ముస్లింల సంక్షేమానికి కృషి | to develop the musilm schemes | Sakshi
Sakshi News home page

ముస్లింల సంక్షేమానికి కృషి

Published Mon, Jun 30 2014 3:21 AM | Last Updated on Tue, May 29 2018 3:40 PM

ముస్లింల సంక్షేమానికి కృషి - Sakshi

ముస్లింల సంక్షేమానికి కృషి

వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, కర్నూలు, పాణ్యం ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి
 కల్లూరు: ముస్లింల సంక్షేమానికి కృషిచేస్తామని కర్నూలు, పాణ్యం ఎమ్మెల్యేలు ఎస్వీమోహన్ రెడ్డి, గౌరు చరితారెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక 21వ వార్డు రెవెన్యూ కాలనీలోని ముస్లిం మైనార్టీ సమావేశ హాలులో వారిని ముస్లిం మత పెద్దలు ఘనంగా సన్మానించారు. ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలను మౌలానా జాబీర్‌సాహెబ్, మౌలానా సల్మాన్‌సాహెబ్‌లు ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లారు.

రంజాన్ మాసం పూర్తయ్యే వరకు సాయంత్రం వేళలో విధిస్తున్న విద్యుత్ కోతలను ఎత్తివేయాలని, మౌలానాలకు గృహకల్ప సముదాయాలను నిర్మించాలని, మెటర్నిటీ ఆసుపత్రిని ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి విద్యుత్ సీఎండీతో ఫోన్‌లో మాట్లాడారు. రంజాన్ మాసంలో సాయంత్రం వేళలో విద్యుత్ కోతలు లేకుండా చూడాలని కోరారు. సానుకూలంగా స్పందించిన సీఎండీ ముస్లింలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి వివరించారు.

నగరంలో మెటర్నిటీ  ఆసుపత్రి ఏర్పాటుకు కృషిచేస్తామని, మౌలానాలకు గృహ సముదాయం నిర్మించేందుకు తగిన అవకాశాలను పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. అనంతరం ముస్లింలకు కర్నూలు, పాణ్యం ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, గౌరు చరితారెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.  

ముస్లిం మత పెద్దలు మౌలానా ముఖర్రమ్ సాహెబ్, మౌలానా ఖాజాసాహెబ్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి సతీమణి ఎస్వీ విజయ, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు అబ్దుల్జ్రాక్, మహమూద్ బాషా, సలీమ్, షరీఫ్, ఎస్వీ జగన్‌మోహన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు పెరుగు పురుషోత్తంరెడ్డి, తోట వెంకటకృష్ణారెడ్డి, బాబు, మద్దయ్య పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement