్తూ, ఖమేనా గాయపడి ఉండవచ్చు, కానీ ఏదో ఒక రూపంలో బ్రతికే ఉన్నారని భావిస్తున్నానంటూ వ్యాఖ్యానించడంతో అసలు మొజ్తబా ఖమేనీ సజీవంగా ఉన్నారా లేదా అనుమానాలు మరింతగా చెలరేగాయి. అయితే ఖమేనీ కోమాలో ఉన్నట్లు వస్తున్న వార్తలకు అదికారిక ధృవీకరణ ఏదీ లేదుకాగా ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో (Operation Epic Fury) మొజ్తబా ఖమేనీ తండ్రి అలీ ఖమేనీనికోల్పోయిన సంగతి తెలిసిందే. అలాగే తల్లి, భార్యను, కొడుకును, అక్కను, ఆమె భర్తను, వారి పిల్లలు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.ఇదీ చదవండి: మోజ్తాబా ఖమేనీని ఖతం చేస్తాం.. నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలు -
మొజ్తాబా ఖమేనీ సంచలన ప్రకటన
-
కోమాలో మొజ్తాబా ?
దుబాయ్: తండ్రి అయతొల్లా ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ నూతన సుప్రీంనేత పీఠంపై కూర్చున్న మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంగా నీలినీడలు తొలగిపోవట్లేదు. ఫిబ్రవరి 28నాటి దాడిలో తండ్రి, తల్లి, సోదరి, భార్య, కుమారుడు చనిపోగా మొజ్తాబా ఒక కాలును కోల్పోయారని గురువారం అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.బాంబుదాడిలో ఆయన పొత్తి కడుపు లేదా లివర్ తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆ కారణంగా ప్రస్తుతం కోమాలోకి వెళ్లిపోయారని ‘ది సన్’ వార్తాసంస్థ ఒక కథనం ప్రచురించింది. కోమాలోంచి ఆయన కోలుకోవడం కష్టమేనని విశ్వసనీయ వర్గాలు చెప్పాయని, ప్రస్తుతం టెహ్రాన్ నగరంలోని సినా విశ్వవిద్యాలయ ఆస్పత్రిలోని ఐసీయూలో ఆయన చికిత్స పొందుతున్నారని ఆ కథనంలో వెల్లడించింది. ఆస్పత్రిలోని వ్యక్తులు లండన్‌లోని తమ వర్గీయులకు పంపిన సందేశంలో ఈ సమాచారం లీక్ అయినట్లు భోగట్టా. -
మొట్టమొదటి మెసేజ్.. మొజ్తాబా ఖమేనీ సంచలన ప్రకటన
టెహ్రాన్: యుద్ధం వేళ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తాబా ఖమేనీ మొట్టమొదటిసారి అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. హోర్ముజ్ జలసంధి మూసివేతను ఒత్తిడి పెంచే సాధనంగా ఉపయోగించాలని తమ అధికారులకు చెప్పారు. గల్ఫ్, అరబ్, పొరుగు దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.మొజ్తాబా ఖమేనీ నియామకం తర్వాత ఆయన నుంచి వచ్చిన ఈ మొట్టమొదటి ప్రకటనను ఆ దేశ టెలివిజన్‌లో గురువారం చదివారు. ఖమెనీ కెమెరా ముందు కనిపించలేదు. యుద్ధం ప్రారంభంలో ఆయన గాయపడ్డారని ఇజ్రాయెల్ అంచనా వేసిన విషయం తెలిసిందే. ఖమేనీ ఇప్పుడు కూడా ఏ మాత్రం తగ్గకుండా గల్ఫ్, అరబ్ పొరుగు దేశాలపై దాడులు కొనసాగుతాయని చెప్పారు. అమెరికా సైనిక స్థావరాలను మూసివేయాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.మరోవైపు, ఇవాళ కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై పలు డ్రోన్ల దాడి జరిగింది. దీనిపై కువైట్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ప్రకటన చేసింది. భౌతిక నష్టాన్ని మాత్రమే కలిగించిందని చెప్పింది. పూర్తి సమన్వయంతో వ్యవహరించి సమస్యను అధికారులు పరిష్కరించారని చెప్పింది.అలాగే, బహ్రెయిన్, కువైట్, యూఏఈ, సౌదీ అరేబియాపై దాడులకు ఇరాన్ యత్నించింది. విదేశీ చమురు ట్యాంకర్లనూ లక్ష్యంగా చేసుకుంటోంది. దీంతో ఇరాక్ అప్రమత్తమై పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. చమురు పోర్టు కార్యకలాపాలను మూసివేసినట్లు ప్రకటించింది. చమురు ధరలపై ఇవాళ ఉదయం ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. త్వరలో చమురు బ్యారెల్ ధర 200 డాలర్లకు చేరుకుంటుందని, ప్రపంచం దానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. -
