month of Ramzan
-
కశ్మీర్‌పై కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: కల్లోల కశ్మీర్లో భద్రతా బలగాల కార్యకలాపాలకు సంబధించి కేంద్రం బుధవారం కీలక ఆదేశాలు జారీచేసింది. పవిత్ర రంజాన్ మాసంలో భద్రతా పరమైన ఆపరేషన్లు చేపట్టవద్దని చెప్పింది. అయితే, అవతలివారు హింసాయుత చర్యలకు పాల్పడిన పక్షంలోగానీ, సామాన్య పౌరుల ప్రాణాలాను కాపాడేందుకుగానీ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతిదాడి చేయవచ్చని సూచించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు బుధవారం సంబంధిత అధికారులకు లేఖలు పంపింది. గురువారం నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతుండటం తెలసిందే. ఇదిలాఉంటే, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం కూడా పలు విధ్వంసకర ఘటనలు చోటుచేసుకున్నాయి. శ్రీనగర్‌లోని చత్తాబల్ ప్రాంతంలో గ్రెనేడ్ పేలుడు సంభవించింది. తీవ్రంత స్వల్పంగా ఉండటంతో ఓ మహిళకు గాయాలయ్యాయి. పుల్వామా జిల్లాలో జరిగిన మరో సంఘటనలో.. రాజ్‌పోరా పోలీస్‌స్టేషన్‌పై ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరారు. అవికాస్తా గురి తప్పడంతో పక్కనున్నదుకాణాలు ధ్వంసమయ్యాయి. -
ఈ పండగ నెలంతా ఇక్కడే!
సంవత్సరం పొడవునా ఎక్కడైనా ఉండనివ్వండి.. రంజాన్ మాసంలో మాత్రం ఎ.ఆర్. రెహమాన్ భారతదేశంలోనే ఉంటారు. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ చిత్రాల పని మీద విదేశాల్లో ఉన్న రెహమాన్ స్వదేశం వచ్చారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉందని రహమన్ చెబుతూ -‘‘ఏ పండగని అయినా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటేనే తృప్తిగా ఉంటుంది. నేనెంత బిజీగా ఉన్నా రంజాన్ మాసంలో మాత్రం చెన్నయ్‌లో ఉండేలా ప్లాన్ చేసుకుంటా. ముఖ్యంగా ఉపవాస దీక్ష చేయడానికి మన భారతదేశమే అనువుగా ఉంటుంది. ఈ పవిత్ర దినాల్లో అమ్మ, నా భార్యా, పిల్లలతో కలిసి ఉండటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలకు పాటలు సమకూర్చడంతో పాటు తను నిర్వహిస్తున్న ‘కెఎం’ స్కూల్కెళ్లి, అక్కడి స్టూడెంట్స్‌ని కలిశారు రెహమాన్. ‘‘ఆ దేవుడి దయ వల్ల కళాశాల స్థాయికి చేరుకుంది మా పాఠశాల. ఇక్కడున్న ప్రతి విద్యార్థీ మాకెంతో ముఖ్యం. అందరూ ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా ఆకాంక్ష. ఈ మ్యూజిక్ అకాడమీ ఎలా నడుస్తుందో అనే దిగులు నాకు లేదు. ఎందుకంటే, నా సోదరి దగ్గరుండి చూసుకుంటుంది’’ అని చెప్పారు రెహమాన్. ప్రస్తుతం ఓ చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారాయన. దీనికి సంబంధించిన కథ కూడా సిద్ధమైంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభిస్తామని చెప్పారు రెహమాన్. భవిష్యత్తులో దర్శకత్వం కూడా చేస్తారా? అనడిగితే.. ఆ ఉద్దేశమే లేదని పేర్కొన్నారు. -
ముస్లింల సంక్షేమానికి కృషి
వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, కర్నూలు, పాణ్యం ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి కల్లూరు: ముస్లింల సంక్షేమానికి కృషిచేస్తామని కర్నూలు, పాణ్యం ఎమ్మెల్యేలు ఎస్వీమోహన్ రెడ్డి, గౌరు చరితారెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక 21వ వార్డు రెవెన్యూ కాలనీలోని ముస్లిం మైనార్టీ సమావేశ హాలులో వారిని ముస్లిం మత పెద్దలు ఘనంగా సన్మానించారు. ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలను మౌలానా జాబీర్‌సాహెబ్, మౌలానా సల్మాన్‌సాహెబ్‌లు ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లారు. రంజాన్ మాసం పూర్తయ్యే వరకు సాయంత్రం వేళలో విధిస్తున్న విద్యుత్ కోతలను ఎత్తివేయాలని, మౌలానాలకు గృహకల్ప సముదాయాలను నిర్మించాలని, మెటర్నిటీ ఆసుపత్రిని ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి విద్యుత్ సీఎండీతో ఫోన్లో మాట్లాడారు. రంజాన్ మాసంలో సాయంత్రం వేళలో విద్యుత్ కోతలు లేకుండా చూడాలని కోరారు. సానుకూలంగా స్పందించిన సీఎండీ ముస్లింలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి వివరించారు. నగరంలో మెటర్నిటీ ఆసుపత్రి ఏర్పాటుకు కృషిచేస్తామని, మౌలానాలకు గృహ సముదాయం నిర్మించేందుకు తగిన అవకాశాలను పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. అనంతరం ముస్లింలకు కర్నూలు, పాణ్యం ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, గౌరు చరితారెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం మత పెద్దలు మౌలానా ముఖర్రమ్ సాహెబ్, మౌలానా ఖాజాసాహెబ్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి సతీమణి ఎస్వీ విజయ, వైఎస్ఆర్సీపీ నాయకులు అబ్దుల్జ్రాక్, మహమూద్ బాషా, సలీమ్, షరీఫ్, ఎస్వీ జగన్మోహన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు పెరుగు పురుషోత్తంరెడ్డి, తోట వెంకటకృష్ణారెడ్డి, బాబు, మద్దయ్య పాల్గొన్నారు.