monaco grand prix pole positions
-
రొమాగ్నా గ్రాండ్‌ప్రిలో.. వెర్‌స్టాపెన్‌కు ఐదో గెలుపు..!
ఆద్యంతం ఆధిపత్యం కనబరుస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఫార్ములావన్ తాజా సీజన్లో ఐదో విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం ఇటలీలో జరిగిన ఎమిలియా రొమాగ్నా గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు.‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన వెర్స్టాపెన్ నిర్ణీత 63 ల్యాప్‌లను అందరికంటే వేగంగా ఒక గంటా 25 నిమిషాల 25.252 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. లాండో నోరిస్ (మెక్లారెన్) రెండో స్థానంలో, చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు మొనాకో గ్రాండ్‌ప్రి ఈనెల 26న జరుగుతుంది.ఇవి చదవండి: విన్‌రైజర్స్... -
లెక్లెర్క్కు పోల్ పొజిషన్
మోంటేకార్లో: ఫార్ములా వన్ (ఎఫ్1) సీజన్లో ఆధిపత్యం ప్రదర్శిస్తోన్న మెర్సిడెస్, రెడ్‌బుల్ డ్రైవర్లకు ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ చెక్ పెట్టాడు. తన సొంత గ్రాండ్‌ప్రి అయిన మొనాకో స్ట్రీట్ సర్క్యూట్లో శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో సత్తా చాటిన లెక్లెర్క్ సీజన్లో తొలి పోల్ సాధించాడు. కెరీర్లో అతడికి ఇది ఎనిమిదో పోల్. 2019 మెక్సికన్ గ్రాండ్‌ప్రిలో చివరిసారిగా లెక్లెర్క్ పోల్ సాధించాడు. మొనాకో వీధుల గుండా సాగిన క్వాలిఫయింగ్ చివరి సెషన్లో నిమిషం 10.346 సెకన్లలో ల్యాప్‌ను అతను పూర్తి చేశాడు. అయితే సెషన్ మరికొన్ని నిమిషాల్లో ముగుస్తుందనగా లెక్లెర్క్ కారు ప్రమాదానికి గురైంది. ఒకవేళ అతని కారు గేర్ బాక్స్‌ను మారిస్తే... లెక్లెర్క్కు ఐదు స్థానాల గ్రిడ్ పెనాల్టీ పడుతుంది. లేదంటే ఆదివారం జరిగే ప్రధాన రేసును అతడు తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. 0.230 సెకన్లు ఆలస్యంగా ల్యాప్‌ను ముగించిన వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో నిలిచాడు. బొటాస్ (మెర్సిడెస్) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. స్పానిష్ గ్రాండ్‌ప్రితో పోల్ల సెంచరీ కొట్టిన మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు ఈ క్వాలిఫయింగ్ సెషన్ ఏ మాత్రం కలిసి రాలేదు. పోల్ సిట్టర్‌కు 0.749 సెకన్లు వెనుకగా ల్యాప్‌ను పూర్తి చేసిన అతను ఏకంగా ఏడో స్థానంలో నిలిచాడు. -
హామిల్టన్‌కు ‘పోల్’
మోంటెకార్లో (మొనాకో) : ప్రపంచ డిఫెండింగ్ చాంపియన్, మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్... కెరీర్లో తొలిసారి మొనాకో గ్రాండ్‌ప్రి పోల్ పోజిషన్‌ను దక్కించుకున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రేసులో అతను 1ని.15.909 సెకన్ల టైమింగ్‌తో అత్యంత వేగవంతమైన ల్యాప్‌ను నమోదు చేశాడు. తనకు ఫేవరెట్ సర్క్యూట్ అయిన మొనాకోలో తొమ్మిదో ప్రయత్నంలో ఈ బ్రిటన్ డ్రైవర్ పోల్ పొజిషన్ సాధించాడు. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్లో ఇది 40వ పోల్. మెర్సిడెస్ డ్రైవర్ నికో రోస్బెర్గ్ 1ని 15.440 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచాడు. హామిల్టన్‌కు ఇతని మధ్య తేడా కేవలం 0.342 సెకన్లు మాత్రమే. వెటెల్ (ఫెరారీ-1ని 15.849 సెకన్లు), రెడ్‌బుల్ డ్రైవర్లు రికియార్డో (1ని.16.041 సెకన్లు), క్వియాట్ (1ని.16.182 సెకన్లు) వరుసగా మూడు నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. కిమీ రైకోనెన్ (ఫెరారీ-1:16,427 సెకన్లు) ఆరో స్థానం నుంచి, ఫోర్స్ ఇండియా డ్రైవర్ పెరెజ్ (1:16,808 సెకన్లు) ఏడో స్థానం నుంచి రేసు మొదలుపెడతారు. సైంజ్ (టోరో రోసో), మల్డోనాలో (లోటస్), వెర్స్టాపెన్ (టోరో రోసో) వరుసగా ఎనిమిది, తొమ్మిది, పది స్థానాలను సాధించారు. ప్రధాన రేసు నేటి సాయంత్రం గం. 5.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం