moluguri bikshapathi
-
నేతలకు గాలం వేస్తున్న ‘ఈటల’.. ఒక్కొక్కరుగా ‘గులాబీ’ పార్టీకి గుడ్ బై
సాక్షి, వరంగల్: ఓరుగల్లు టీఆర్ఎస్(బీఆర్ఎస్) నేతలు కమలం వైపు చూస్తున్నారు. ఉద్యమ సమయం నుంచి కొనసాగిన నేతలు తమకు ఆదరణ లేదంటూ ఒక్కొక్కరుగా ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. సీనియర్ నేత, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ మాజీ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్ జూలై 31న టీఆర్ఎస్ను వీడారు. అర్బన్ బ్యాంక్ చైర్మన్, సీనియర్ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ఆగస్టు 7న ‘కారు’ దిగారు. తాజాగా గురువారం పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఈనెల 9న మెదక్ జిల్లా నర్సాపూర్‌లో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరబోతున్నట్లు భిక్షపతి స్పష్టం చేశారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు తోడు చేరికల కమిటీ చైర్మన్‌గా మాజీ మంత్రి ఈటల రాజేందర్ నియామకం తర్వాత ఆ పార్టీలోకి వలసలు పెరిగాయి. ఉమ్మడి వరంగల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన నాయకత్వం ఇతర పార్టీల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్ల రేసులో ఉన్న సీనియర్ నాయకులతో సంప్రదింçపులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల్లో ఉన్న ఓరుగల్లు నేతలు కమలం పార్టీ వైపు చూస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చదవండి: కాంగ్రెస్‌లో దేనికి పట్టం?, పనితనమా? విధేయతా? కొనసాగుతున్న బీజేపీ ఆపరేషన్ బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు కొనసాగిస్తుండగా.. వరంగల్‌లో మాత్రం ఆ పార్టీకి షాక్ తగులుతోంది. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో అత్యంత ప్రాధాన్యం ఉన్న ప్రాంతం వరంగల్ కాగా.. ఉమ్మడి జిల్లాపై బీజేపీ గురి పెట్టింది. టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు చెందిన సీనియర్లను పార్టీలో చేర్చుకునేందుకు ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నది. ఈ క్రమంలోనే కన్నెబోయిన రాజయ్య యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, మొలుగూరి భిక్షపతి గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పినట్లు చర్చ జరుగుతోంది. పార్టీకి రాజీనామా చేసిన భిక్షపతి.. సీఎం కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై ఆరోపణలు చేశారు. అధిష్టానం విధి విధానాలు, ఏకపక్ష పోకడలు నచ్చకే తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఇదివరకు పార్టీని వీడిన కన్నెబోయిన రాజయ్య యాదవ్ సైతం రాజీనామాకు గల కారణాలను వివరించి సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని.. రాజ్యసభ హామీని కూడా మరిచారని వాపోయారు. కారు పార్టీలో ఆత్మగౌరవం లేదని.. అసలు ఉద్యమకారులే లేరని వ్యాఖ్యానించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు, వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ప్రజల కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్లో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నిస్వార్థంగా పనిచేసినట్లు తెలుపుతూ.. స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌పై విమర్శలు చేసి పార్టీని వీడారు. చదవండి: మునుగోడు బరిలో గద్దర్.. ఆ పార్టీ నుంచే పోటీ! విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మొలుగూరి భిక్షపతి ఎవరీ మొలుగూరి భిక్షపతి 2009 సాధారణ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి మహాకూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన మొలుగూరి భిక్షపతి కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ చేతిలో ఓటమి పాలయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణానంతరం సురేఖ తన పదవికి రాజీనామా చేయడంతో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మొలుగూరి భిక్షపతి కొండా సురేఖపై గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున టికెట్ ఆశించి నిరాశపడ్డారు. ఆ తర్వాత అధికార పార్టీలోనే కొనసాగుతున్నప్పటికీ ఉద్యమ పార్టీలో ఆదరణ కరువైందనే అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన పార్టీ వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు గురువారం పరకాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. -
నిండా ముంచారు..!
