భారత్‌లో ఆ ఇద్దరి కోసం తెగ సెర్చ్ చేశారు!
ముంబై: గడిచిన దశాబ్దకాలంలో మన దేశంలో గూగుల్‌లో అత్యధికమంది సెర్చ్ చేసిన నటీనటులుగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, శృంగార తార సన్నీ లియోన్ నిలిచారు. గత పదేళ్లలో అత్యధికమంది సెర్చ్ చేసిన భారతీయ నటుడిగా సల్మాన్ ఖాన్ మొదటి స్థానంలో ఉండగా రెండోస్థానంలో షారుఖ్ ఖాన్, మూడోస్థానంలో అక్షయ్‌కుమార్, నాలుగోస్థానంలో అమితాబ్ నిలిచారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచి తన తిరుగులేని స్టార్‌డమ్‌ను రుజువుచేసుకున్నారు. టాప్ టెన్ జాబితాలో రజనీ తర్వాత వరుసగా హృత్తిక్ రోషన్, షాహిద్ కపూర్, రణ్‌బీర్ కపూర్, ఆమిర్ ఖాన్, ఇమ్రాన్ హష్మి స్థానం దక్కించుకున్నారు.
ఇక నటీమణుల విషయానికి వస్తే అత్యధికమంది గూగుల్‌లో వెతికింది శృంగార తార, బాలీవుడ్ నటి సన్నీ లియోన్ గురించే. ఆమె తర్వాత ఈ జాబితాలో కత్రీనా కైఫ్, కరీనా కపూర్, కాజల్ అగర్వాల్, దీపికా పదుకొణే, ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రా, తమన్హా భాటియా, అలియా భట్, సోనాక్షి సిన్హా ఉన్నారు.
ఇక అత్యధికమంది సెర్చ్ చేసిన దర్శకుల జాబితాలో డ్యాన్స్ మాస్టర్ కం డైరెక్టర్ ప్రభుదేవా మొదటి స్థానంలో ఉండగా.. ఆయన తర్వాత వరుసగా కరణ్ జోహార్, ఫర్హాన్ అఖ్తర్, రాజ్ కపూర్, రాంగోపాల్ వర్మ, ఫరా ఖాన్ తదితరులు ఉన్నారు.
గడిచిన దశాబ్దకాలంలో ఇక అత్యధికమంది సెర్చ్ చేసిన చిత్రంగా ఆమిర్ ఖాన్ నటించిన 'పీకే' మొదటిస్థానంలో నిలువగా.. రాజమౌళి 'బాహుబలి' సినిమా మూడోస్థానం సాధించడం విశేషం. ఈ జాబితాలో పీకే తర్వాత, కహానీ, బాహుబలి, ఆషికీ-2, ధూమ్ 3, కిక్, బజరంగీ భాయ్‌జాన్, హ్యాపీ న్యూఇయర్, హీరో, ఎక్ విలన్ చిత్రాలు నిలిచాయి.
అత్యధిక మంది సెర్చ్ చేసిన అలనాటి నటుల జాబితాలో అమితాబ్ మొదటిస్థానంలో అలనాటి నటీమణుల జాబితాలో రేఖా ఈ గౌరవాన్ని పొందారు.