Mortgage registration
-
ఏసీబీ వలలో సబ్‌రిజిస్ట్రార్
పాకాల (చిత్తూరు జిల్లా): మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ పత్రాలను ఇచ్చేందుకు లంచం తీసుకుంటున్న ఓ సబ్–రిజిస్ట్రార్‌ను శుక్రవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ డీఎస్పీ అల్లాభక్ష్ తెలిపిన వివరాల మేరకు.. పూతలపట్టు మండలం పేటమిట్టకు చెందిన గల్లా దామోదరప్రసాద్ తన 6.69 ఎకరాల భూమిని తాకట్టుపెట్టి పాకాల మండలం నేండ్రగుంటకు చెందిన వి.నానిప్రసాద్ వద్ద రూ.46 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. గత నెల 31వ తేదీన రిజిస్ట్రేషన్ అనంతరం నానిప్రసాద్‌కు మార్టిగేజ్ పత్రాలను ఇచ్చేందుకు పాకాల సబ్‌రిజిస్ట్రార్ దామోదరం రూ.2 లక్షల లంచాన్ని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో రూ.1 లక్షా 50 వేలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే.. నానిప్రసాద్ గురువారం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం నానిప్రసాద్ సబ్–రిజిస్ట్రార్‌కు నగదు అందజేశాడు. ఆ నగదును డాక్యుమెంట్ రైటర్ రాంబాబుకు ఇచ్చి సబ్–రిజిస్ట్రార్ దాచమన్నాడు. దీంతో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా రాంబాబును పట్టుకుని డబ్బును స్వాధీనం చేసుకున్నారు. సబ్–రిజిస్ట్రార్‌ను, డాక్యుమెంట్ రైటర్‌ను అరెస్టు చేశారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ అల్లాభ„Š తెలిపారు. ఏసీబీ డీఎస్పీ జనార్దన్‌నాయుడు, ఇన్స్పెక్టర్ తనీమ్, ఎస్ఐ విష్ణువర్థన్, సిబ్బంది శ్రీనివాస్, సారథి పాల్గొన్నారు. -
నంబర్ వన్.. సోనూ సూద్
లండన్: లాక్డౌన్ సమయంలో పేదలకు విశేషమైన సేవలందించిన నటుడు సోనూ సూద్‌కు అరుదైన గుర్తింపు లభించింది. ‘2020లో ప్రపంచంలో టాప్ 50 ఆసియన్ సెలబ్రిటీల’ జాబితాలో ఆయన ఏకంగా మొదటి స్థానం దక్కించుకున్నారు. ఇలాంటి జాబితాను విడుదల చేయడం ఇదే ప్రథమం. యూకేలోని ఈస్టర్న్ ఐ అనే వార పత్రిక దీన్ని ప్రచురించింది. ఈ పత్రిక ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ అస్జాద్ నాజిర్ ఈ జాబితా రూపొందించారు. ఇందులో మొదటి స్థానంలో సోనూ సూద్, రెండో స్థానంలో కెనడా సోషల్ మీడియా స్టార్ లిల్లీ సింగ్‌లో నిలిచారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు 7వ స్థానం దక్కింది. మరోమారు పెద్ద మనసు చాటుకున్న సోనూసూద్ ముంబై: తన చేతికి ఎముకే లేదని ప్రముఖ నటుడు సోనూ సూద్ నిరూపించుకుంటున్నారు. లాక్డౌన్ సమయంలో ఆయన ప్రదర్శించిన దాతృత్వం దేశ విదేశాల్లో ప్రశంసలు అందుకుంది. తాము ఇబ్బందుల్లో ఉన్నాం, ఆదుకోండి అని కోరుతూ ఇప్పటికీ సోనూ సూద్‌కు పెద్ద సంఖ్యలో లేఖలు వస్తున్నాయట. అందుకే రూ.10 కోట్లు సమీకరించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ముంబైలోని 8 ఆస్తులను తాకట్టు(మార్ట్గేజ్) పెట్టినట్లు తెలిసింది. ఇందులో 2 దుకాణాలు, 6 ఫ్లాట్లు ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మార్ట్గేజ్ ఒప్పందం సెప్టెంబర్ 15న కుదిరింది. నవంబర్ 24న రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది. ఆయా ఆస్తులు సోనూ సూద్, ఆయన భార్య పేరిటే ఉంటాయి. వాటిపై వచ్చే అద్దెలు వారికే అందుతాయి. ఈ ఆస్తులను తాకట్టు పెట్టి తీసుకున్న రుణంపై వడ్డీని సోనూ సూద్ దంపతులు చెల్లించాల్సి ఉంటుందని జేఎల్ఎల్ ఇండియా రెసిడెన్షియల్ సేవల సంస్థల సీనియర్ డైరెక్టర్ రితేశ్ మెహతా చెప్పారు. అయితే, తన ఆస్తుల తాకట్టుపై సోనూ సూద్ ఇంకా స్పందించలేదు. -
తనఖా పేరిట అమ్మకం రిజిస్ట్రేషన్
కాల్‌మనీ కేసులో మరో మోసం ప్రజాప్రతినిధి బంధువుల నిర్వాకం విజయవాడ లీగల్ : తనఖా రిజిస్ట్రేషన్ అంటూ తన ఇంటిని కాల్‌మనీ వ్యాపారి అమ్మకం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఓ వృద్ధుడు ఆరోపించారు. నగరానికి చెందిన ప్రజాప్రతినిధి బంధువు ఈ మోసానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. తన న్యాయవాది ద్వారా కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. బాధితుడి కథనం మేరకు.. 83 ఏళ్ల రేలంగి హనుమంతరావు విద్యాధరపురంలోని రావిచెట్టు సెంటర్ రేలంగివారి వీధిలో నివసిస్తున్నారు. కుటుంబ అవసరాల నిమిత్తం నగరానికి చెందిన బుద్దా భాస్కరరావు వద్ద 2015 జూలై 31న రూ.4 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ప్రతినెలా వడ్డీ చెల్లిస్తున్నారు. నగదు ఇచ్చిన రోజు హనుమంతరావు నుంచి భాస్కరరావు రూ.100 స్టాంపు పేపరు, సంతకాలు చేసిన తెల్ల కాగితాలు నాలుగు, సంతకం చేసిన ఖాళీ ప్రాంసరీ నోట్లు, నాలుగు ఖాళీ చెక్కులు తీసుకున్నారు. రెండు నెలలు తర్వాత నూటికి ఆరు రూపాయలు చెల్లించాలని భాస్కరరావు పట్టుబట్టారు. అంతవడ్డీ చెల్లించలేనని హనుమంతరావు పేర్కొనడంతో ఇంటిని తనఖా చేస్తే వడ్డీ తగ్గిస్తానని చెప్పిన భాస్కరరావు రూ.70 లక్షల ఇంటిని తనఖా పెట్టుకున్నాడు. అయితే ఆ ఇంటిని రూ.4 లక్షలకు అమ్మినట్లుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ తరువాత రూ.6 వడ్డీ చెల్లించాల్సిందేనని పట్టుబట్టాడు. ఆ మేరకు వడ్డీ చెల్లించి తనఖా రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోరగా ఇంటిని తనకు అమ్మేశారుగా అంటూ హనుమంతరావును దూషించాడు. బాధితుడి అల్లుడు పలగాని మురళీ కృష్ణ ఇంటి కాగితాల కోసం వెళ్లగా భాస్కరరావు చేతనైంది చేసుకోండి, ఆ ఇంటి కాగితాలు ఓ వ్యక్తి వద్ద ఉన్నాయి అని చెప్పాడు. దీంతో బాధితులు ఆ వ్యక్తి వద్దకు వెళ్లగా తనకు సంబంధంలేదని, భాస్కరరావు వద్దే తేల్చుకోవాలని ఆ వ్యక్తి సూచించాడు. ఈ వ్యవహారాన్ని పరిష్కరిస్తానని చెప్పిన బుద్దా సత్యనారాయణ ఆ తరువాత ఇంటిని ఇచ్చే ప్రసక్తేలేదని, ఎంతో కొంత నగదు ఇప్పిస్తామని చెప్పాడు. బుద్దా వెంకన్న బంధువు భాస్కరరావు తనను మోసగించాడని పోలీసులకు, నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని హనుమంతరావు దంపతులు వాపోయారు. ముఖ్యమంత్రికి చెప్పుకుందామని వెళ్తే, ఆయన అందుబాటులో లేరని, తమ న్యాయవాది ద్వారా కోర్టులో ప్రయివేటు కేసు దాఖలు చేయనున్నామని పేర్కొన్నారు.