monely laundering scam
-
జ్యూస్ అమ్ముకునే స్థాయినుంచి రూ.5 వేల కోట్ల దాకా: ఎవరీ సౌరభ్?
Mahadev Gambling App Sourabh Chandrakar: మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల నిర్వహించిన దాడులు కలకలం రేపాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈడీ దాడుల్లో రూ.417 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. రాయ్‌పూర్, భోపాల్, కోల్‌కతా, ముంబై సహా పలు నగరాల్లో బెట్టింగ్ సిండికేట్‌కు చెందిన 39 ఆఫీసులపై ఈడీ దాడులు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఏజెన్సీ 15 మందిని అరెస్టు చేయడంతో మహాదేవ్ బుక్ యాప్ అక్రమాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. దుబాయ్‌లో ఉంటూ ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ నడుపుతున్నసౌరభ్ చంద్రకర్ ఈ స్కాంలో కీలకం. మహాదేవ్ ఆన్లైన్ బుకింగ్ పోకర్, కార్డ్ గేమ్స్, ఛాన్స్ గేమ్‌లు, టెన్నిస్, క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ ఇతర ఆటల ద్వారా అక్రమ బెట్టింగ్ నిర్వహిస్తుంది. ఈ బెట్టింగ్ యాప్‌లో సహ ప్రమోటర్‌గా ఉన్న రవి ఉప్పల్ కలిసి బెట్టింగ్ ద్వారా వచ్చిన అక్రమ సంపాదనను FPI మార్గం ద్వారా భారతీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టారు. మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ కేసులో దుబాయ్‌లో ఈ ఇద్దరు ప్రధాన ప్రమోటర్లు రూ. 5,000 కోట్ల వరకు కూడబెట్టారు. (బాలీవుడ్లో మహదేవ్ బెట్టింగ్ స్కాం కలకలం: సెలబ్రిటీలకు ఈడీ షాక్) రూ. 200 కోట్ల స్టార్-స్టడెడ్ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో సౌరభ్ దుబాయ్‌లోని అతిపెద్ద నగరంలో, అత్యంత విలాసవంతంగా వివాహం చేసుకున్నాడు. దీని కోసం ఏకంగా రూ. 200 కోట్లు ఖర్చు చేశాడు. నాగ్‌పూర్ నుండి తన బంధువులను, సినీ తారలను ప్రైవేట్ జెట్ల ద్వారా తరలించాడు. అంతేకాదువెడ్డింగ్ ప్లానర్‌కు రూ.120 కోట్లు చెల్లించాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు స్పెషల్ ప్రదర్శనలు ఇచ్చారంటే పెళ్లి ఏ రేంజ్లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ముంబైలోని మలాద్ ప్రాంతంలోని ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు అంగడియ సంస్థలు డబ్బును డెలివరీ చేసినట్లు ఈడీ గుర్తించింది. ఇందులో యోగేష్ భాపట్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ R-1 ఈవెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.112 కోట్లు, హోటల్ బుకింగ్స్ కోసం రూ.42 కోట్లు అందాయి. భోపాల్‌కు చెందిన ర్యాపిడ్ ట్రావెల్స్ చంద్రకర్ బంధువులు, బాలీవుడ్ ప్రముఖులను దుబాయ్‌కు పంపడానికి టిక్కెట్లు ఏర్పాటు చేసిందని, అయితే కోల్‌కతాకు చెందిన వికాస్ చప్పరియా ద్వారా అక్రమ నగదు లావాదేవీలు జరుగుతున్నాయని ఈడీ ఆరోపించింది. (ఐకానిక్ డబుల్ డెక్కర్: ఆనంద్ మహీంద్ర ఎమోషనల్ ఫిర్యాదు, పోలీసులేమన్నారంటే!) @GoI_MeitY @NewsG2G @Cybercellindia Today Lotus365 Again With New Advertisement on Big Front Page Government Banned Betting websitehttps://t.co/luYqv9u3oh Banned Aftet They Update Domain To . in Then Smartly Changed The Domain To https://t.co/QXi0XQGCGL After Banned pic.twitter.com/k7cTplhNrG — Sunny Sunny (@SunnySu19623409) April 7, 2023 ఈ వివాహానికి బాలీవుడ్ సెలబ్రిటీలు అతిఫ్ అస్లాం, విశాల్ దద్లానీ, రహత్ ఫతే అలీ ఖాన్, టైగర్ ష్రాఫ్, అలీ అస్గర్, సన్నీ లియోన్, క్రిసీ ఖర్బండా, ఎల్లి అవ్రామ్, నుష్రత్ భరుచ్చా, భారతీ సింగ్, క్రుషా అభిషేక్,భాగ్యశ్రీ వంటి తారలు హాజరయ్యారని ఈడీ గుర్తించింది. వీరందరినుంచి సమన్లు జారీ చేసి, వారి స్టేట్మెంట్లు తీసుకోవాలని ఈడీ చూస్తోంది.సెప్టెంబర్ 18, 2022న జరిగిన మూడవ వార్షికోత్సవ పార్టీకి కూడా బాలీవుడ్ తారలు హాజరయ్యారు. వీరిలో సంజయ్ దత్, కపిల్ శర్మ, అఫ్తాబ్ శివదాసాని, సుఖ్విందర్ సింగ్, సోఫీ చౌదరి, డైసీ షా, ఊర్వసాహి రౌతేలా, నర్గీస్ ఫక్రీ, నేహా శర్మ తదితరులు హాజరయ్యారు. ఈవెంట్ మేనేజర్లు, ట్రావెల్ ఏజెంట్లు, హవాలా వ్యాపారులపై జరిపిన దాడుల్లో ఈ నెట్‌వర్క్‌ను గుర్తించినట్లు ఏజెన్సీ తెలిపింది. ఈడీ ఆరోపణల ప్రకారం వీరు మహాదేవ్ ఆన్లైన్ బుక్ బెట్టింగ్ యాప్ గొడుగు కింద సిండికేట్ అయ్యారు. ముఖ్యంగా ఇన్‌యాక్టివ్ లేదా సెమీ-యాక్టివ్ ఖాతాలను గుర్తించి వారికి స్వల్పమొత్తంలో ఎరవేసి, ఆ ఖాతాల ద్వారా కోట్ల లావాదేవీలు చేశారని దీంతోనే వీటిని ట్రాక్ చేయడం కష్ట మైందని దర్యాప్తు ఏజెన్సీ చెప్పింది. జ్యూస్ అమ్ముకునే చంద్రకర్ ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందిన చంద్రకర్ మొదట్లో జ్యూస్ అమ్మేవాడు. మరోవైపు రవి ఉప్పల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. స్థానిక బుకీలుగా ప్రారంభమై, చాలా తక్కువ సమయంలోనే చంద్రకర్, రవి ఇద్దరూ దుబాయ్‌కి వెళ్లి 2018లో ఈ యాప్‌ను ప్రారంభించారు. త్వరితగతిన డబ్బులిస్తామంటూ విద్యార్థులు, నిరుద్యోగ యువత, రైతులు, ఇతరులను ప్రలోభపెట్టారు. ఇది సక్సెస్ కావడంతో అప్పటినుంచి వెనుదిరిగి చూడలేదు. సెలబ్రిటీల ద్వారా మహదేవ్ బుక్ యాప్స్ ప్రమోషన్స్ నిర్వహించింది.అలా కోట్లకు పడగలెత్తిన చంద్రకర్, FairPlay, Reddy Anna, Lotus365 వంటి బ్రాండ్లను కొనుగోలు చేసింది. దీంతోపాటు, 'బేట్భాయ్' అంబానీ బుక్' పేరుతో కొత్త బ్రాండ్లను కూడా ప్రారంభించాడు. ఈ ఇద్దరు కింగ్పిన్లపై రెడ్ కార్నర్ నోటీసులు (ఆర్సిఎన్) జారీ చేసే యోచనలో ఉందిఈడీ. దీని నిమిత్తం రాయ్‌పూర్‌లోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు పరారీలో ఉన్న నిందితులకు నాన్‌బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ చేసింది. -
అవినీతి తిమింగలాలు: గుప్త బ్రదర్స్ ఆటకట్టు
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో రాజకీయ సంక్షోభానికి, భారీ అవినీతికి కేంద్రంగా మారి దుబాయ్‌కి పారిపోయిన ఇండియన్ గుప్తా బ్రదర్స్‌కు ఎట్టకేలకు చెక్ పడింది. గుప్తా సోదరులుగా పేరొందిన రాజేశ్ గుప్తా, అతుల్ గుప్తా, అజయ్ గుప్తాలలో ఇద్దరిని సోమవారం దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. తమ దేశంలో భారీ అవినీతికి పాల్పడిన ఇద్దరు సోదరులను యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్‌లో అరెస్ట్ చేసినట్టు దక్షిణాఫ్రికా ప్రకటించింది. వీరిని దక్షిణాఫ్రికాకు రప్పించేందుకు నియమించిన నిపుణుల బృందంతో