మోడరన్ మామ్స్.. బేబీ ఫుడ్ కుకర్ గురించి మీకు తెలుసా?
బుల్లిబుజ్జాయిలకు బువ్వ తినిపించడం ఓ ఎత్తైతే.. ఆ బువ్వను వాళ్లకు నచ్చేలా, వాళ్లు తినగలిగేలా సిద్ధం చెయ్యడం మరోఎత్తు. అందుకే మోడరన్ మామ్స్ ఎంపికలో ఈ మల్టీ బేబీ ఫుడ్ మేకర్ చేరింది. 15 నిమిషాల సమయంలో రుచికరమైన బేబీ ఫుడ్ అందిచగలిగే ఈ మేకర్.. బ్లెండర్, గ్రైండర్, స్టీమర్, సెల్ఫ్ క్లీనింగ్, బాటిల్ వార్మర్.. వంటివెన్నో వెర్షన్స్‌లో పనిచేస్తుంది. గాడ్జెట్‌కి ఎడమవైపు డిటాచబుల్ వాటర్ ట్యాంక్, కుడివైపు మిక్సీజార్‌లో పట్టేంత స్టీమ్ బాస్కెట్ ఉంటాయి. ఎడమవైపు డిస్ప్లేలో జ్యూస్, బాయిల్, మిక్స్డ్ మీట్, ఆటోమెటిక్ క్లీన్, ఆన్/ఆఫ్ అనే ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. ఇందులో కూరగాయలు, పండ్లు, మాంసం వంటివన్నీ మెత్తగా ఉడికించి గుజ్జులా చేస్తుంది. వాటర్ ట్యాంక్‌లో వాటర్, స్టీమ్ బాస్కెట్లో ఆహారం వేసుకుంటే నిమిషాల్లో మెత్తగా ఉడుకుతుంది. స్టీమ్ బాస్కెట్‌కి యాంటీ హీటింగ్ హ్యాండిల్ ఉంటుంది. దాంతో కుక్ అయిన వెంటనే ఆ మిశ్రమాన్ని దాని కింద ఉన్న మిక్సీ జార్లో వేసుకుని ఒక స్విచ్ నొక్కితే మెత్తగా టేస్టీగా మారిపోతుంది. ఇక ఇందులో పిల్లలు తాగే వాటర్ బాటిల్స్, పాల సీసాలు వంటివి కూడా శుభ్రం చేసుకోవచ్చు.
ధర 72 డాలర్లు (రూ.5,355)
శాండ్విచ్ – వాఫిల్స్ మేకర్
చూడటానికి మినీ సూట్‌కేస్‌లా ఉన్న ఈ గాడ్జెట్.. రుచుల ప్రియులకు నిమిషాల్లో టేస్టీ బ్రేక్ఫాస్ట్స్ని అందిస్తుంది. రకరకాల ఫ్లేవర్స్‌లో శాండ్విచ్, వాఫిల్స్తో పాటు.. చికెన్ గ్రిల్, బ్రెడ్ టోస్ట్ వంటివి తయారు చేస్తుంది. హ్యాండిల్ దగ్గరే లాక్ చేసుకునే వీలు ఉండటంతో దీన్ని సులభంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకుని వెళ్లొచ్చు. నాన్‌స్టిక్ పూత కలిగిన గ్రిల్ ప్లేట్స్, వాఫిల్స్ ప్లేట్స్‌తో.. కుకింగ్ వేగంగా అవ్వడంతో పాటు.. క్లీనింగ్ సులభమవుతుంది. సాధారణంగా చిన్నచిన్న వంటగదుల్లో మల్టీ మేకర్స్‌ని స్టోర్ చెయ్యడం మహా కష్టం. కానీ ఈ మేకర్‌తో ఆ సమస్య రాదు. వంట గదిలో లేదా ప్రయాణాల్లో దీన్ని నిలువుగా స్టోర్ చేసుకునే వీలు ఉండటంతో స్థలం బాగా కలిసి వస్తుంది. ఈ మేకర్ అనువుగా ఉండటంతో వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ కొనసాగుతోంది.
ధర 98 డాలర్లు (రూ.7,289)
మల్టీ పర్పస్ స్టీమర్
‘ఒకే మేకర్లో ఒకే వంట..’ అనే పాత పద్ధతికి ఏనాడో ఫుల్స్టాప్ పడింది. అందుకే ‘కుకింగ్ గాడ్జెట్స్ యందు మల్టీ గాడ్జెట్స్ వేరయా’ అంటారు వినియోగదారులు. ఏరికోరి మరీ వాటినే కొంటుంటారు. అలాంటిదే ఈ ఎలక్ట్రిక్ హాట్ పాట్. 1.5 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ మల్టీ కుకర్‌లో ఒకే సమయంలో రెండు వెరైటీలు సిద్ధం చేసుకోవచ్చు. పైన ఉన్న స్టీమర్ బౌల్‌కి ఇరువైపులా హ్యాండిల్ ఉంటుంది. ప్రత్యేకమైన ట్రాన్స్పరెంట్ మూత కూడా ఉంటుంది. బాటమ్ బౌల్‌కి పొడవాటి హ్యాండిల్‌తో పాటు.. దానిపైనే ఆన్ /ఆఫ్ బటన్ ఉంటుంది. దాంతో ఇందులో గుడ్లు ఉడికించుకోవడం దగ్గర నుంచి చికెన్, మటన్, రొయ్యలు వంటి నాన్‌వెజ్ ఐటమ్స్, కూరగాయలు, ఆకుకూరలతో వంటలు సిద్ధం చేసుకోవచ్చు. నూడుల్స్, సూప్స్.. వంటివెన్నో వెరైటీలు రెడీ చేసుకోవచ్చు. పైగా ఈ మేకర్ స్టోర్ చెయ్యడానికి కన్వినెంట్‌గా ఉంటుంది.
ధర 35 డాలర్లు (రూ.2,603)