మొజ్తాబా నా మాట విను : డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా చేస్తున్న ప్రధాన డిమాండ్లలో ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తిగా వదులుకోవాలి. ఆ డిమాండ్‌ను తిరస్కరిస్తే, కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీయే లక్ష్యంగా చేసే దాడులకు తాను మద్దతు ఇస్తానని ట్రంప్ స్పష్టంగా పేర్కొన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది.37 ఏళ్ల పాటు ఇరాన్‌ను ఒంటిచేత్తో పాలించిన అయతుల్లా అలీ ఖమేనీ జీవితం విషాదాంతమైంది. ఫిబ్రవరి 28న టెహ్రాన్‌లో అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతుండగా, ఇజ్రాయెల్ సైన్యం ‘బ్లూ స్పారో’ అనే ఖండాంతర క్షిపణిని ప్రయోగించి దాడి చేసింది. ఆ దాడిలో అయతుల్లా ఖమేనీ మరణించారు. ఇజ్రాయెల్ ఎలా మిలటరీ ఆపరేషన్ చేపట్టిందో, అదే తరహా చర్యలు మోజ్తబా ఖమేనీపై కూడా జరగవచ్చని అమెరికా అధికారులు హెచ్చరిస్తున్నారు.అలీ ఖమేనీ మరణం తర్వాత, ఆయన రెండవ కుమారుడు మోజ్తబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకోవడంపై ట్రంప్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోజ్తబా ఖమేనీ ప్రశాంతంగా జీవిస్తారని నేను నమ్మను’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మోజ్తబా నియామకానికి ముందు, అమెరికా ఇరాన్ తదుపరి నాయకుడి ఎంపికలో కూడా తమకు పాత్ర ఉండాలని పట్టుబట్టింది. వెనిజువెలా పాలనా పరమైన అంశాల్లో అమెరికా జోక్యం చేసుకున్నట్లే, ఇరాన్లో కూడా అదే విధంగా ప్రభావం చూపాలని ట్రంప్ కోరుకున్నారు.అయితే, దివంగత అయతుల్లా ఖమేనీ తన వీలునామాలో మోజ్తబా తన వారసుడిగా రావాలని కోరుకోలేదని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఒత్తిడితో మోజ్తబా ఎంపిక లాంఛనమైంది. ఇదే అంశంపై ఇరాన్ ప్రతిపక్ష గ్రూప్ ‘నేషనల్ యూనియన్ ఫర్ డెమోక్రసీ రీసెర్చ్’ డైరెక్టర్ ఖోస్రో ఇస్ఫహానీ మాట్లాడుతూ..‘ఖమేనీ తన కుమారుడిని వారసుడిగా కోరుకోలేదు. ఆయన వీలునామాలో మోజ్తబాను వారసుడిగా పేర్కొనవద్దని స్పష్టంగా రాశారు’ అని తెలిపారు. -
తుది దశకు యుద్ధం.. ట్రంప్ గుడ్‌న్యూస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఇరాన్‌తో యుద్ధం ముగిస్తామని అన్నారు. ఇప్పటికే ఇరాన్‌లోని అన్ని లక్ష్యాలను ఛేదించామని తెలిపారు. ఇప్పుడు కొత్తగా టార్గెట్ చేయడానికి ఇరాన్ దగ్గర ఇంకేమీ మిగల్లేదని అన్నారు. తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడు యుద్ధం ఆగుతుందని చెప్పారు.కాగా, ఇరాన్ నౌకాదళం పనిచేస్తున్న పోర్టుల దగ్గరకు వెళ్లవద్దని అమెరికా సైన్యం పౌరులను హెచ్చరించింది. ఆ ప్రాంతాల్లో భద్రతకు హామీ ఇవ్వలేమని తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ ఇరానీ డాక్ కార్మికులు, పరిపాలనా సిబ్బంది, వాణిజ్య నౌకల సిబ్బంది ఇరాన్ నేవీ నౌకలు దగ్గరికి, సమీప సైనిక ప్రాంతాల వద్దకు వెళ్లవద్దని సూచించింది. అమెరికా దళాలు ఇరాన్ నౌకాదళ ఆస్తులపై దాడులు కొనసాగిస్తున్న సమయంలో యూఎస్ ఈ హెచ్చరిక చేసింది. ఇప్పటివరకు సుమారు 60 ఇరానీ నౌకలు ధ్వంసం చేశామని అమెరికా తెలిపింది.మరోవైపు, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. దాడుల్లో కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ గాయపడినట్లు ప్రచారం జరుగుతోంది. ఖమేనీ కాలికి ఫ్రాక్చర్, ఎడమ కంటి వద్ద గాయాలైనట్లు సమాచారం. అయితే, గత ఏడాది జరిగిన హత్యాప్రయత్నంలోనే ఖమేనీ గాయపడ్డారని ఇజ్రాయెల్ అంటోంది. ఇప్పటి వరకు ప్రజల ముందుకు మొజ్తబా ఖమేనీ రాలేదు. -
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఎంపికలో బిగ్ ట్విస్ట్!
టెహ్రాన్: ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌గా అయతుల్లా సయ్యద్ మొజ్తాబా ఖమేనీ ఎంపిక విషయంలో బిగ్‌ట్విస్ట్ చోటు చేసుకుంది. తన కుమారుడు తన వారసుడిగా కొనసాగడం తనకు ఇష్టం లేదని అయతుల్లా అలీ ఖమేనీ వీలునామా రాసినట్లు తెలుస్తోంది.అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన అయతుల్లా అలీ ఖమేనీ స్థానంలో మొజ్తాబాను ఇరాన్ నిపుణుల అసెంబ్లీ ఎన్నుకుంది. అయితే ఈ మొజ్తాబా ఎన్నికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు పలువురు పెదవి విరిస్తున్నారు. తాజాగా, ట్రంప్ మాత్రమే కాదు మొజ్తాబా తండ్రి, మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి సైతం ఇష్టం లేదని ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. తన కుమారుడు మొజ్తాబా ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు అర్హతలు లేవని, గతంలో పలు మార్లు చెప్పిన ఆయతుల్లా వ్యాఖ్యల్ని ఊటంకిస్తూ తాజాగా, పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కథనాల్లో తన వారసుడిగా మొజ్తాబా అనర్హుడంటూ గతంలో చెప్పిన విషయాన్ని తాజాగా న్యూయార్స్ టైమ్స్ కథనంలో పేర్కొంది. అయినప్పటికీ, వడ్డించే వాడు మనవాడయితే.. బంతి చివర్లో కూర్చున్నా కంచంలో అన్నీ వచ్చి చేరతాయని సామెత చందంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఒత్తిడి మేరకు మొజ్తాబా ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎన్నుకోవడం అనివార్యమైంది.ఇరాన్‌లోని ప్రస్తుత ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య మార్పు కోసం కృషి చేస్తున్న నేషనల్ యూనియల్ ఫర్ డెమోక్రసీ ఇన్ ఇరాన్ (ఎన్యూడీఐ) రీసెర్చ్ డైరెక్టర్ ఖోస్రో ఇస్ఫహానీ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఖోస్రో మాట్లాడుతూ.. మొజ్తాబాకు ఇరాన్‌ను నడిపించే శక్తి సామర్ధ్యాలు, అనుభవం, రాజకీయ అనుభవం లేదు. మొజ్తబా రాజకీయంగా ప్రభావం చూపలేకపోయాడు. చెప్పుకోదగ్గ విజయాలు సాధించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు.ఇరాన్ నాయకత్వ వారసత్వాన్ని సాధారణంగా సుప్రీం నాయకుడిని ఎన్నుకునే బాధ్యత షియా మత పెద్దలతో కూడిన కమిటీ (అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్)కి ఉంది. మొజ్తాబా నియామకం అసెంబ్లీ ఎక్స్పర్ట్స్ కమిటీ నిబంధనలకు అనుగుణంగా ఎన్నిక జరగలేదు. బదులుగా, గత వారం ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎవరు అనే అంశంపై చర్చలు జరిగాయి. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో ఐఆర్జీసీ తరుఫు ప్రతినిధులు సైతం హాజరయ్యారు. వారే కమిటీ సభ్యులపై ఒత్తిడి తెచ్చి మొజ్తాబాను ఎన్నుకునేలా చేశారని చెప్పారు.ఇరాన్ ఇంటెలిజెన్స్ వర్గాలతో మాకు మంచి సంబంధాలున్నాయి. ఖమేనీ స్థానంలో మరొకరిని ఎంపిక చేయాల్సిన నిపుణుల సభ మొజ్తాబాకు ఓటు వేయలేదు. అతనిపై చాలా వ్యతిరేకత ఉంది. కానీ ఐఆర్జీసీ ఒత్తిడితో, అతన్ని వారసుడిగా పేర్కొన్నారు. సుప్రీం లీడర్ అంటే తాము చెప్పినట్లు నడుచుకునే నాయకుడే కావాలని ఐఆర్జీసీ చూస్తోంది. అందుకే మొజ్తాబాను ఎంచుకుంది. ఐఆర్జీసీ ఏది చెబితే అది చేసే మనస్తత్వం మొజ్తాబాది. ఐఆర్జీసీ ఆయన్ని ఓ తోలు బొమ్మలా చూస్తోందని’ ఆరోపించారు. -
కొత్త సుప్రీం మొజ్జబా ఖమేనీపై రగులుతున్న ఇరాన్
-
ట్రంప్‌నకు కోపం తెప్పించే పని చేసిన పుతిన్
టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తబా ఖమేనీకి వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం మొజ్తబా ఖమేనీకి మద్దతు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో అలీ ఖమేనీ మరణించారు. అలీ ఖమేనీ కుమారుడే మొజ్తబా ఖమేనీ.మొజ్తబాకు పుతిన్ ఓ సందేశం పంపారు. “ఇరాన్‌కు మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఇరాన్‌లోని మిత్రులతో ఐక్యంగా ఉంటాం. ఇరాన్‌కు రష్యా విశ్వసనీయ భాగస్వామిగా ఉంది. భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటుంది. ఇరాన్ దాడులను ఎదుర్కొంటున్న ఈ సమయంలో మీ పదవీకాలంలో మీకు చాలా ధైర్యం, అంకితభావం అవసరం” అని తెలిపారు.తాజాగా, డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్లకు పుతిన్ వ్యాఖ్యలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు ఉండడం తనకు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఇరాన్లో సామరస్యం, శాంతిని తీసుకువచ్చే నేత కావాలని చెప్పారు. తమ ఆమోదం లేకపోతే అతను ఎక్కువ కాలం నిలవడని అన్నారు. అలాగే, ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించడం గమనార్హం. యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు..కాగా, ప్రజల ముందుకు మొజ్తబా ఖమేనీ అంతగా రారు. తన 56 సంవత్సరాల జీవితంలో అదే తీరును అవలంభించారు. అయితే, ఇరాన్లో చెలరేగిన నిరసనలను అణచివేయడంలో మొజ్తబా పాత్ర ఉంది. గత తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. సోమవారం ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్‌పై మళ్లీ దాడులు ప్రారంభించింది. బీరూట్‌లో హిజ్బుల్లా మౌలిక వసతులపై కూడా దాడి చేసింది.దీనికి ముందు రోజు టెహ్రాన్ చమురు నిల్వ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్ ప్రతిగా ఇజ్రాయెల్‌పై, పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలపై దాడులు చేస్తోంది. ఆదివారం సౌదీ అరేబియాలోని ఓ నివాస ప్రాంతంలో ఒక ఆయుధం పడటంతో ఒక భారతీయుడు సహా ఇద్దరు విదేశీయులు మరణించారు.ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో మొజ్తబా తండ్రి అలీ ఖమేనీతో పాటు తల్లి, కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ మీడియా నివేదికల ప్రకారం.. మొజ్తబా భార్య పేరు జహ్రా హద్దాద్-అదెల్, ఆయన కుమారుల్లో ఒకరు దాడుల్లో మరణించారు. మొజ్తబాకు ఒక కుమార్తె కూడా ఉంది. మొత్తం ముగ్గురు పిల్లలు. -
ట్రంప్‌నకు హైబీపీ తెప్పించిన ఇరాన్!
ఇరాన్ అధికారికంగా మోజ్తాబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా ప్రకటించింది. ఆయన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. తీవ్ర తర్జన భర్జనల తర్వాత (మార్చి 8–9, 2026) ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆయన వారసుడిగా మోజ్తాబానే ఎన్నుకుంది.ఇరాన్ చరిత్రలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఆ దేశ అత్యున్నత మతపరమైన మండలి తమ కొత్త నాయకుడిగా ఖమేనీ తనయుడు సయ్యద్ మోజ్తాబాను (అలీ ఖమేనీ రెండవ కుమారుడు)ని ఎన్నుకుంది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత మొదటిసారి సుప్రీం లీడర్ పదవి తండ్రి నుండి కుమారుడికి వారసత్వంగా వెళ్లడం ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోదగ్గ విషయం.అయితే ఇరాన్లో సాధారణంగా సుప్రీం లీడర్‌ను మతపరమైన మండలి ఎన్నుకుంటుంది. కానీ ఈసారి తండ్రి నుండి కుమారుడికి పదవి రావడం హెరిడిటరీ సక్సెషన్ (వంశపారంపర్య వారసత్వం)పై విమర్శలు వెల్లువెత్తవచ్చని అంతా భావించారు. దీనికి తోడు.. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. మోజ్తాబా ఎంపిక అంశంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇరాన్లో వారసత్వ ఎంపిక ఏ రకంగానూ చెల్లదని, మోజ్తాబా ఒక మూర్ఖుడు అని, ఆ పదవికి అనర్హుడని, ఇరాన్ కొత్త నాయకుడిని ఆ దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జరపాలని, ఆ ఎంపికలో తమ దేశ ప్రమేయం(తనకు అనుకూలంగా ఉండాలనే..) ఉంటుందని ప్రకటించారు. వాషింగ్టన్ ఆమోదం లేకుండా ఇరాన్ గద్దెపై ఎవరు కూర్చున్నా, వారు ఎక్కువ కాలం నిలబడలేరని ఆయన హెచ్చరించారు.🚨 BREAKING: The Islamic regime of Iran just named Ali Khamenei's SON as the NEW SUPREME LEADER — Mojtaba KhameneiPresident Trump has already said he is an "UNACCEPTABLE" successor to Ali Khamenei"Everybody that seems to want to be a leader, they end up DEAD!"How long will… pic.twitter.com/2MiCYtXrxT— Eric Daugherty (@EricLDaugh) March 8, 2026కాగా, ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ చాలా తేలికగా తీసుకుంది. ప్రాంతీయ యుద్ధ పరిస్థితుల్లో.. మోజ్తాబా ఎంపికే సరైందని భావించింది. అయితే ఆ ప్రకటన తర్వాత ఇరాన్ అంతటా అనూహ్య పరిస్థితులు కనిపించాయి. వ్యతిరేకతకు బదులు.. ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆనందం వ్యక్తం చేశారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), సైనిక ప్రధాన సిబ్బంది మోజ్తాబాకు మద్దతు ప్రకటించారు. ఇది అగ్రరాజ్యం, ఇజ్రాయెల్ ఏమాత్రం ఊహించిన ఉండకపోవచ్చు!.56 ఏళ్ల వయసున్న మోజ్తాబా ఖమేనీ గతంలో ఎన్నికైన పదవులు చేపట్టకపోయినా, తన తండ్రి కార్యాలయం ద్వారా సైనిక, భద్రతా వ్యవస్థలపై ప్రభావం చూపుతూ వచ్చారు. అలాగే హెజ్బొల్లా లాంటి అమెరికా-ఇజ్రాయెల్ వ్యతిరేక గుంపులతోనూ ఆయన సంబంధాలు కలిగి ఉన్నారు. అయితే మోజ్తాబా, డొనాల్డ్ ట్రంప్ మధ్య సంబంధం తీవ్ర ప్రతిస్పందనలతో నిండింది. మోజ్తాబాపై పలు రాజకీయ(ఎన్నికల్లో అవకతవకలు, అవినీతి సంబంధిత) విమర్శలు ఉన్నా.. కరడుగట్టిన ట్రంప్ వ్యతిరేకి అనే ముద్ర కూడా ఉంది. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో మోజ్తాబా నియామకమే సరైందని భావించి.. అమెరికాకు ప్రత్యక్ష సవాలు విసిరింది ఇరాన్.మొత్తంగా.. మోజ్తాబా నియామకంతో ఇరాన్ మతపరమైన నాయకత్వం “సమరాన్ని ఎంచుకుంది, రాజీని కాదు” అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ట్రంప్ మోజ్తాబాను “అంగీకరించలేని నాయకుడు” అని చెబుతున్నారు. కాబట్టి తాజా నిర్ణయం ఆయనకు మరింత మంట పుట్టించి తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేయించే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో ఉద్రిక్తతలకు ధీటుగానే స్పందించాలనే ధోరణిని మోజ్తాబా కొనసాగించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్లో జరిగిన నాయకత్వ మార్పు .. మధ్య ప్రాచ్యంలో(మిడిల్ఈస్ట్లో) ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది. -
ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఆయనే.. అధికారిక ప్రకటన
టెహ్రాన్: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అలీ ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎంపిక పూర్తయింది. దేశ తదుపరి సుప్రీంగా అయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు 56 ఏళ్ల మొజ్తాబా ఖమేనీ (Ayatollah Ali Khamenei)ఎన్నికైనట్టు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. కాగా, ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. ముజ్తబాకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC)తో బలమైన సంబంధాలు ఉన్నాయి.ముజ్తాబా గాయం? తండ్రి ఖమేనీని పొట్టన పెట్టుకున్న ఇజ్రాయెల్ దాడిలో ముజ్తాబా సైతం గాయాలపాలైనట్టు తాజాగా కథనాలు వెలువడ్డాయి. ఆ దాడిలో ఖమేనీతోపాటు పలువురు అగ్ర నేతలు, సైనిక జనరల్స్ చనిపోయారు. ఆ భేటీలో ముజ్తాబా సైతం ఉన్నట్టు చెబుతున్నారు. ఆయన భార్య జహ్రా హద్దద్ అదెల్ కూడా ఆ దాడిలో చనిపోయారు. ముజ్తాబా గాయపడ్డారన్న వార్తలను ఇరాన్ వర్గాలు ఖండించాయి. ఆ రోజు ఆయన టెహ్రాన్ నగరంలోనే లేరని పేర్కొన్నాయి. శక్తివంతమైన సాయుధ విభాగం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ)పై ముజ్తాబాకు పట్టుంది. ఆ పలుకుబడితో సుప్రీం నేతగా తననే ఎన్నుకునేలా ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్’ మెజారిటీ సభ్యులతో ఆయన మంతనాలు జరిపినట్టు వార్తలొచ్చాయి. -
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్.. ఇతనే?
-
కాబోయే సుప్రీం మొజ్తబా ఖమేనీ..దిమ్మదిరిగే వ్యాపార సామ్రాజ్యం
ఇరాన్ (Iran) సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి కాబోయే వారసుడిగా ప్రచారంలో ఉన్న ఆయన రెండో కుమారుడు 56 ఏళ్ల ఈ మత గురువు మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) విదేశాల్లో విస్తరించిన ఆయన వ్యాపార సామ్రాజ్యం ఇపుడు నెట్టింట్ చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ తన అణు కార్యక్రమం కారణంగా గత రెండు దశాబ్దాలుగా చరిత్రలోనే అత్యంత కఠినమైన ఆంక్షలను ఎదుర్కొంటున్నప్పటికీ, ఆ దేశ ఉన్నత వర్గాలు విదేశాలకు మూలధనాన్ని ఎలా తరలించగలిగాయో ఖమేనీ విదేశీ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో చూస్తే అర్థం అవుతుంది అంటోంది తాజా నివేదిక.ప్రముఖ పాశ్చాత్య గూఢచార సంస్థ అంచనా ప్రకారం ఉత్తర లండన్‌లోని "బిలియనీర్స్ రో" అని పిలువబడే వీధిలో, పొడవైన కంచెలు, మూసివేసిన గేట్ల వెనుక చాలా వరకు ఖాళీగా ఉన్న కొన్ని భవనాలు ఉన్నాయి. ది బిషప్స్ అవెన్యూలోని ఈ విలాసవంతమైన ఇళ్ల ముఖభాగాల వెనుక టెహ్రాన్ నుండి దుబాయ్ , ఫ్రాంక్ఫర్ట్ వరకు విస్తరించి ఉన్న ఒక నెట్వర్క్ ఉంది. అనేక బినామీ కంపెనీల ద్వారా, దీని అంతిమ యాజమాన్యం మధ్యప్రాచ్యంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరైన ఇరాన్ సర్వోన్నత నాయకుడి రెండవ కుమారుడు మొజ్తబా ఖమేనీదే అని చెబుతోంది.యువ ఖమేనీ తన ఆస్తులను తన సొంత పేరు మీద పెట్టడానికి ఇష్టపడకపోయినప్పటికీ, విస్తారమైన పెట్టుబడుల సామ్రాజ్యాన్ని నిర్మించారని, కొన్ని కనీసం 2011 నాటివి అని అంచనా. గ్లోబల్‌గా విస్తరించిన అతని ఆస్తులు విలువ పర్షియన్ గల్ఫ్ షిప్పింగ్ నుండి స్విస్ బ్యాంక్ ఖాతాలుదాకా విస్తరించి ఉన్నాయని భావిస్తున్నారు. 2019లో అతనిపై అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ, ఈ సంస్థల నెట్వర్క్ మొత్తం కలిసి ఖమేనీకి నిధులను బిలియన్ల డాలర్లను పాశ్చాత్య మార్కెట్లలోకి మళ్లించారు.ముఖ్యమైన ఆస్తులుమొజ్తబా ఖమేనీ లండన్, దుబాయ్, జర్మనీ మరియు స్పెయిన్ వంటి దేశాల్లో వందల మిలియన్ డాలర్ల విలువైన విలాసవంతమైన భవనాలు, హోటళ్లు మరియు వ్యాపారాలను కలిగి ఉన్నారని బ్లూమ్‌బెర్గ్ పరిశోధనలో తేలింది. ఈ ఆస్తులేవీ నేరుగా ఆయన పేరు మీద లేవు. అలీ అన్సారీ అనే ప్రముఖ ఇరానియన్ వ్యాపారవేత్తను బినామీగా వాడుకుని, అనేక షెల్ కంపెనీల ద్వారా ఈ పెట్టుబడులు పెట్టారు. ప్రధానంగా ఇరాన్ చమురు అమ్మకాల ద్వారా వచ్చిన నిధుల నుంచే ఈ సంపద సమకూరినట్టు సమాచారం. ఇరాన్‌పై కఠినమైన అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షలు ఉన్నప్పటికీ, గ్లోబల్ బ్యాంకింగ్ వ్యవస్థలోని లొసుగులను ఉపయోగించుకుని ఈ నిధులను విదేశాలకు తరలించారు.లండన్ (UK): లండన్‌లోని "బిలియనీర్స్ రో" (The Bishops Avenue) లో సుమారు రూ. 1,241 కోట్ల ($138 మిలియన్లు) విలువైన విలాసవంతమైన భవనాలున్నాయి. ఇందులో ఒక ఇల్లు 2014లో ఏకంగా రూ. 371.09కోట్లకు కొనుగోలు చేశారట.దుబాయ్‌లోని అత్యంత విలాసవంతమైన "ఎమిరేట్స్ హిల్స్" (దీనిని దుబాయ్ బెవెర్లీ హిల్స్ అంటారు) ప్రాంతంలో ఒక పెద్ద విల్లా ఉంది.ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ), మల్లోర్కా (స్పెయిన్) లాంటి నగరాల్లో ఫైవ్ స్టార్ హోటళ్లు (ఉదాహరణకు Hilton Frankfurt Gravenbruch) ఈ నెట్వర్క్ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు. కెనాడాలోని టొరంటోలోని ఫోర్ సీజన్స్ ప్రైవేట్ రెసిడెన్స్‌లో ఒక పెంట్‌హౌస్‌ను సుమారు 7.7 మిలియన్ల డాలర్లకు విక్రయించినట్లు రికార్డులు చెబుతున్నాయి.మరికొన్ని ఆస్తులను నేరుగా మెజ్తబా పేరు మీద కాకుండా, Birch Ventures Ltd, Ziba Leisure Ltd, , A&A Leisure వంటి షెల్ కంపెనీల ద్వారా కొనుగోలు చేశారు. ఇవి సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, ఐల్ ఆఫ్ మ్యాన్ వంటి దేశాల్లో రిజిస్టర్ అయ్యాయి. అంతేకాదు ఇరాన్లో చమురుకంపెనీల అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును దుబాయ్, స్విట్జర్లాండ్, లీచ్టెన్స్టెయిన్ బ్యాంకు ఖాతాల ద్వారా దారి మళ్లించి ఈ ఆస్తులను కొన్నారట."ఇరాన్ ప్రభుత్వం జర్మనీ ఆర్థిక వ్యవస్థలో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తోంది" అని ఫ్రాంక్ఫర్ట్ డిప్యూటీ మేయర్, టెహ్రాన్‌లో జన్మించి ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వాన్ని తీవ్రంగా విమర్శించిన నర్గెస్ ఎస్కందారి-గ్రున్‌బర్గ్ అన్నారు. మన వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించడం గమనార్హం.ఎవరీ అన్సారీమొజ్తబా సామ్రాజ్యాన్ని నడపడంలో అలీ అన్సారీ (Ali Ansari) కీలక పాత్ర పోషించాడనే విమర్శలు భారీగానే ఉన్నాయి. ఇరాన్‌లోని అతిపెద్ద షాపింగ్ మాల్ (Iran Mall) యజమాని ,బ్యాంకర్. 1980ల చివరలో, ఇరాన్-ఇరాక్ యుద్ధం ముగిసే సమయానికి - యువ అన్సారీ సైన్యంలో చేరాడు. ఈ సమయంలోనే అతను మొదటిసారిగా మొజ్తబా ఖమేనీని కలిశాడు. ఆ తరువాత అన్సారీ లాభదాయకమైన ప్రభుత్వ కాంట్రాక్టులు , దిగుమతి లైసెన్సులను పొందాడు. నిర్మాణ రంగం, షిప్పింగ్ మరియు పెట్రోకెమికల్స్ రంగాలలోకి వేగంగా ప్రవేశించాడు. ఈ పరిశ్రమలు ప్రభుత్వ నిధులను విదేశాలకు తరలించడానికి మార్గాలుగా ఉపయోగపడ్డాయని సమాచారం. 1990- 2000లలో, అన్సారీ టెహ్రాన్‌లో ఒక వర్ధమాన పారిశ్రామికవేత్తగా ఎదిగాడు అతను 2009లో TAT బ్యాంక్‌ను స్థాపించాడు, ఇది తరువాత బ్యాంకు యాజమాన్యంలోని విలాసవంతమైన షాపింగ్ సెంటర్ అయిన ఇరాన్ మాల్‌ను నిర్మించే ప్లాన్ వేశాడు. 2013 నాటికి, ఒక విలీనం TAT బ్యాంక్‌ను అయందే బ్యాంక్‌గా మార్చింది. ఇది 2025లో కుప్పకూలింది. అంతర్గత రుణాల ఆరోపణలలో చిక్కుకుని, అప్పులు మరియు అధికారులతో ఉన్న సన్నిహిత రాజకీయ సంబంధాలపై వివాదాలతో కూరుకుపోయింది.బ్రిటన్ ఇతనిని "అవినీతిపరుడైన ఇరానియన్ వ్యాపారవేత్త"గా పేర్కొంటూ ఆంక్షలు విధించింది. అన్సారీపై UK ఆస్తులను స్తంభింపజేయడం వలన EU ఆంక్షలు విధించినట్లయితే నెట్వర్క్ యూరోపియన్ ఆస్తులను భారీగా విక్రయించే అవకాశం ఉందని మనీలాండరింగ్ దర్యాప్తు యూరోపియన్ అధికారి పేర్కొన్నారు.ఇదీ చదవండి: 78 ఏళ్లకు లవ్ ప్రపోజల్..39 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి!ఖమేనీ వారసుడిగామొజ్తబాతండ్రి 86 ఏళ్ల అలీ ఖమేనీ తర్వాత ఇరాన్ తదుపరి "సుప్రీం లీడర్" అయ్యేందుకు మెజ్తబా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ ఆస్తులు ఆయనకు రాజకీయంగా మరియు ఆర్థికంగా బలాన్ని ఇస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఇరాన్లో విప్లవం వచ్చి ప్రభుత్వం కూలిపోతే, విదేశాలకు పారిపోయి సుఖంగా జీవించడానికి ఈ భారీ సంపదను "రెయిన్ డే ఫండ్"గా సిద్ధం చేసుకున్నట్లు అనుమానాలు ఉన్నాయి.2025-26లో అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో ఇరాన్‌పై ఒత్తిడి పెరిగింది. అలీ అన్సారీపై బ్రిటన్ ఆంక్షలు విధించడంతో, ఈ విదేశీ ఆస్తులను ఫ్రీజ్ (Freeze) చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్లో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే, పాలకుల కుటుంబం ఇలా కోట్లాది రూపాయల సంపదను విదేశాల్లో దాచుకోవడంపై ఇరాన్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.మరోవైపు ఇరాన్‌పై యుద్ధానికి సిద్ధమవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరిన్ని యుద్ధనౌకలను తరలిస్తున్నామంటూ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఘర్షణల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ ప్రజలు పేదరికంతో అలమటిస్తుంటే, పాలకుల కుటుంబం ఇలా విదేశాల్లో విలాసవంతమైన ఆస్తులు కూడబెట్టడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఇరాన్ ప్రభుత్వం తమను తాము సామాన్య భక్తులుగా చెప్పుకున్నా, లోపల జరుగుతున్నది వేరని తాజా నివేదిక చెబుతోంది. ఈ నివేదికలోని పేర్కొన్న ఆస్తులపై అటు ఖమేనీ లేదా అన్సారీ స్పందించ లేదు. -
ప్చ్.. ఖమేనీ వారసుడికి పగ్గాలు కష్టమే!
పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగున్న వేళ.. మరోవైపు ఇరాన్ సుప్రీం అయాతుల్లా అలీ ఖమేనీ ఆరోగ్యం క్షీణించిందని, ఆయన కోమాలోకి కూడా వెళ్లారని, ఆయన వారసుడు మోజ్తాబా ఖమేనీ తదుపరి సుప్రీంగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం తీవ్రతరమైంది. అయితే ఈ విషయంలో ఇప్పుడు ట్విస్ట్ చోటు చేసుకుంది.తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ సంకేతాలిస్తూ.. ఖమేనీ తాజాగా ఓ ఫొటో రిలీజ్ చేశారు. లెబనాన్ ఉన్న ఇరాన్ రాయబారి ముజ్తబా అమనిని కలుసుకున్నట్లు తన ఎక్స్ ఖాతాలో ఖమేనీ పోస్ట్ చేశారు. ఇటీవల లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన పేజర్ దాడుల్లో ముజ్తబా అమని కూడా గాయపడ్డారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఖమేనీ ఆరా తీసినట్లు సమాచారం.ఇక.. ఖమేనీ ఆరోగ్యం విషమించిందని, కోమాలోకి వెళ్లారని, ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీ త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని.. ఇరాన్ ఇంటర్నేషనల్ కథనం వెలువడడం తీవ్ర చర్చనీయాంశమైంది. సెప్టెంబర్ 20వ తేదీన 60 మంది ఇరాన్ అసెంబ్లీ నిపుణులతో ఒక తీర్మానం కూడా ఖమేనీ చేయించాడన్నది ఆ కథనం సారాంశం. అయితే..ఆ తీర్మానాన్ని.. ఓటింగ్‌ను చాలామంది వ్యతిరేకించారని కూడా అదే కథనం పేర్కొంది. ఈ కథనం ఆధారంగా రకరకాల కథనాలు వండి వార్చాయి మిగతా మీడియా సంస్థలు. కానీ, ఖమేనీ తాజా పోస్టుతో మోజ్తాబాకు ఇరాన్ సుప్రీం పగ్గాలు ఇప్పట్లో పగ్గాలు అప్పజెప్పకపోవచ్చనే స్పష్టత వచ్చింది. ఇదే కాదు.. మెజ్తాబాకు ఆటంకాలు కూడా ఉన్నాయి. అయతొల్లా అలీకి ఆరుగరు సంతానం. మోజ్తాబా.. రెండో కొడుకు. 1969లో మషాబాద్లో పుట్టాడు. తన తండ్రి బాటలో నడుస్తూ.. మత పెద్దగా మారాడు. అలాగే 2005, 2009 ఇరాన్ ఎన్నికల్లో మహమూద్ అహ్మదీనెజాద్‌కు మద్దతు ఇచ్చి.. అతని విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు.. ఇరాన్ రిచ్చెస్ట్ మ్యాన్‌గానూ మోజ్తాబాకు పేరుంది.ఇరాన్ జీడీపీ 388 బిలియన్ డాలర్లు కాగా, ఖమేనీ కుటుంబం ఆస్తుల విలువ 200 బిలియన్ డాలర్లుగా ఉందని.. ఇందులో 90 బిలియన్ డాలర్లు మోజ్తాబా పేరిటే ఉందని అమెరికా నివేదికలు వెల్లడించాయి. అయితే.. ఇరాన్ రాజకీయాల్లో జోక్యం ద్వారా అలీపై విమర్శలే ఎక్కువగా ఉన్నాయి. 2009లో అహ్మదీనెజాద్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. చెలరేగిన నిరసనల అణచివేత మోజ్తాబా ఆధ్వర్యంలోనే కొనసాగింది. అయితే తర్వాతి కాలంలో ఈ ఇద్దరి మధ్య సంబంధాలు చెడాయి. ఈ క్రమంలో.. ప్రభుత్వ ఖజానా సొమ్మును దుర్వినియోగం చేశాడంటూ మోజ్తాబాపై అహ్మదీనెజాద్ సంచలన ఆరోపణలు చేశాడు. దీంతో ఇరాన్ అసెంబ్లీ నిపుణులు మెజ్తాబాకు ఇరాన్ సుప్రీం బాధ్యతలు వెళ్లనివ్వకుండా అడ్డుకునే అవకాశం లేకపోలేదు. అయతొల్లా వారసుడిగా సిద్ధాంతాలను పుణికి పుచ్చుకున్నప్పటికీ.. సుప్రీం కుర్చీ మాత్రం మెజ్తాబాకు చాలా దూరంగానే ఉందన్నది పలువురి వాదన.