చర్చిస్తున్నట్టు దక్షిణాఫ్రికా నేషనల్ ప్రాసిక్యూటింగ్ అధికారి వెల్లడించారు. అయితే మూడో సోదరుడు అజయ్ గుప్తా అరెస్టు విషయంపై స్పష్టత లేదన్నారు. జాకబ్ జుమా దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలను వేల కోట్ల రూపాయలకు ముంచేసినట్టు గుప్తా బద్రర్స్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. దాదాపు 15 బిలియన్ రాండ్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.7,513కోట్లను కొల్లగొట్టారని అభియోగం. దీనిపై విచారణ సాగుతుండగానే కుటుంబాలతో వీరు సహా దుబాయికి పారిపోయారు. అయితే ఇరుదేశాల మధ్య ఒప్పందా లేని కారణంగా దీంతో దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించింది. దీంతో గుప్తా సోదరులపై గత ఏడాది జూన్‌లో ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దాదాపు 15 బిలియన్ ర్యాండ్లను దోచుకున్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని ఆర్గనైజేషన్ అన్‌డూయింగ్ ట్యాక్స్ అబ్యూస్ సీఈఓ వేన్ డువెన్‌హేజ్ తెలిపారు. భారీ స్కాంలు, ఏకంగా ఆర్థికమంత్రి కావాలని ప్లాన్ మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాతో ఉన్న సాన్నిహిత్య సంబంధాలను దుర్వినియోగం చేసి ఆర్థికంగా లాభపడ్డారు. జుమా తొమ్మిదేళ్ల పదవీకాలంలో నేషనల్ ఎలక్ట్రిసిటీ సప్లయర్ ‘ఎస్కాం’ లాంటి పలు ప్రభుత్వరంగ సంస్థలను కొల్లగొట్టిన గుప్తా సోదరులు అక్కడి ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. అంతేకాదు, జుమా కేబినెట్ మంత్రుల దగ్గర్నుంచి అనేక ప్రభుత్వ నియామకాలను వీరు ప్రభావితం చేశారని ఆరోపణలు వచ్చాయి. 2016లో ఆర్థిక మంత్రి కావడానికి 44 మిలియన్ల డాలర్ల లంచం ఆఫర్ చేశారని ఒక అధికారి చెప్పడంతో వీరి అవినీతి బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కారణంగానే 2018లో భారీగా ప్రజా నిరసనలు రాజుకున్నాయి. చివరికి జుమా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన గుప్తా సోదరులు దేశం విడిచి దుబాయికి పారిపోయారు. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా (పైల్ ఫోటో) ఈ పరిణామాన్ని దక్షిణాఫ్రికా ప్రతిపక్షం స్వాగతించింది. దేశాన్ని దోచుకుని, ప్రజల కష్టాలకు కారణమైన వారి అరెస్ట్‌లపై సంతృప్తిని వ్యక్తం చేసింది. విచారణ త్వరగా ముగించాలని అని ప్రతిపక్ష డెమొక్రాటిక్ అలయెన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ కేసుకు త్వరగా పరిష్కారం లభిస్తుందని ఆశించకూడదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అప్పగింతకోసం దక్షిణాఫ్రికా పడిన పాట్లను ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. అంతకు ముందు, రెండు దేశాల మధ్య అప్పగింత ఒప్పందం లేనందున యుఏఈతో చర్చల వైఫల్యం నేపథ్యంలో వారిని దక్షిణాఫ్రికాకు అప్పగించేలా యూఎన్‌కి విజ్ఞప్తి చేసింది. దీని ప్రకారం జూన్ 2021లో ఈ ఒప్పందాన్ని ఆమోదించాయి. కాగా ఉత్తర్ ప్రదేశ్‌లోని షహరాన్పూర్కు చెందిన అజయ్, అతుల్, రాజేశ్ గుప్తా 90వ దశకంలో దక్షిణాఫ్రికాకు వెళ్లి చెప్పుల వ్యాపారం ప్రారంభించారు. వ్యాపారంలో స్థిరపడిన అనంతరం ఐటీ, మీడియా, మైనింగ్ తదితర రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించడమేకాదు చాలా తక్కువ కాలంలోనే దక్షిణాఫ్రికాలో కుబేరులుగా అవతరించారు. వీరి ఆస్తుల్లో చాలావరకు ఇప్పుడు విక్రయించడమో, లేదా మూసివేయడమో జరిగింది. -
ఈడీ కొరడా : రూ.1610 కోట్ల వాహనాలు సీజ్
సాక్షి, న్యూఢిల్లీ: మోసం, మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 6వేల కార్లను ఎటాచ్ చేసింది. వీటి విలువ 1610 కోట్ల రూపాయలు. సూరత్‌కు చెందిన సిద్ధి వినాయక్ లాజిస్టిక్స్ లిమిటెడ్ (ఎస్విఎల్ఎల్) సంస్థ ద్వారా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంకులో చోటు చేసుకున్న రూ. 836.29 కోట్ల స్కాంకు సంబంధించి ఈడీ ఈ చర్య చేపట్టింది. నకిలీ పత్రాల, నకిలీ పేర్లతో భారీ ఎత్తు రుణాలు, నిధుల మళ్లింపుతోపాటు, అనేక అవతవకల ఆరోపణల నేపథ్యంలో ఎస్విఎల్ఎల్ కంపెనీపై 2016లో సీబీఐ కేసులు నమోదు చేసింది. అనంతరం రంగంలోకి దిగిన ఈడీ కంపెనీ, దాని డైరెక్టర్లపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కంపెనీ డైరెక్టర్ రూప్‌చంద్ బైద్‌ను గతంలోనే అరెస్ట్ చేసింది. వ్యక్తిగత లాభాల కోసం సంస్థ ఉద్యోగులు, డ్రైవర్ల పేర్లతో, తప్పుడు పేపర్లను ఉపయోగించి బ్యాంకుల నుండి అనేక రుణాలు పొందిందనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా ఈ అక్రమాల్లో రూప్‌చంద్ కీలక పాత్ర పోషించాడని, సంబంధిత సంస్థల వివిధ ఖాతాల ద్వారా రుణాలను పొంది, వాటిని దారి మళ్లించినట్టుగా దర్యాప్తులో తేలిందని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. 2002 నుంచి సిద్ధి వినాయక్ లాజిస్టిక్ లిమిటెడ్ ముంబై ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. చాలక్ సే మాలక్ (డ్రైవర్ టూది ఓనర్) పేరుతో పాత, కొత్త వాహనాల కొనుగోలుపై వివిధ రుణ సదుపాయాలందిస్తుంది. గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, ఎన్‌సిఆర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ నెట్ వర్క్ ఉంది. మరోవైపు ఇప్పటికే (2017, జూన్) 19 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ జత చేసింది. ED attaches movable properties comprising 6170 vehicles worth Rs.1609.78 Crores of M/s Sidhi Vinayak Logistics Ltd (SVLL), Mumbai in a bank fraud case under PMLA, 2002. — ED (@dir_ed) June 18, 2019 -
రాకేష్ అస్తానాకు హైకోర్టులో స్పల్ప ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోన్న సీబీఐ ముడుపుల వ్యవహారంలో స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్తానాకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తనపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, దాన్ని కొట్టివేయాలని ఆస్తానా వేసిన పిటిషన్‌పై విచారించిన హై కోర్టు..తదుపరి ఆదేశాల వరకు ఆస్తానాను అరెస్ట్ చేయకూడదని సీబీఐని ఆదేశించింది. ఐతే తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలన్న విజ్ఞప్తిని మాత్రం హైకోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణను అక్టోబరు 29కి వాయిదా వేసింది. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని అభ్యర్థించారు. తనపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. -
ఆస్తానా కేసు పూర్వాపరాలు..
సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాపై ఆ సంస్థే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. తాజా పరిణామం నేపథ్యంలో ప్రధాని కార్యాలయం సోమవారం సీబీఐ డెరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాలకు సమన్లు జారీ చేసింది. సీబీఐ అత్యున్నత అధికారులిద్దరి మధ్య ఏడాది కాలంగా జరుగుతున్న అంతర్గత పోరాటం ఆస్తానాపై ఎఫ్ఐఆర్ నమోదుతో తీవ్రరూపం దాల్చింది. దీన్ని పరిష్కరించడానికి ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిననున్నట్టు సమాచారం. ప్రధాని మోదీ గత ఏడాది అక్టోబర్ 22న ఆస్తానాను సిబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా స్వయంగా నియమించారు. గుజరాత్ కేడర్‌కు చెందిన ఆస్తానాపై అప్పటికే అవినీతి ఆరోపణలు ఉన్నందున ఆయన నియామకాన్ని సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. (సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌పై కేసు) కేసు ఏమిటి? మాసం ఎగుమతి వ్యాపారవేత్త అయిన ఖురేషి సీబీఐ కేసుల నుంచి బయటపడేస్తానని చెప్పి డైరెక్టర్ల తరఫున పలువురి నుంచి లంచాలు తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన హెదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త సానా సతీష్ తాను ఖురేషికి 3 కోట్లు లంచంగా ఇచ్చినట్టు మేజిస్ట్రేట్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసు నుంచి తనను బయటపడేయడానికి గత పది నెలల్లో దఫదఫాలుగా ఈ సొమ్ము ఇచ్చానని, తాజాగా అక్టోబర్ 9వ తేదీన 25 లక్షలు ఇచ్చానని సతీష్ చెప్పారు. సతీష్ తన వాగ్మూలంలో సీబీఐ స్పెషల్ డైరెక్టర్ ఆస్తానా, దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త మనోజ్ ప్రసాద్, ప్రసాద్ బంధువు సోమేశ్‌ల పేర్లు ప్రస్తావించారు. ఆస్తానా కోసమే ఈ సొమ్ము తీసుకుంటున్నట్టు ఖురేషి చెప్పారని కూడా సతీష్ పేర్కొన్నారు. అయితే, ఆస్తానాను తాను ప్రత్యక్షంగా కలవలేదని స్పష్టం చేశారు. దీని ఆధారంగా సీబీఐ ఆస్తానాపై కేసు నమోదు చేసింది. (సీబీఐ డీఎస్పీ అరెస్ట్) ఎవరీ ఖురేషీ? ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మొయిన్ అక్తర్ ఖురేషీ డెహ్రాడూన్‌లోని డూన్ స్కూలు విద్యార్ధి. చదువయిపోయాకా 1993లో ఉత్తర ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో చిన్న పశువధశాల ప్రారంభించాడు. అక్కడ నుంచి మాంసం ఎగుమతిదారుగా మారాడు. అనతి కాలంలోనే ఈ వ్యాపారంలో పేరు సంపాదించాడు. ఏళ్లు గడిచేకొద్ది నిర్మాణం, ఫ్యాషన్ వంటి వివిధ రంగాలకు విస్తరించాడు.పాతిక కంపెనీలకు పైగా నెలకొల్పాడు. ఆయనపై అనేక పన్ను ఎగవేత కేసులు ఉన్నాయి. హవాలా వ్యాపారం ద్వారా కోట్లు గడించాడు. సీబీఐ మాజీ డైరెక్టర్లు రంజిత్ సింగ్, ఏపీ సింగ్ తదితరులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకునేవాడు. వారి తరఫున సీబీఐ కేసుల్లో నిందితుల నుంచి ముడుపులు తీసుకునేవాడని ఈడీ ఆరోపించింది. ఖురేషీకి రాజకీయ ప్రముఖులతో కూడా సంబంధాలున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయం పన్ను శాఖలు ఖురేషీపై పలు కేసులు నమోదు చేశాయి. ఖురేషీపై ఉన్న కేసుల్లో దర్యాప్తు సాగకుండా సోనియా గాంధీ అడ్డుపడుతున్నారని 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే. దేశం నుంచి అక్రమంగా 200 కోట్లను విదేశాలకు తరలించాడని ఖురేషీపై ఈడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా సీబీఐ, ఈడీ, ఆదాయం పన్ను శాఖల అధికారులు ఖురేషీ నివాసాల్లో చేపట్టిన సోదాల్లో లభించిన డాక్యుమెంట్లు, సేకరించిన ఫోన్ సంభాషణల ఆధారంగా ఖురేషీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఖురేషీ కేసుల దర్యాప్తునకు ఏర్పాటయిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు ఆస్తానా అధిపతిగా వ్యవహరించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న సతీష్‌ను కేసు నుంచి తప్పించడం కోసం ఆస్తానా తరఫున ఖురేషీ 5.75 కోట్లు తీసుకున్నట్టు సీబీఐ కేసు నమోదు చేసింది. సతీష్ వాంగ్మూలం హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సానా సతీష్ వాంగ్మూలం ఆస్తానాపై కేసుకు ప్రాతిపదికగా మారింది. ఖురేషీ కేసులో నిందితుడిగా ఉన్న సతీష్ అక్టోబర్ 4న స్థానిక మేజిస్ట్రేట్‌కు వాంగ్మూలం ఇస్తూ ఆస్తానా కోసం తాను ఖురేషీకి ఇంత వరకు 3 కోట్లు ఇచ్చానని చెప్పాడు. ఖురేషీ కేసులో విచారించడానికి సీబీఐ సెప్టెంబర్‌లో సతీష్‌కు సమన్లు పంపింది. ఆస్తానా ద్వారా ఈ సంగతి తెలుసుకున్న సతీష్ దుబాయ్ పారిపోవడానికి ప్రయత్నించాడు.అయితే,అప్పటికే సతీష్‌పై లుక్ ఔట్ నోటీసు జారీ కావడంతో విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. మోదీకి ఇష్టుడు ఆస్తానా ప్రధాని ఏరికోరి మరీ ఆస్తానాను సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా నియమించారు. 1984 గుజరాత్ ఐపీఎస్ కేడర్‌కు చెందిన ఆస్తానా అంతకు ముంద సీబీఐ అదనపు డైరెక్టర్‌గా పని చేశారు. గోధ్రా రైలు దహనం కేసులో సిట్‌కు నాయకత్వం వహించారు. యూపీఏ హయాంలో జరిగిన ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్‌సెల్ మాక్సిస్ తదితర కేసుల దర్యాప్తుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఆస్తానా అధిపతిగా వ్యవహరించారు. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ తన ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తున్నారని భావించిన ఆస్తానా ఆయనపై పలు ఆరోపణలు చేశారు. తన విధి నిర్వహణలో అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. ఖురేషీ కేసులో అలోక్ వర్మ లంచం తీసుకున్నారని కూడా ఆరోపించారు. వర్మపై 10 అవినీతిఆరోపణలతో కేబినెట్ కార్యదర్శికి లేఖ కూడా రాశారు. ఆయన ఈ వ్యవహరాన్ని విజిలెన్స్ కమిషన్‌కు అప్పగించారు. ఆస్తానా పై కేసుకు దారి తీసిన పరిణామాలు: కేసులోంచి తప్పించేందుకు లంచం ఇవ్వాలని ఆస్తానా డిమాండ్ చేశారంటూ హైదరాబాద్ వ్యాపారి సతీష్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆస్తానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాంట్లో సీబీఐ అధికారి దేవేంద్ర కుమార్, మధ్యవర్తి మనోజ్ ప్రసాద్, అతని సోదరుడు సోమేశ్ ప్రసాద్‌ల పేర్లు, మరికొందరు ప్రభుత్వాధికారుల పేర్లు ఉన్నాయి. ఎఫ్ఐఆర్ ప్రకారం... మనోజ్, సోమేశ్‌లు దుబాయ్‌లో సతీష్‌ను కలుసుకున్నారు. సీబీఐ అధికారి సహాయంతో సతీష్ కేసును సెటిల్ చేస్తామని వారు హామీ ఇచ్చారు. సోమేశ్ తనతో సీబీఐ అధికారితో ఫోన్లో మాట్లాడించాడని, ఐదు కోట్లు ఇస్తే కేసును సెటిల్ చేస్తానని ఆ అధికారి చెప్పారని, ముందుగా 3 కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలన్నారని సతీష్ ఆరోపించాడు. తనతో మాట్లాడింది రాకేశ్ ఆస్తానా అని సోమేశ్ చెప్పాడని కూడా సతీష్ పేర్కొన్నాడు. వాట్సాప్‌లో ఆస్తానా ఫోటో కూడా చూపించాడని తెలిపాడు. వారి మాటలు నమ్మి, కేసు నుంచి బయటపడాలన్న కోరికతో దుబాయ్‌లో మనోజ్ ప్రసాద్‌కు కోటి రూపాయలు ఇచ్చానని సతీష్ పేర్కొన్నాడు. తర్వాత సోమేశ్ చెప్పిన మేరకు ఢిల్లీలో సునీల్ మిట్టల్ అనే వ్యక్తికి 1.95 కోట్లు ఇచ్చానని సతీష్ వివరించాడు. అధికారులకు 2.95 కోట్లు లంచం ఇచ్చినప్పటికీ ఈ ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ సతీష్‌కు నోటిసు పంపింది. దాంతో సతీష్ మనోజ్‌ను క లిసి లంచం ఇచ్చినా నోటీసులెందుకు వచ్చాయని నిలదీశాడు. మిగతా 2 కోట్లు ఇస్తే నోటీసు మాఫీ చేయిస్తానని మనోజ్ చెప్పాడు. గత నెల్లో సతీష్ హైదరాబాద్ నుంచి ఫ్రాన్స్ వెళ్లేందుకు ప్రయత్నించాడు. విమానాశ్రయం అధికారులు అతనిని వెళ్లకుండా ఆపారు. సెప్టెంబర్ 26న తమ ముందు హాజరు కావలసిందిగా సీబీఐ సతీష్‌ను ఆదేశించింది. అక్టోబర్ 1న సతీష్ ఢిల్లీలో సీబీఐ ముందు హాజరయ్యాడు. సీబీఐ డీఎస్పీ దేవేంద్ర కుమార్, ఎస్పి జాగ్రూప్లను కలుసుకున్నాడు. జరిగిందంతా సతీష్ మనోజ్‌కు చెప్పాడు.2 కోట్లు ఇవ్వకపోవడం వల్లే ఇలా జరిగిందని మనోజ్ చెప్పడంతో త్వరలోనే ఇస్తానని చెప్పాడు. అక్టోబర్ 9వ తేదీన 2 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చాడు.అనారోగ్యం వల్ల హాజరు కాలేకపోతున్నట్టు సతీష్ సీబీఐకి మెయిల్ పెట్టాడు. తర్వాత సీబీఐ నుంచి సతీష్‌కు ఎలాంటి సందేశాలు రాలేదు. సతీష్ అక్టోబర్ 10న 25 లక్షలు మనోజ్‌కు ఇచ్చాడని, మిగతా సొమ్ము అక్టోబర్ 16న ఇవ్వాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. అయితే అక్టోబర్ 16న సొమ్ము తీసుకోవడానికి భారత్ వచ్చిన మనోజ్‌ను సీబీఐ అరెస్టు చేసింది. దీని ఆధారంగా సీబీఐ ఆస్తానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -సాక్షి, నాలెడ్జ్సెంటర్ -
సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌పై కేసు
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలతో సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్తానాపై అదే సంస్థ కేసు నమోదుచేసింది. సీబీఐలో రెండో అత్యున్నతాధికారిపై సీబీఐనే కేసు పెట్టడం ఇదే తొలిసారి. మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న మాంస వ్యాపారి మొయిన్ ఖురేషికి సాయం చేసేందుకు మధ్యవర్తి నుంచి అస్తానా లంచం తీసుకున్నారన్నది ఇక్కడ ప్రధాన ఆరోపణ అని అధికారులు తెలిపారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు ఖురేషి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మకు రూ. 24 కోట్లు చెల్లించాడని అస్తానా ఆగస్టు 24న కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. ఈ ఆరోపణలపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ విచారణ జరుపుతోంది. అప్పటి నుంచి అలోక్, అస్తానా వర్గాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రతరమైన నేపథ్యంలో సీబీఐ అస్తానాపై నేరపూరిత కుట్ర, అవినీతి, నేర దుష్ప్రవర్తన తదితర ఆరోపణలపై కేసు నమోదుచేసింది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి సతీశ్‌బాబు సనా ఫిర్యాదు మేరకు సీబీఐలోని అవినీతి నిరోధక విభాగం పలు సెక్షన్ల కింద అస్తానాతో పాటు మరికొందరిపై తాజా కేసు నమోదుచేసింది. -
తరలిపోయిన డబ్బు.. 683 కోట్లు!
