Mostly sunny
-
సొంతంగా సన్నీ లియోన్ బయోపిక్
ఈ ప్రపంచం మొత్తంలో నా జీవిత కథను ఎలా తీయాలో చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఇది నా జీవితం. నా కథ నేనే చెప్పాలి’’ అని ఇటీవల వ్యాఖ్యానించిన సన్నీ లియోన్, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సన్నీ లియోన్ నిర్మాతగా మారుతు న్నారు. అది కూడా ఆమె జీవితకథ ఆధారంగా తెరకెక్కబోయే సినిమాతో. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ యమా స్పీడుగా జరుగుతోందట. నా కథకు సరైన న్యాయం చేయగల దర్శకుడు ఎవరు? అని బాలీవుడ్లో సన్నీ అన్వేషణ సాగిస్తున్నారు. ఆల్రెడీ సన్నీ లియోన్ జీవిత కథ ఆధారంగా ‘మోస్ట్లీ సన్నీ’ పేరుతో దర్శకుడు దిలీప్ మెహతా ఓ డాక్యుమెంటరీ తీశారు. అందులో భర్త డేనియల్ వెబర్‌తో కలసి సన్నీ స్వయంగా నటించారు. అయితే.. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘మోస్ట్లీ సన్నీ’ ప్రదర్శనకు సన్నీ గైర్హాజరయ్యారు. అసలు విషయం ఏంటని ఆరా తీస్తే.. ‘‘అది నా కథ కాదు. ఎవరి అభిప్రాయాన్నో డాక్యుమెంటరీగా తీశారు. దర్శకుడి విజన్‌కి అనుగుణంగా నిజాయితీగా నటించా. కానీ, వాళ్ల ఇష్టానికి నా కథ మార్చారు. ఆ డాక్యుమెంటరీ ఇండియాలో విడుదల కాకూడదని కోరుకుంటున్నా’’ అని సన్నీ స్పష్టం చేశారు. సుమారు 18 నెలలు కష్టపడి 22 వేల గంటల పాటు షూటింగ్ చేశారు. ఎడిటింగ్ పూర్తయిన తర్వాత ఫైనల్ కట్ చూసి డిజప్పాయింట్ అయ్యానని సన్నీ తెలిపారు. ఓ వర్గం ప్రేక్షకులే చూసేలా చాలా అనవసర విషయాలను డాక్యుమెంటరీలో చేర్చారన్నారు. సంప్రదాయ సిక్కు కుటుంబంలో జన్మించిన అమ్మాయి శృంగారతారగా ఎలా మారింది? అసలు నిజం ఏంటి? అనే విషయాలను తాను తీసే సినిమాలో సన్నీ చెబుతారట! -
ఆ హీరోయిన్‌పై సొంతూరిలోనే వెలివేత!
బాలీవుడ్లో అడుగుపెట్టిన తర్వాత సన్నీ లియోన్ ఇమేజ్ మారిపోయింది. నటిగా విజయం సాధించిన ఆమె మోస్ట్ ఫేమస్ ఇండియన్-కెనడియన్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు. ఇటు భారత్‌లో, అటు కెనడాలో ఆమెను అంగీకరిస్తున్నప్పటికీ.. సొంతూరిలో మాత్రం ఆమె పట్ల విముఖత వ్యక్తమవుతోంది. ఆమె గురించి మాట్లాడటానికి కూడా ఎవరూ ముందుకురావడం లేదు. ఆమెపై ఒక రకమైన సాంఘిక బహిష్కరణ భావం అక్కడ వ్యక్తమవుతుండటం గమనార్హం. తాజాగా సన్నీ లియోన్ జీవితంపై 'మోస్ట్లీ సన్నీ' పేరిట ఓ డాక్యుమెంటరీ రూపొందింది. ఈ డాక్యుమెంటరీలో ఆమె గురించి మాట్లాడేందుకు సొంతూరు వాసులు ఒక్కరూ ముందుకురాలేదు. కెనడియన్ ఒంటారియో ప్రావిన్స్‌లోని సార్నియా పట్టణంలో సన్నీ 35 ఏళ్ల కిందట జన్మించింది. ఆమె అసలు పేరు కెరెన్జిత్ కౌర్ వోహ్రా. సంప్రదాయ సిక్కు కుటుంబంలో పుట్టిన ఆమె పెంట్‌హౌస్ పెట్గా కనిపించి పేరు సాధించింది. ఆ తర్వాత పోర్న్‌స్టార్‌గా మారిన ఆమె గురించి ప్రముఖ ఫిల్మ్ మేకర్ దిలీప్ మెహతా రూపొందించిన ఈ డాక్యుమెంటరీని తాజాగా టోరంటో అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించారు. సన్నీ లియోన్‌ను బాలీవుడ్ నటిగా ఇప్పుడు చాలామంది అంగీకరిస్తున్నారు. పెళ్లిళ్లు, వేడుకలు వంటి వాటికి పిలిచి ఆమెతో ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. కానీ ఆమె సొంతూరైన సార్నియాలోని భారత సంతతి కెనడియన్లు మాత్రం ఆమె పేరు ఎత్తితే చిరాకు పడుతున్నారు. ఈ డాక్యుమెంటరీలో ఆమె గురించి మాట్లాడటానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదని, ఆమెను వారు ఏమాత్రం అంగీకరించడం లేదని ఫిల్మ్ మేకర్ దిలీప్ మెహతా తెలిపారు.