సీఎన్బీసీ అవార్డు కైవసం
హైదరాబాద్: జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం మరో అవార్డును తమ ఖాతాలో వేసుకుంది. సీఎన్బీసీ టీవీ 18 ఎంపిక చేసిన మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డును తెలంగాణ రాష్ట్రం దక్కించుకుంది. ఈ నెల 30న ఢిల్లీలో జరిగే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అవార్డును స్వీకరించనున్నారు.