విభజనతో సీమాంధ్రకు ఎక్కువ నష్టం
మాచవరం, న్యూస్‌లైన్ :రాష్ట్ర విభజనతో సీమాంధ్రకు ఎక్కువ నష్టం జరుగుతుందని వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్టమెంటు అభ్యర్థి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి అన్నారు.స్థానిక అంబటి కోట య్య నివాసంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో తెలుగు రాష్ట్రాన్ని సాధిస్తే ఇప్పుడు స్వార్థరాజకీయాల కోసం తెలుగురాష్ట్రాన్ని ముక్కలుచేశారన్నా రు. సమైక్య రాష్ట్రం కోసం పోరాడిన నాయకుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రలో నిలుస్తారని ఆయన పేర్కొన్నారు.
వైఎస్ జగన్‌పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని తన పర్యటనల్లో చూశనని చెబుతూ, రానున్న ఐదేళ్లలో నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో చేపట్టబోయే కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. గ్రామాల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తానన్నారు. అనంతరం ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త జంగా కృష్టమూర్తి, మండల కన్వీనర్ గుర్రం గురవారెడ్డి, యూత్ కన్వీనర్ జిలుగు వెంకటనరసింహారెడ్డి, అంబటి కోటయ్య, చౌదరి సంగరయ్య, వెలిశల అనిల్‌కుమార్, తండు కాసులు గౌడ్, గడ్డం రాములు, యర్రం రాములు, తానుగొండ్ల ఏడుకోండలురెడ్డి, పోలే సైమాన్, ముసలయ్య, పాతర్లపాటి వెంకటరెడ్డి, సింగడాల ముక్కంటి, నాగరాజు, మోదడుగు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జనభేరి వేదిక పలనాడు బస్టాండ్..
నరసరావుపేట వెస్ట్: చలో నరసరావుపేట నినాదంతో ఈనెల ఆరో తేదీ నరసరావుపేట లో పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే వైఎస్సార్ సీపీ జనభేరిని పల నాడు బస్టాండ్ ప్రాంతంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి చెప్పారు. శని వారం సభావేదికను ఆయనతోపాటు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. జనభేరికి ముఖ్యఅతిథిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి హాజరవుతున్నందున సభ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు చెప్పారు. జనభేరికి లక్షలాదిగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. వీరి వెంట నాయకులు ఆళ్ళ పేరిరెడ్డి, ఇనగంటి శ్రీనివాసరెడ్డి, కాకుమాను ఫౌండేషన్ చైర్మన్ కాకుమాను సదాశివరెడ్డి తదితరులు ఉన్నారు.