విశాఖపట్నం కేంద్రంగా సాగిన మనీలాండరింగ్ వ్యవహారంలో మొత్తం 683 కోట్ల రూపాయలు దేశం నుంచి విదేశాలకు తరలిపోయిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు తెలిపారు. అందులో ఒక్క కెనరా బ్యాంకు నుంచే రూ. 533 కోట్లు వెళ్లాయని ఆయన చెప్పారు. ఈ స్కాం దర్యాప్తు వివరాలను ఆయన శుక్రవారం నాడు విజయవాడలో మీడియాకు వివరించారు. మన రాష్ట్రం నుంచి డబ్బు విదేశాలకు వెళ్తున్నట్లు ఆదాయపన్ను శాఖ గుర్తించిందని, కొంతమంది బోగస్ కంపెనీలు పెట్టి ఫోర్జరీ పేపర్లు తయారుచేసి, వాటినే నిజమైన పత్రాలుగా చూపించి డబ్బును విదేశాలకు తరలించారని ఆయన చెప్పారు. ఐటీ శాఖ విచారణ చేసి ఈడీ ద్వారా ఈ వ్యవహారాన్ని అడ్డుకుందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీఐడీ విభాగం దర్యాప్తు చేస్తోందని, మొత్తం 17 మంది నిందితులను సీఐడీ అధికారులు పట్టుకుని విచారణ చేస్తున్నారని తెలిపారు. ఈ కేసులో ఆయుష్ గోయల్, వినీత్ గోయెంకా, వికాస్ గుప్తాలను ప్రధాన నిందితులుగా భావిస్తున్నామని, అయితే కేసు దర్యాప్తు పూర్తయితే గానీ అసలు నిందితులు వేరే ఎవరైనా ఉన్నారా, వీళ్లేనా అన్న విషయం ఖరారు కాదని ఆయన అన్నారు. ఈ ముగ్గురిలో ఒకరి పాస్‌పోర్టు స్వాధీనం చేసుకున్నామన్నారు. వడ్డి మహేష్, అతడి తండ్రి శ్రీనివాసరావు తదితరులను కూడా పట్టుకున్నామని చెప్పారు. వీరిలో శ్రీనివాసరావు కోల్‌కతాలో ట్రాన్స్‌పోర్టర్‌గా ఉండగా, వడ్డి మహేష్ తాను కేవలం బ్రోకరింగ్ మాత్రమే చేస్తానని చెబుతున్నాడని, ఒక డాలర్‌కు తనకు 85 పైసలు ముడుతుందని చెప్పాడని డీజీపీ తెలిపారు. అలా చేయడం కూడా తప్పేనని, ఇందులో సూత్రధారులను పట్టుకుంటే అసలు విషయం వెలుగులోకి వస్తుందని అన్నారు. సీఐడీ కూడా ఇక్కడి ఆస్తులు ఎటాచ్ చేయొచ్చుగానీ, విదేశాల్లో ఆస్తులు ఎటాచ్ చేయాలంటే మాత్రం ఈడీ వల్లే అవుతుందని తెలిపారు. చైనా, సింగపూర్, హాంకాంగ్ దేశాలకు మొత్తం రూ. 683 కోట్లు తరలిపోవడంపై సీఐడీ దర్యాప్తు చేస్తోందని చెప్పారు. ఇది హవాలా కాదని, మనీ లాండరింగ్ అని వివరించారు. వడ్డి మహేష్‌తోపాటు అతడి బంధువులను, కొంతమంది చార్టర్డ్ అకౌంటెంట్లను కూడా అరెస్టు చేశామన్నారు. ఈ వ్యవహారంలో బ్యాంకుల పాత్ర ఏమిటన్న విషయంపైనా విచారణ జరుగుతోందన్నారు. ప్రధాన నిందితులు ముగ్గురిపై ఇంటర్‌పోల్‌కు కూడా సమాచారం అందించి, రెడ్‌కార్నర్ నోటీసులు వచ్చేలా చూస్తామని, వాళ్లు ఎక్కడున్నా రప్పించే ప్రయత్నం చేస్తామని వివరించారు. అయితే ఈ కేసులో తాము చెప్పిన పేర్లు తప్ప వేరే రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు మాత్రం ఇంతవరకు తేలలేదని చెప్పారు. -
తరలిపోయిన డబ్బు.. 683 కోట్లు!