సొంతంగా సన్నీ లియోన్ బయోపిక్ | Here's Why Sunny Leone Doesn't Want Her Life Documentary | Sakshi
Sakshi News home page

సొంతంగా సన్నీ లియోన్ బయోపిక్

Published Wed, Sep 28 2016 11:11 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

సొంతంగా సన్నీ లియోన్ బయోపిక్

సొంతంగా సన్నీ లియోన్ బయోపిక్

ఈ ప్రపంచం మొత్తంలో నా జీవిత కథను ఎలా తీయాలో చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఇది నా జీవితం. నా కథ నేనే చెప్పాలి’’ అని ఇటీవల వ్యాఖ్యానించిన సన్నీ లియోన్, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సన్నీ లియోన్ నిర్మాతగా మారుతు న్నారు. అది కూడా ఆమె జీవితకథ ఆధారంగా తెరకెక్కబోయే సినిమాతో. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ యమా స్పీడుగా జరుగుతోందట.
 
 నా కథకు సరైన న్యాయం చేయగల దర్శకుడు ఎవరు? అని బాలీవుడ్‌లో సన్నీ అన్వేషణ సాగిస్తున్నారు. ఆల్రెడీ సన్నీ లియోన్ జీవిత కథ ఆధారంగా ‘మోస్ట్‌లీ సన్నీ’ పేరుతో దర్శకుడు దిలీప్ మెహతా ఓ డాక్యుమెంటరీ తీశారు. అందులో భర్త డేనియల్ వెబర్‌తో కలసి సన్నీ స్వయంగా నటించారు. అయితే.. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘మోస్ట్‌లీ సన్నీ’ ప్రదర్శనకు సన్నీ గైర్హాజరయ్యారు. అసలు విషయం ఏంటని ఆరా తీస్తే.. ‘‘అది నా కథ కాదు. ఎవరి అభిప్రాయాన్నో డాక్యుమెంటరీగా తీశారు. దర్శకుడి విజన్‌కి అనుగుణంగా నిజాయితీగా నటించా.
 
  కానీ, వాళ్ల ఇష్టానికి నా కథ మార్చారు. ఆ డాక్యుమెంటరీ ఇండియాలో విడుదల కాకూడదని కోరుకుంటున్నా’’ అని సన్నీ స్పష్టం చేశారు. సుమారు 18 నెలలు కష్టపడి 22 వేల గంటల పాటు షూటింగ్ చేశారు. ఎడిటింగ్ పూర్తయిన తర్వాత ఫైనల్ కట్ చూసి డిజప్పాయింట్ అయ్యానని సన్నీ తెలిపారు. ఓ వర్గం ప్రేక్షకులే చూసేలా చాలా అనవసర విషయాలను డాక్యుమెంటరీలో చేర్చారన్నారు. సంప్రదాయ సిక్కు కుటుంబంలో జన్మించిన అమ్మాయి శృంగారతారగా ఎలా మారింది? అసలు నిజం ఏంటి? అనే విషయాలను తాను తీసే సినిమాలో సన్నీ చెబుతారట!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement