ఐదు కిలోమీటర్లు భుజంపై శవాన్ని మోసుకుంటూ..
మధ్యప్రదేశ్: మానవత్వ మనుగడ మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. చనిపోయిన వ్యక్తి విషయంలో సాయం కోరి వచ్చిన వారిపట్ల చక్కటి ఆరోగ్యంతో ఉచ్వాసనిచ్వాసలు కలిగిన మనుషులు హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఎలాంటి భావోద్వేగాలు స్పందనలు లేకుండా ఓ జీవచ్ఛంలా ప్రవర్తిస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని సిద్ధి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన మృతేహాన్ని తీసుకెళ్లేందుకు మార్చురీ వెహికల్ డ్రైవర్ నిరాకరించడంతో ఆ శవాన్ని వెదురు బొంగుకు కట్టుకొని ఇద్దరు వ్యక్తులు తమ భుజాలపై మోసుకొని వెళుతూ మనిషిన్నవాడు నిజంగానే లేకుండా పోతున్నాడా అని ఆలోచించేలా చేశారు.
వివరాల్లోకి వెళితే సిద్ది జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అతడు చనిపోయాడు. దీంతో ఆ మృతదేహాన్ని తరలించేందుకు మార్చురీ వెహికిల్ మాట్లాడగా పేదలకు తమ వాహనాన్ని ఇవ్వడం కుదరదని నిరాకరించారట. దీంతో వారు చేసేదేం లేక ఐదు కిలోమీటర్లపాటు భూజాలపై శవాన్ని ఎత్తుకొని నడిచుకుంటూ వెళ్లి అంత్యక్రియలు జరిపారు.