గీసుకొండ, న్యూస్‌లైన్ : తనకు అండగా ఉండి గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పిన మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, కొండా మురళీధర్‌రావు నిండా ముంచారని టీఆర్ఎస్ పార్టీ నుంచి పరకాల ఎమ్మె ల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన ముద్దసాని సహోదర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం టీఆర్ఎస్ పార్టీ గీసుకొండ మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో హన్మకొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఓటమికి కారణాలపై సహోదర్‌రెడ్డి విశ్లేషించారు. మండలంలో బూత్‌ల వారీగా ఓటింగ్ తగ్గటానికి దారి తీసిన పరిస్థితులపై పోస్టుమార్టం నిర్వహించారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచే మొలుగూరి పట్టించుకోలేదని, కొందరు న్యాయవాదుల సహకారంతో ముందుకెళ్లినట్లు సహోదర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. కొండా మురళీధర్‌రావు గీసుకొండలో ప్రచారం చేయడానికి వస్తానని చెప్పి రాలేదని, ఆయన స్వగ్రామం వంచనగిరిలోనే టీఆర్ఎస్కు గణనీయంగా ఓటింగ్ తగ్గిందని అన్నారు. గతంలో కొండా సురేఖకు వచ్చిన ఓట్లతో పోలిస్తే ఇంత తక్కువ ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో మొలుగూరి, సురేఖకు వచ్చిన ఓట్లను చూస్తే తాను సునాయసంగా గెలుస్తాననే ధీమాతో ఉన్నానని, అయితే నాయకుల మోసం కారణంగా ఓడి పోయానని కార్యకర్తలు, నాయకుల ఎదుట వాపోయారు. పార్టీ తరఫున టికెట్ కొంత ఆలస్యంగా ఖరారు కావడంతో ఎవరు ఏమిటో తెలియని పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల కన్నా ప్రచారంలో ముందుండడంతోపాటు ఆర్థిక పరమైన విషయాల్లోనూ ఏమాత్రం వేనకడుగు వేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఎంపీ అభ్యర్థి కడియం శ్రీహరికి ఓటు వేసిన వారు ఎమ్మెల్యే విషయానికి వచ్చేసరికి క్రాస్ ఓటింగ్ చేశారని, అందుకే ఓడిపోయినట్లు కొందరు నాయకులు చెప్పిన విశ్లేషణలతో సహోదర్‌రెడ్డి ఏకీభవించలేదు. రాష్ట్రం మొత్తంలో టీఆర్ఎస్ గాలి ఉంటే ఇక్కడ క్రాస్ ఓటింగ్ ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీలోని కొందరు నాయకుల తీరు వల్లే ఓడిపోయామని పలువురు ఆరోపించారు. పాత టీఆర్ఎస్ నాయకులు సరిగా పని చేయలేదని ఓ వ్యక్తి చేసిన ఆరోపణతో సమావేశంలో కొంత సేపు గొడవ జరిగింది. నియోజకవర్గ ఇన్చార్జ్గా నియమించాలి సహోదర్రెడ్డిని పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్గా నియమించాలని, ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరుతూ మండల కమిటీ తీర్మానించింది. ఈ సందర్భంగా గతంలో పార్టీని వీడి వెళ్లిన అనంతారం గ్రామ నాయకుడు దూడె మొగిలి తిరిగి సహోదర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మండల కన్వీనర్ చింతం సదానందం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు మంద ఐలయ్య, బెంబిరి బాబూరావు, వీరగోని రాజ్‌కుమార్, వీరాటి లింగారెడ్డి, గంగుల రమేశ్. పోలెబోయిన ప్రభాకర్, ఊకల్ సొసైటీ చైర్మన్ రాజు, సర్పంచ్‌లు మానయ్య, బీమగాని సౌజన్య, కొంగ సురేందర్, తరగల ప్రసాద్, సాంబరెడ్డి, ల్యాదళ్ల బాలు, రాంబాబు, తాబేటి సదానందం, ఆలేటి సాంబమూర్తి, రాములు నాయక్, ముంత రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
టికెట్ ఇవ్వకపోవడం బాధాకరం: బిక్షపతి
పరకాల, న్యూస్‌లైన్: ఉద్యమంలో కేసులు, పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న త మకు తెలంగాణలో న్యాయం జరగుతుందని భావిస్తే టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమని వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి అన్నారు. మంగళవారం పరకాలలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ మరోసారి ఆలోచించి న్యాయం చేయాలని కోరారు. పలువురు నాయకులు మాట్లాడుతూ పరకాలలో ఉద్యమ పార్టీ బలోపేతానికి కృషి చేసిన బిక్షపతికి తీరని అన్యాయం చేశారన్నారు. సమావేశంలో కార్యకర్తల అభిప్రాయాలు చెబుతుండగా బిక్షపతి కన్నీరు పెట్టుకున్నారు. మొలుగూరి యువ సేన అధ్యక్షుడు ఏకు కిరణ్... బిక్షపతికి టికెట్ ఇవ్వాలంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. -
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
గవిచర్ల(సంగెం), న్యూస్‌లైన్ : అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి ఆరోపించారు. ఇటీవల కురిసిన వర్షాలతో మండలంలోని బొల్లికుంట, లోహిత, రామచంద్రాపురం, గవిచర్ల, ఆశాలపల్లి, కాపులకనిపర్తి గ్రామాల్లో దెబ్బతి న్న పంటలను మంగళవారం పరకాల ఎమ్మె ల్యే మొలుగూరి బిక్షపతి ఆధ్వర్యంలో టీఆర్ ఎస్ నాయకులు సందర్శించారు. అనంతరం గవిచర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీహరి మాట్లాడుతూ వర్షాల కారణంగా జిల్లాలో 2.5 లక్షల ఎకరాల్లో పత్తి, లక్ష ఎకరాల్లో వరి, 50 వేల ఎకరాల్లో మొక్కజొన్నతోపాటు కూరగాయలు, పండ్లతోటలకు తీవ్రనష్టం వాటిల్లిందని చెప్పారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను తక్షణమే పరిశీలించి వరికి ఎకరాకు రూ 10 వేలు, పత్తి, మొక్కజొన్న, కూరగాయలకు రూ 25 వేల పరిహారం అందించాలని ఆయన వ్యవసాయాధికారులను డిమాండ్ చేశారు. అలాగే ఇళ్లు కోల్పోయిన వారికి తక్షణ సాయంగా రూ 10 వేలు, ఐఏవై కిం ద గృహాలు మంజూరు చేయాలని కోరారు. జిల్లాకు చెందిన మంత్రులు పొన్నాల లక్ష్మ య్య, బస్వరాజు సారయ్యలు కనీసం దెబ్బ తిన్న పంటలను పరిశీలించి బాధిత రైతులకు భరోసా కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు. ఆత్మస్థైర్యం కోల్పోవదు ్ద: బిక్షపతి వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి సూచించారు. పంటల నష్టంపై పార్టీ తరపున నివేదికలను తయారుచేసి కలెక్టర్, గవర్నర్, సీఎంకు అందజేసి బాధితులకు పరిహారం ఇప్పించేవరకు పోరాటాలు చేస్తామని ఆయన చెప్పారు. వర్షానికి తడిసి రంగుమారిన పత్తిని సీసీఐ, మొక్కజొన్నలను మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, అధ్యక్షుడు తక్కళ్లపెల్లి రవీందర్‌రా వు, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు మార్నెనీ రవీందర్రావు, నాయకులు శోభన్‌బాబు, పూలుగు సాగర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, రాజు, తహసీల్దార్ పాలకుర్తి బిక్షం, ఎంపీడీఓ సిరి కొండ వెంకటేశ్వర్రావు, వ్యవసాయాధికారి సుంకన్న పాల్గొన్నారు.